MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరుకి కూతురు దొరికింది.. ఏకంగా మేనల్లుడి లవర్‌నే పట్టుకున్నారా?

Chiranjeevi: చిరుకి కూతురు దొరికింది.. ఏకంగా మేనల్లుడి లవర్‌నే పట్టుకున్నారా?

చిరంజీవి ఇప్పుడు `మన శంకర వర ప్రసాద్‌ గారు` సక్సెస్‌ ఊపులో ఉన్నారు. ఇదే ఊపులో బాబీతో సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇందులో చిరంజీవి కూతురుగా స్టార్‌ హీరోయిన్‌ నటించబోతుందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 21 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మన శంకర వర ప్రసాద్‌ గారు తో చిరంజీవి సంచలన విజయం
Image Credit : Book My Show

మన శంకర వర ప్రసాద్‌ గారు తో చిరంజీవి సంచలన విజయం

మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌ ఏంటో చూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మించిన సినిమా వచ్చింది. `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ సంచలనం విజయం సాధించింది. ఇది సంక్రాంతి పండక్కి విడుదలైన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసుని షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ఇది మూడు వందల కోట్లుకుపైగా వసూళ్లని రాబట్టింది. చిరంజీవి తన రికార్డులను తానే బ్రేక్‌ చేసుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాబీతో సినిమాకి రెడీ అవుతున్న చిరంజీవి
Image Credit : our own

బాబీతో సినిమాకి రెడీ అవుతున్న చిరంజీవి

`మన శంకర వరప్రసాద్‌ గారు` సక్సెస్‌ ఆనందంలో ఉన్న చిరజంజీవి ఇప్పుడు నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో సినిమాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో `వాల్తేర్‌ వీరయ్య` సినిమా వచ్చింది. అది కూడా సంక్రాంతికి వచ్చి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా చేయబోతున్నారు. దుబాయ్‌లో ఈ మూవీ స్క్రిప్ట్ డిస్కషన్‌ జరిగిందట. ఓకే అయ్యిందని సమాచారం. ఇక షూటింగ్‌ ప్రారంభం కావడమే మిగిలింది.

35
చిరంజీవికి జోడీగా ఐశ్వర్యా రాయ్‌
Image Credit : Asianet News

చిరంజీవికి జోడీగా ఐశ్వర్యా రాయ్‌

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి ఎండింగ్‌లోగానీ, మార్చిలో గానీ సినిమాని ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. మార్చి నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారట. దీనికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నట్టు సమాచారం. అలాగే హీరోయిన్‌గా ఐశ్వర్యా రాయ్‌ని అనుకున్నారట. ఆల్మోస్ట్ ఫైనల్‌ అయ్యిందని సమాచారం. ఈ సినిమాని కేవీఎన్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తోంది. భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి మార్క్ మాస్‌ కమర్షియల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలు ఉంటూనే బాబీ మార్క్ ఎమోషన్స్, స్టయిల్‌, యాక్షన్‌ ఉంటుందని సమాచారం.

45
చిరంజీవికి కూతురుగా స్టార్‌ హీరోయిన్‌
Image Credit : Asianet News

చిరంజీవికి కూతురుగా స్టార్‌ హీరోయిన్‌

ఇందులో కూతురు పాత్ర బలంగా ఉంటుందట. తండ్రి కూతుళ్ల బాండింగ్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని, కూతురు పాత్ర కోసం అన్వేషిస్తున్నారట. అయితే ఆ పాత్రకోసం ఇద్దరు హీరోయిన్లని అనుకుంటున్నారట. ప్రధానంగా కృతి శెట్టి పేరు వినిపిస్తుంది. ఆమెతోపాటు అనస్వర రాజన్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. అనస్వర రాజన్‌ ఇటీవల `ఛాంపియన్‌` మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరిని కన్సిడర్‌ చేస్తున్నారని, వీరిలో ఒకరిని ఫైనల్‌ చేస్తారట. అయితే తెలుస్తోన్న సమాచారం ప్రకారం కృతి శెట్టి ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. త్వరలో ప్రకటన రాబోతుందని సమాచారం.

55
సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి
Image Credit : @krithi.shetty_official

సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి

కృతి శెట్టి.. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ సరసన `ఉప్పెన` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. బేబమ్మగా ఇరగదీసింది కృతి. దీంతో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది. వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసింది. స్క్రిప్ట్ చూసుకోకుండా కాంబినేషన్స్ కి ప్రయారిటీ ఇచ్చింది. దీంతో ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. ఎంత వేగంగా ఎదిగిందో, అంతే వేగంగా డౌన్‌ అయ్యింది. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Related Stories
Recommended image1
Ram Charan: ప్రభాస్‌ వదులుకున్న బ్లాక్‌ బస్టర్‌.. రామ్‌ చరణ్‌కి సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిన సినిమా ఏంటో తెలుసా?
Recommended image2
Balakrishna నే నా వారసుడు, 39 ఏళ్ల క్రితమే ప్రకటించిన ఎన్టీఆర్.. అసలు తేడా కొట్టింది ఇక్కడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved