- Home
- Entertainment
- Krishna Mukunda Murari: భర్త జీవితంలో మరో అమ్మాయి ఉందని తెలుసుకున్న కృష్ణ.. అనుమానంలో ముకుందా?
Krishna Mukunda Murari: భర్త జీవితంలో మరో అమ్మాయి ఉందని తెలుసుకున్న కృష్ణ.. అనుమానంలో ముకుందా?
Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ప్రేమించిన అమ్మాయి మరొకవైపు పెళ్లి చేసుకున్న అమ్మాయి మధ్యలో నలిగిపోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కృష్ణుడి బొమ్మని చూపిస్తుంది కృష్ణ. మురారి మాత్రం మనం విడిపోయే డేటు దగ్గర పడుతుందని చూపిస్తుంది అని అనుకొని అపార్థం చేసుకొని బాధపడతాడు. ఇప్పుడు నా ప్రేమని ఎలాగా ఎక్స్ ప్రెస్ చేయాలి, ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో ఎలా అడగాలి అనుకుంటుంది కృష్ణ. మరోవైపు మధుకర్ తను తీసిన రీల్ ని అందరికీ చూపించడానికి ప్రిపేర్ అవుతాడు.
ఫోన్ నుంచి టీవీకి స్క్రీన్ మిర్రర్ పెడుతూ ఉంటాడు. త్వరగా సెట్ చేయి లేకపోతే నేను నిన్ను సెట్ చేస్తాను అంటాడు ప్రసాద్. ఇంతలోనే మురారి దంపతులు కూడా కిందికి వస్తారు. వీడియో ప్లే చేస్తాడు మధు. మురారి కి కృష్ణ ప్రపోజ్ చేయడం చూసి అందరూ ఆనందిస్తారు. కానీ ముకుంద మాత్రం మొఖం ముడుచుకుంటుంది.
నా మనసులో ఉన్న భావాలని తన మాటల ద్వారా ఇంత అందంగా ఎలా చెప్పగలిగింది. అంటే కృష్ణ మురారి ప్రేమలో పడిపోయిందా అంటూ కంగారు పడుతుంది ముకుంద. వీడు ఈ వీడియో ని నా కోసమే తీసినట్లుగా ఉన్నాడు. కృష్ణ రీల్ కోసం మాట్లాడిన మాటలు నిజ జీవితంలో ఎప్పుడు చెప్తుందా అని ఎదురుచూస్తున్నాను అనుకుంటాడు మురారి.
ఇవి స్క్రిప్ట్ లో మాటలు కాదు నా మనసులో మాటలు ఆ విషయం మురారికి అర్థమవుతుందో లేదో అనుకుంటుంది కృష్ణ. కృష్ణ మోహంలో మురారి పట్ల ఆరాధన స్పష్టంగా కనిపిస్తుంది అనుకొని బాధపడుతుంది ముకుంద. ఈ లోగా రీల్ అయిపోతుంది. ఏమో అనుకున్నాను కానీ నీకు కూడా టాలెంట్ ఉంది అంటూ కొడుకుని మెచ్చుకుంటాడు ప్రసాద్.
రేవతి వాళ్లు కూడా మధుని అప్రిషియేట్ చేస్తారు. ముకుంద ముభావంగా ఉండడం గమనిస్తుంది అలేఖ్య. ఎందుకు అలా ఉన్నావు పదా భోజనం చేద్దాము అంటుంది. ఏమీ లేదు అని మాట తప్పించేస్తుంది ముకుంద. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వెళ్లి నీలో మంచి నటి దాగి ఉంది డైలాగులు చాలా బాగా చెప్పావు అంటుంది ముకుంద. ఆ డైలాగులు స్క్రిప్ట్ లో లేవు నా మనసులోంచి వచ్చినవి అంటూ సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ.
నాలుగు రోజుల్లో వెళ్ళిపోయే అమ్మాయికి ఎందుకు ఇన్ని ఎమోషన్స్ అనుకుంటుంది ముకుంద. మరోవైపు భోజనాల దగ్గర కూర్చుంటారు మురారి కుటుంబ సభ్యులందరూ. నువ్వు కథ, స్క్రిప్ట్ అనుకుంటుంటే సినిమా పిచ్చోడు అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగా తీశావు అని మెచ్చుకుంటుంది రేవతి. థాంక్స్ పెద్దమ్మ ఇంకొక కాన్సెప్ట్ ఉంది వింటావా అంటాడు మధు. భోజనాలు దగ్గర అలాంటివేటి పెట్టకు మేము భరించలేము అంటాడు ప్రసాద్.
మీరు ఉండండి అంటూ భర్తని మందలించి కొడుకుని స్క్రిప్ట్ చెప్పమంటుంది సుమ. కథ చెప్తూ ఉంటాడు మధు. తెలిసి చెప్తాడో తెలియక చెప్తాడో తెలియదు కానీ అది మురారి వాళ్ళ కథ. ఇదేదో మా కథ లాగా ఉంది అనుకుంటారు మురారి, ముకుంద. కథలో తన ప్రేమికుడిని అతను రాసుకున్న డైరీ చదివి అతనికి ముందే ప్రియురాలు ఉందని తెలుసుకొని ఈ విషయం ముందే నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రియుడు చెంప పగలగొడుతుంది ప్రియురాలు.
అది విన్న మురారి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ముకుందని ప్రేమించిన రోజుల్లో రాసిన డైరీ తన గదిలోనే ఉంటుంది ఒకవేళ కృష్ణ చూసిందంటే ఇంకెప్పటికీ తను నాకు దక్కదు అనుకుని గబగబా భోజనం చేసి వెళ్ళిపోతాడు. మురారి ఎందుకు అలా చేస్తున్నాడు అర్థం కాదు కృష్ణకి. మురారిని అడిగితే ఏమీ లేదు అని చెప్తాడు. తన గదికి వెళ్లిన మురారి డైరీ ని తీసి కాల్చేద్దాం అనుకుంటాడు. కానీ ఇంతలో కృష్ణ రావటం చూసి తన షర్టులో పెట్టేసుకుంటాడు. బయటికి వెళ్లి కాల్చేద్దాం అనుకొని కిందికి వెళ్తాడు. హాల్లో అందరూ కూర్చొని ఉండటం చూసి కంగారు పడతాడు. ఈ పుస్తకం ఇంట్లో ఉండి కృష్ణకి దొరికిపోవడం కన్నా వీళ్ళకి సమాధానం చెప్పుకోవటమే సులువు అనుకొని బయటికి వెళ్ళబోతాడు మురారి.
ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది రేవతి. చిన్న పని ఉంది ఇప్పుడే వచ్చేస్తాను అంటాడు మురారి. పెద్ద వదిన ఉండేటప్పుడు పాన్ తినడానికి అయ్యేది కాదు. ఇప్పుడు నాకు పాన్ తినాలని ఉంది నేను కూడా నీతో వస్తాను అంటాడు ప్రసాద్. ఆ వెనకే మేము వస్తాము అంటూ తయారవుతారు మధు, అలేఖ్య. ఇంతమంది వస్తే ఈ డైరీ ని బయట పడేయడం ఎలా అనుకుంటాడు మురారి. తరువాయి భాగంలో గదిని సర్దుతున్న కృష్ణకి డైరీ కంట పడుతుంది. అది చదివిన కృష్ణకి మురారి జీవితంలో మరొక అమ్మాయి ఉందని తెలుస్తుంది.