- Home
- Entertainment
- Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
Krishnam Raju: తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ల గురించి గతంలో కృష్ణంరాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనతో నటించిన వాణిశ్రీ, కృష్ణ కుమారితో పాటు సీనియర్ హీరోయిన్ సావిత్రి గురించి కూడా ఆయన మాట్లాడారు?

రెబల్ స్టార్' కృష్ణంరాజు అనుభవాలు - జ్ఞాపకాలు
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా కృష్ణం రాజుకు వెలుగు వెలిగారు. సినిమాల్లో తనదైన యాక్షన్, ఎమోషనల్ నటనతో 'రెబల్ స్టార్'గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు.. తన సినీ ప్రస్థానంలోని పలు ఆసక్తికర విషయాలను పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. వెండితెరపై కనిపించే గంభీరమైన పాత్రలకు, నిజ జీవితంలోని తన స్వభావానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించడంతో పాటు, తనతో నటించిన హీరోయిన్ల గురించి.. వారి అద్భుత నటనపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
రియల్ లైఫ్ లవ్ - అన్నయ్య అన్నది ఎవరంటే?
సినిమాల్లో ఎంత సీరియస్‌గా కనిపించినప్పటికీ, నిజ జీవితంలో తాను స్నేహితులను, చుట్టూ ఉన్నవారిని ఎంతో ప్రేమిస్తానని కృష్ణంరాజు చెప్పారు. అప్పట్లో తనకు చాలా ప్రేమ లేఖలు వచ్చేవని, కానీ.. 'అమరదీపం' సినిమా విడుదలైన తర్వాత తనకు ఎంతోమంది మహిళా అభిమానుల నుండి లేఖలు వచ్చాయి కానీ.. వారంతా తనను అన్నలా భావించారని కృష్ణంరాజు అన్నారు. అంతే కాదు కొంత మంది లెటర్స్ లో తమకు సొంత సోదరులు లేరని, తననే 'అన్నయ్య'గా భావిస్తున్నామని ఎంతో ఆప్యాయంగా రాసేవారని గుర్తుచేసుకున్నారు.
6 ఏళ్లు పెద్దదైన హీరోయిన్ తో రొమాన్స్..
రీల్ లైఫ్‌లోని రొమాంటిక్ .. అగ్రెసివ్ పాత్రలకు, నిజ జీవితానికి పొంతన ఉండదని కృష్ణంరాజు స్పష్టం చేశారు. తన తొలి చిత్రంలో తనకంటే 6 ఏళ్లు పెద్దవారైన సీనియర్ హీరోయిన్ కృష్ణకుమారి గారితో కలసి నటించిన విషయాన్ని గుర్తుచేశారు. మరి ఆమెతో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాను కదా.. కెమెరా ముందు చేసే నటన వేరని, బయట నిజ జీవితంలో ఉండే నైజం వేరు. యాక్షన్ సీన్స్ లో విలన్స్ ను పొడుస్తాము.అలా అని నిజ జీవితంలో పొడుచుకుంటూవెళ్తామా అని సరదాగా వ్యాఖ్యానించారు.
వాణిశ్రీ అంటే ఇష్టం.. సావిత్రి పై గౌరవం
తనతో కలిసి పనిచేసిన నటీమణుల్లో వాణిశ్రీ నటన తనకు ఎంతో ఇష్టం అన్నారు కృష్ణంరాజు. ఆమె నటను చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ.. '' నేను నిర్మించిన మొదటి సినిమా కృష్ణవేణిలో వాణిశ్రీని తీసుకున్నాను. ఆ సినిమాలో ఆమె నటన చూసి షాక్ అయ్యాను. టేక్ అయిపోయిన తరువాత కూడా ఆమె కొద్దిసేపు క్యారెక్టర్ లోనే ఉండిపోయేవారు''. అని అన్నారు.
భక్త కన్నప్ప చాలా ప్రత్యేకం..
కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘’మేమిద్దరం భక్త కన్నప్ప లాంటి మరికొన్ని మంచి సినిమాల్లో నటించాం. భక్త కన్నప్ప' చిత్రంలో సెట్స్‌పై సాధారణంగా మాట్లాడుతూనే, షాట్ అనగానే ఒక్కసారిగా ఆ పాత్రలో లీనమై డైరెక్టర్ ఊహించిన దానికంటే అద్భుతంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేవారు.. అంత అద్భుతమైన నటికి ఇప్పుడైతే నేషనల్ అవార్డ్ రావాలి. నాకు నటిగా సావిత్రిగారంటే చాలా గౌరవం.. వాణిశ్రీ నటన అంటే చాలా ఇష్టం'' అని కృష్ణంరాజు అన్నారు.
సావిత్రికి వీరాభిమానిని
మహానటి సావిత్రి గారికి తాను నటుడి కంటే ముందుగా ఓ అభిమానినని, అలాగే వాణిశ్రీ గారిని నటిగా ఎంతో గౌరవిస్తానని కృష్ణంరాజు తెలిపారు. ఆ తర్వాతి తరం నటీమణుల్లో జయసుధ గారి నటన కూడా ఎంతో గొప్పగా ఉండేదని కృష్ణంరాజు వెల్లడించారు. అంతే కాదు సూపర్ స్టార్ కృష్ణతో తన స్నేహం గురించి కూడా కృష్ణంరాజు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూకు సబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.