- Home
- Entertainment
- Balakrishna నే నా వారసుడు, 39 ఏళ్ల క్రితమే ప్రకటించిన ఎన్టీఆర్.. అసలు తేడా కొట్టింది ఇక్కడే
Balakrishna నే నా వారసుడు, 39 ఏళ్ల క్రితమే ప్రకటించిన ఎన్టీఆర్.. అసలు తేడా కొట్టింది ఇక్కడే
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి మూడు సార్లు సీఎంగా చేశారు. ఆ సమయంలోనే తన రాజకీయ వారసుడు బాలకృష్ణ అని ప్రకటించారు. కానీ రామారావుకి ఎక్కడ మోసం జరిగింది. బాలయ్య ఏం చేశాడు?

బాలకృష్ణని తన వారసుడిగా ప్రకటించిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ సినిమా రంగంలో తిరుగులేని స్టార్ గా ఎదిగారు. లెజెండరీ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. హీరోగా పీక్ కెరీర్‌ని చూశాడు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 1982లో ఆయన రాజకీయ పార్టీని స్థాపించారు. తెలుగు దేశం పార్టీని స్థాపించిన 10 నెలల్లోనే ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసిన మొదటిసారినే సీఎం అయ్యాడు. 1983లో ఆయన మొదటిసారి సీఎం అయ్యారు. మొత్తంగా మూడు సార్లు సీఎంగా చేశారు. అయితే ఎన్టీఆర్ సీఎంగానూ పీక్‌లో ఉన్న సమయంలోనే తన వారసుడు బాలకృష్ణ నే అని ప్రకటించడం విశేషం.
సంచలనంగా మారిన ఎన్టీఆర్ ప్రకటన
ఎన్టీఆర్ సీఎం అయ్యాక నాలుగేళ్లకి తొలిసారి మండల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1987 మార్చి 10 చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఓ వైపు, బాలయ్య మరో వైపు ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు ఎన్నికల ప్రచారం చేసుకుంటూ మదనపల్లిలో ఒకే స్టేజ్‌పై కలిశారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్.. రాజకీయాల్లోనూ బాలకృష్ణనే తన వారసుడు అని ప్రకటించారు. అప్పట్లో సినిమా రంగంలోనూ బాలయ్యనే వారసుడిగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లోనూ తన వారసుడు బాలయ్యనే అని ప్రకటించడం విశేషం. దీంతో అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది. వార్తా పత్రికల్లో మెయిన్ పేజీ న్యూస్‌గా ప్రచురితం అయ్యింది.
బాలయ్య ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా?
ఎన్టీ రామారావు బతికి ఉన్నప్పుడు బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ ఇప్పుడు వరుసగా రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన తండ్రి ఎన్టీఆర్ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన ముందు ఉంటున్నారు. అయితే బాలయ్య ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లో రాణించడం వరకు ఓకే కానీ సీఎం కాకపోవడమే ఇక్కడ నందమూరి అభిమానులకు వెలతిగా ఉందని చెప్పొచ్చు. బాలయ్య కూడా తండ్రిలాగానే సీఎం అయి ఉంటే ఆయన మాటకు న్యాయం జరిగేది. తండ్రి కోరిక నిలబెట్టిన వారు అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే టీడీపీ మొత్తం చంద్రబాబు నాయుడు కంట్రోల్‌లో ఉంది. అందులో బాలయ్య ఒక పావు మాత్రమే అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. అయితే బాలయ్యకి వ్యక్తిగతంగా, రాజకీయంగా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అవే ఆయన్ని సీఎంని కాకుండా ఆపుతున్నాయనేది మరో మాట. దీనికితోడు తన వారసుడు అనుకున్న బాలయ్యనే చంద్రబాబుతో చేతులు కలిపి ఎన్టీఆర్‌ని మోసం చేశారనేది మొన్నటి వరకు అంతా మాట్లాడుకున్నారు. ప్రతిపక్షాలు నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాలయ్య.. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా? అనేది ప్రశ్న.
హరికృష్ణని కాదని బాలయ్య పేరు ప్రకటనతో షాక్
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ 1987లో ఆ ప్రకటన చేసే టైమ్‌లో బాలకృష్ణ రాజకీయాల్లో లేరు. సినిమా హీరోగానే రాణిస్తున్నారు. కానీ హరికృష్ణ పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. రథయాత్ర చేపట్టినప్పుడు తండ్రికి బ్యాక్ బోన్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ విజయంలో హరికృష్ణది కీలక పాత్ర అని చెప్పొచ్చు. పైగా రాజకీయాలకు సంబంధించి మంచి అవగాహన ఉంది. అలాంటి హరికృష్ణని కాదని బాలయ్యని తన రాజకీయ వారసుడిగా ప్రకటించడమే అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే అందరిని ఆకర్షించింది, ఆశ్చర్యపరిచింది. బాలయ్య ఇమేజ్, ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ ఈ ప్రకటన చేసి ఉండొచ్చు.
బాలయ్య నెక్ట్స్ సినిమా ఇదే
బాలకృష్ణ ఇటీవల `అఖండ 2` చిత్రంలో నటించారు. డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఇది బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నారు. భారీ పీరియాడికల్, హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందట. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. `అఖండ 2` ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీపై భారీ బడ్జెట్‌తో సాహసం చేయలేమని కథలో మార్పులు చేస్తున్నారట. పీరియడ్ అంశాలు తీసేసి, రెగ్యూలర్ కమర్షియల్ మూవీగా మారుస్తున్నారని సమాచారం.

