MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Arya Underwater Stunt: హాలీవుడ్ రేంజ్ రిస్క్.. గడ్డకట్టే నీళ్ళల్లో 90 నిమిషాలు ఫైట్, సినిమా కోసం హీరో సాహసం

Arya Underwater Stunt: హాలీవుడ్ రేంజ్ రిస్క్.. గడ్డకట్టే నీళ్ళల్లో 90 నిమిషాలు ఫైట్, సినిమా కోసం హీరో సాహసం

హీరో ఆర్య తన కొత్త సినిమా 'మిస్టర్ ఎక్స్' కోసం గడ్డకట్టే చలిలో, నీటి అడుగున ఏకంగా గంటన్నర పాటు ఫైట్ సీన్‌లో నటించాడు. అభిమానులను ఆశ్చర్యపరిచిన ఆర్య డెడికేషన్ గురించి ఈ గ్యాలరీలో చూద్దాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 15 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆర్యా నీటి అడుగున ఫైట్ సీన్
Image Credit : PR Team

ఆర్యా నీటి అడుగున ఫైట్ సీన్

డైరెక్టర్ మను ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'మిస్టర్ ఎక్స్' (Mr X). ఈ సినిమా కోసం హీరో ఆర్య చూపిన డెడికేషన్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలోని ఓ కీలకమైన, సవాలుతో కూడిన ఫైట్ సీన్‌ను నీటి అడుగున చిత్రీకరించాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్య ఫిట్‌నెస్ సీక్రెట్
Image Credit : our own

ఆర్య ఫిట్‌నెస్ సీక్రెట్

సాధారణ నీటిలో నటించడమే కష్టం. అలాంటిది, షూటింగ్ జరిగినప్పుడు అక్కడ వాతావరణం చాలా దారుణంగా ఉంది. దాదాపు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, ఎముకలు కొరికే చలిలో ఆర్య నీటిలోకి దిగి నటించాడు. శరీరాన్ని వణికించే ఆ చలిని కూడా లెక్కచేయకుండా, ఊపిరి బిగబట్టి, వణుకును కంట్రోల్ చేసుకుని ఆ ఫైట్ సీన్‌ను పూర్తి చేశాడు. సుమారు గంటన్నర పాటు నీటి అడుగునే ఉండి, షూటింగ్‌కు సహకరించాడు.
35
ఆర్య డెడికేషన్
Image Credit : our own

ఆర్య డెడికేషన్

యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఆర్య ఎప్పుడూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటాడు, ఫిట్‌గా ఉంటాడు. అయినా, ఇంత లోతైన నీటిలో, ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఊపిరి బిగబట్టి ఫైట్ చేయడం ప్రాణాలకే ప్రమాదం. ఆర్య అద్భుతమైన కష్టాన్ని, వృత్తి పట్ల అతనికున్న అంకితభావాన్ని చూసి డైరెక్టర్ మను ఆనంద్, చిత్ర యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ సీన్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని వారు నమ్ముతున్నారు.
45
ఆర్య కొత్త సినిమా అప్‌డేట్
Image Credit : Twitter

ఆర్య కొత్త సినిమా అప్‌డేట్

నిజ జీవిత సంఘటనల ఆధారంగా, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో 'మిస్టర్ ఎక్స్' సినిమాను రూపొందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆర్య డెడికేషన్ చూసి సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. టెక్నికల్‌గా, యాక్షన్ సీక్వెన్స్‌ల పరంగా ఈ సినిమా ఓ కొత్త మైలురాయిగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
55
కఠినమైన సన్నివేశాల్లో డూప్ లేకుండా ఆర్య
Image Credit : our own

కఠినమైన సన్నివేశాల్లో డూప్ లేకుండా ఆర్య

ఇంతటి కఠినమైన సన్నివేశాల్లో డూప్ లేకుండా ఆర్య నటించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో ఆర్యతో పాటు గౌతమ్ కార్తీక్ వంటి పలువురు ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారని తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
OTT: ప్రైమ్ వీడియోలో 'ఎ' సర్టిఫికెట్ సినిమాల డామినేషన్.. అర్జెంట్ గా చూడాల్సిన టాప్ 5 మూవీస్ ఇవే
Recommended image2
Chiranjeevi: ఆయన్ని నమ్మి వచ్చిన హీరోయిన్, చిరంజీవి సినిమాతో ఘోర అవమానం..సెట్ లో అందరి ముందు అసభ్యంగా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved