- Home
- Entertainment
- Kriti Sanon: రాత్రి పార్టీలో తూలుతూ కెమెరాకి దొరికిన కృతి సనన్.. నెటిజన్ల ట్రోల్స్
Kriti Sanon: రాత్రి పార్టీలో తూలుతూ కెమెరాకి దొరికిన కృతి సనన్.. నెటిజన్ల ట్రోల్స్
Kriti Sanon: కృతి సనన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి పార్టీ తర్వాత తూలుతూ నడుస్తున్న ఆమె వీడియో చూసి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

కబీర్ బహియాతో కలిసి కృతి సనన్
Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సెన్నాన్ శుక్రవారం రాత్రి ముంబైలోని ఓ రెస్టారెంట్ బయట కనిపించింది. ఆమె తన ప్రియుడని చెప్పుకుంటున్న కబీర్ బహియాతో కలిసి అక్కడికి వచ్చింది. ఈ సందర్భంగా కృతి ఫోటోలు వైరల్ అవుతున్నాయి, ఇందులో ఆమె షాకింగ్ లుక్‌లో కనిపించింది.
తూలుతున్న కృతి సనన్
కృతి సనన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, వీటిలో ఆమె తూలుతూ కనిపిస్తోంది. జీన్స్ డ్రెస్‌లో ఉన్న కృతి ఇలా కనిపించడం షాకిస్తుంది.
నడవడానికి కూడా కష్టంగా కృతి
కృతి సెన్నాన్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ, పక్కనే ఉన్న అమ్మాయి సహాయం తీసుకుంది. చూడబోతుంటే ఆమె డ్రింక్ ఎక్కువగా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది.
నెటిజన్ల అనుమానం
కృతి వీడియో చూసి, ఆమె మద్యం మత్తులో ఉందని నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఒక నెటిజన్ "కృతి మేడమ్ ఉల్టాఫల్టా అయ్యింది.. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు`, `అయో కృతికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి?` అంటూ బోల్డ్ గా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు.
డెనిమ్ దుస్తుల్లో కృతి
కృతి సెన్నాన్ ఈ సందర్భంగా డెనిమ్ దుస్తులు ధరించి చాలా అందంగా కనిపించింది.అదే సమయంలో చాలా క్యూట్‌గానూ ఉంది. కృతి ప్రభాస్‌తో `ఆదిపురుష్`లో నటించిన విషయం తెలిసిందే. గతేడాది `డూ పట్టి`, `క్రూ, `తేరి బాటన్ మెయిన్ హైసా ఉల్జా జియా` చిత్రాల్లో నటించింది. ఇప్పుడు `తేరే ఇష్క్ మెయిన్` మూవీలో నటిస్తుంది.
నుపూర్ సనన్ కూడా పార్టీకి
ఈ పార్టీకి కృతితో పాటు ఆమె సోదరి నుపూర్ సనన్ కూడా వచ్చింది. ఆమె ఆకుపచ్చ రంగు దుస్తుల్లో అందంగా కనిపించింది. ఇంకా చెప్పాలంటే అక్క కంటే చెల్లితే డామినేట్ చేస్తుంది.
నటి నుపూర్ సనన్
కృతి లాగే ఆమె సోదరి నుపూర్ కూడా నటి. 'ఫిల్హాల్', 'ఫిల్హాల్ 2 : మొహబ్బత్' వంటి మ్యూజిక్ వీడియోలతో పాటు తెలుగులో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో కూడా నటించింది.
read more: `స్పిరిట్` విషయంలో సందీప్ రెడ్డి వంగా కండీషన్, ప్రభాస్ అయినా సరే ఆ రూల్ పాటించాల్సిందేనా?
also read: OG Update: `ఓజీ`పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన థమన్, అది `ఓజీ` కాదు న్యూక్లియర్ బాంబ్