- Home
- Entertainment
- Krishna Mukunda Murari: నిజం చెప్పి అందరికీ షాకిచ్చిన ముకుంద.. మురారిని అపార్థం చేసుకుంటున్న కృష్ణ!
Krishna Mukunda Murari: నిజం చెప్పి అందరికీ షాకిచ్చిన ముకుంద.. మురారిని అపార్థం చేసుకుంటున్న కృష్ణ!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. కొడుకు కాపురం సరిచేయాలని తపన పడుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నాకైనా ఎందుకు నిజం చెప్పలేదు నేను నీకు అంత పరాయిదాన్ని అయిపోయాను నిన్ను నా కన్న కూతురనే అనుకున్నాను. నువ్వు నీ భర్త దగ్గర నటిస్తున్నట్లు నా దగ్గర కూడా ప్రేమని నటిస్తున్నావా అని కృష్ణని అడుగుతుంది రేవతి. అలాంటిదేమీ లేదు అత్తయ్య అగ్రిమెంట్ తోనే ఈ ఇంట్లో అడుగు పెట్టాను కానీ మీ అందరి అభిమానం ముఖ్యంగా మీతో నా బంధము నన్ను ఈ ఇంటికి ముడి వేసాయి అంటుంది కృష్ణ.
అగ్రిమెంట్ పూర్తయిపోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా వెళ్ళను అని మాట ఇవ్వు అని చెయ్యి చాపుతుంది రేవతి. అత్తయ్య.. అని గట్టిగా పిలుస్తుంది కృష్ణ. స్పృహలోకి వచ్చిన రేవతి ఇంతసేపు తను కలగన్నట్లుగా గ్రహిస్తుంది. ఏం జరిగింది అని అడుగుతుంది కృష్ణ. చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పొద్దు కానీ ఏమీ లేదని మాత్రం చెప్పకండి అంటుంది కృష్ణ. అలాంటిదేమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది రేవతి.
అత్తయ్య కూడా మురారి లాగే నా దగ్గర ఏదో దాస్తున్నారు అనుకుంటుంది కృష్ణ. ఇదంతా చూస్తున్నా అలేఖ్య నీకు ఏం అర్థమైంది అని భర్తని అడుగుతుంది. నీకు పని పాట లేదని అర్థమైంది అంటాడు మధు. భర్తని కోపంగా చూస్తుంది అలేఖ్య. ఆ తరువాత కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని కొడుకుని ముకుందని తిట్టుకుంటుంది రేవతి. అంతలోనే ఏడుస్తూ ఇంటికి వచ్చిన ముకుందని మురారితో కలిసి ఎక్కడికి వెళ్లావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది రేవతి.
మీ బాధ నేను మురారితో కలిసి వెళ్లాననా లేకపోతే మీకు చెప్పకుండా వెళ్ళాననా అంటుంది ముకుంద. ఏదైనా సరే కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది అందుకే అడిగాను అంటుంది రేవతి. మా అమ్మకు బాగోలేదు పొద్దుటి నుంచి హాస్పిటల్ కి తిరుగుతున్నాను తనకి క్యాన్సర్ అంట అని చెప్పి ఏడుస్తుంది ముకుంద. ఆ మాటలు విన్న ప్రశ్న కూడా బాగా ఎమోషనల్ అవుతుంది.
బాధపడొద్దు కావాలంటే అమెరికా అయినా తీసుకొని వెళ్ళి బాగు చేయిద్దాం అంటుంది. ఇంతలోనే మురారి వస్తాడు. అత్తయ్యకి ఎలా ఉంది అని ముకుందని అడుగుతాడు. ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ముకుంద. కృష్ణ కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైంది అని తల్లిని అడుగుతాడు మురారి. ముకుంద తల్లి సంగతి చెప్పి బాధపడుతుంది రేవతి. తను సరే బాధలో ఉంది నీకేమైంది ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు అని అడుగుతుంది రేవతి.
మా ఫోన్లన్నీ ట్రాకింగ్ కి గురయ్యాయట కమిషనర్ గారు చెప్పటంతో మొత్తం స్టాఫ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసాం అని చెప్పి లోపలికి వెళ్తాడు మురారి. మూతి ముడుచుకున్న కృష్ణని చూసి ఏంటి బెట్టు చేస్తున్నావా అని అడుగుతాడు. మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు నాకు చాలా బాధనిపించింది అంటుంది కృష్ణ. మరెప్పుడు ఇలా చేయను అని చెప్పి కృష్ణ చేతిలో చేయి వేసి సారీ చెప్తాడు మురారి. కానీ అప్పుడప్పుడు ఇలా చెప్పకుండా వెళ్లిపోవడం కూడా బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు మురారి.
అంటే ఎసిపి సర్ కొంచెం కొంచెంగా తన ఆప్సేన్సి నాకు అలవాటు చేస్తున్నారా అని అనుకుంటుంది కృష్ణ. మరోవైపు మధు తెచ్చుకున్న బాటిల్ అలేఖ్య తాగేస్తుంది. నీకేం పోయేకాలం వచ్చింది నువ్వు ఎందుకు మందు తాగుతున్నావ్ అని అడుగుతాడు మధు. మురారి, ముకుంద మధ్యలో ఎఫైర్ ఉందని చెప్తుంది అలేఖ్య. ఈ విషయం నాకు తెలుసు కానీ ఎవరికి చెప్పినా నమ్మరు అంటాడు మధు. నేను రేవతి అత్తయ్యకి చెబుదామని మందు కొట్టాను.
కానీ ఆవిడ నిన్ను కొట్టినట్లు నన్ను కొడతారేమో భయం వేసింది అంటుంది అలేఖ్య. చేసింది చాల్లే ఇంకొంచెం పడుకో ఇంకా నేను నీ దగ్గర కూడా నేను బాటిల్ దాచుకోవాలి ఏమో అని భార్యని తీసుకెళ్లి పడుకోబెడతాడు మధు. తరువాయి భాగంలో ఈరోజు పౌర్ణమి భర్త చేత్తో వారికి మెట్టెలు తొడిగితే మంచిది అని చెప్పి మురారి చేత్తో కృష్ణకి మెట్టెలు తొలగిస్తుంది రేవతి. అది చూసిన ముకుంద బాధపడుతుంది. అది గమనిస్తుంది రేవతి.