- Home
- Entertainment
- `స్పిరిట్` విషయంలో సందీప్ రెడ్డి వంగా కండీషన్, ప్రభాస్ అయినా సరే ఆ రూల్ పాటించాల్సిందేనా?
`స్పిరిట్` విషయంలో సందీప్ రెడ్డి వంగా కండీషన్, ప్రభాస్ అయినా సరే ఆ రూల్ పాటించాల్సిందేనా?
Spirit Update: ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా విషయంలో ప్రభాస్‌కి సందీప్ రెడ్డి వంగా పెట్టిన కండీషన్ బయటకు వచ్చింది.

prabhas, sandeep reddy vanga
Spirit Update: సందీప్ రెడ్డి వంగా చేసిన మూడు సినిమాలతోనే పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. జస్ట్ మూడు సినిమాలతోనే టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. ఇదొక అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. దీంతో సందీప్ రెడ్డి వంగా నుంచి సినిమా అంటే అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నారు.
prabhas, sandeep reddy vanga
ప్రభాస్‌లాంటి కటౌట్ సందీప్ రెడ్డికి దొరికితే, ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో ఊహకు కూడా అందదు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో రాబోతున్న `స్పిరిట్` చిత్రంపై అదే స్థాయిలో అంచనాలున్నాయి. ఈ మూవీ ఇంకా ప్రారంభం కూడా కాలేదు.
కానీ అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చింది. ప్రభాస్ కి సందీప్ పెట్టిన కండీషన్ షాకిస్తుంది.
Prabhas, Fauji, Hanu Raghavapudi
ఈ మూవీ ప్రారంభానికి ఇంకా టైమ్ పడుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ చేయాల్సిన `ది రాజా సాబ్`, హను రాఘవపూడి మూవీ `ఫౌజీ`లు షూటింగ్‌లు పూర్తి కావాలి. అవి అయిన తర్వాతనే `స్పిరిట్` ప్రారంభం కావాల్సి ఉంటుందట.
అయితే సహజంగా ప్రభాస్ అటు `ది రాజాసాబ్`, ఇటు `ఫౌజీ` షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఏక కాలంలోనే రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ `స్పిరిట్` విషయంలో అలా చేయడానికి లేదట. కచ్చితంగా తన సినిమా షూటింగ్‌లోనే పాల్గొనాలనే కండీషన్ పెట్టారట సందీప్ రెడ్డి.
The Raja Saab
ప్రస్తుతం చేస్తున్న `ది రాజా సాబ్`, `ఫౌజీ` మూవీస్ షూటింగ్ పూర్తయిన తర్వాతనే తన సినిమాని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. అందుకోసం నెల రోజులు రెస్ట్ కూడా తీసుకోవాలని ప్రభాస్‌కి తెలిపారట. ఈ రెండు సినిమాలు పూర్తి చేసుకున్నాక నెల పాటు ప్రభాస్ రెస్ట్ లో ఉంటారు. ఆ తర్వాత `స్పిరిట్` షూటింగ్‌లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారట.
ఆ తర్వాత నుంచి కంటిన్యూగా తన మూవీకే పరిమితం కావాలని, మరే మూవీ షూటింగ్‌లోనూ పాల్గొనడానికి వీలు లేదని సందీప్ చెప్పినట్టు సమాచారం. డార్లింగ్ కూడా ఆ రకంగానే ప్రిపేర్ అయ్యారని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
prabhas
ఇదిలా ఉంటే ఈ మూవీలో డార్లింగ్ మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని ఇప్పటికే సందీప్ తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా చుట్టూ సినిమా సాగుతుందని తెలుస్తుంది.
అలాగే ఇందులో ప్రభాస్ రోల్ పాజిటివ్‌గా, నెగటివ్‌గా ఉంటాయని సమాచారం. ఊహించని లుక్స్ లో ఆయన కనిపిస్తారని అంటున్నారు. డార్లింగ్‌ని మరి సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్‌లో చూపిస్తారో చూడాలి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉండబోతుందని మాత్రం చెప్పడంలో అతిశయోక్తి లేదు.
read more: OG Update: `ఓజీ`పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన థమన్, అది `ఓజీ` కాదు న్యూక్లియర్ బాంబ్