MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreemukhi Remuneration: శ్రీముఖి ఒక్క షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందో తెలుసా? బుల్లితెర క్వీన్ అనేది ఇందుకే

Sreemukhi Remuneration: శ్రీముఖి ఒక్క షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందో తెలుసా? బుల్లితెర క్వీన్ అనేది ఇందుకే

ఒకప్పుడు షోస్‌ లేక ఇంట్లో ఖాళీగా ఉన్న యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై టాక్‌ యాంకర్‌గా రాణిస్తోంది. అదే సమయంలో చాలా ఖరీదైన యాంకర్‌గానూ నిలుస్తోంది. మరి శ్రీముఖి ఒక్క షోకి ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 15 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శ్రీముఖి పారితోషికం
Image Credit : instagram/@sreemukhi

శ్రీముఖి పారితోషికం

బుల్లితెర రాములమ్మగా పేరుతెచ్చుకున్న శ్రీముఖి, ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్లలో టాప్‌లో కొనసాగుతున్నారు. `పటాస్`షోతో కెరీర్ మలుపు తిప్పుకున్న ఆమె, ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు వంటి రియాలిటీ షోలతో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకున్నారు. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, గలగలా మాట్లాడే మాటలతో, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో షో ఏదైనా సరే తన భుజాలపై మోయగల సామర్థ్యం శ్రీముఖి సొంతం. ఈ పాపులారిటీయే ఆమె రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, శ్రీముఖి ఒకే ఒక్క షో, ఈవెంట్ కోసం దాదాపు రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ యాంకర్లుగా ఉన్న సుమ కనకాలకి ధీటుగా శ్రీముఖి షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

25
శ్రీముఖి నెల ఇన్‌కమ్‌ ఎంతంటే?
Image Credit : instagram/@sreemukhi

శ్రీముఖి నెల ఇన్‌కమ్‌ ఎంతంటే?

టెలివిజన్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా, సినిమా ఆడియో ఫంక్షన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ప్రైవేట్ ఓపెనింగ్స్ ద్వారా శ్రీముఖి సంపాదన భారీగానే ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా ఈవెంట్ హోస్ట్ చేయాలంటే ఆమె కనీసం రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల మధ్య పారితోషికం తీసుకుంటారని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఒక నెలలో ఆమె చేతిలో కనీసం 3 నుండి 4 పెద్ద షోలు, మరో వైపు స్టార్ మా, ఈటీవీ వంటి ఛానెళ్లలో రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ లెక్కన చూస్తే శ్రీముఖి నెలవారీ ఆదాయం సుమారు రూ. 20 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేవలం కెమెరా ముందుకు రావడమే కాకుండా, తనదైన మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడం వల్ల నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనుకాడటం లేదు. ఈ విషయంలో ఆమె యాంకర్‌ సుమకి పోటీ ఇస్తుండటం విశేషం. ఇంకా చెప్పాలంటే శ్రీముఖి.. సుమని డామినేట్‌ చేసి, ఆమె స్థానాన్ని దక్కించుకున్నారు.

Related Articles

Related image1
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌
Related image2
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
35
శ్రీముఖి ఇన్‌ కమ్‌ సోర్స్ తెలిస్తే మతిపోవాల్సిందే
Image Credit : instagram/sreemukhi

శ్రీముఖి ఇన్‌ కమ్‌ సోర్స్ తెలిస్తే మతిపోవాల్సిందే

శ్రీముఖి ఇన్‌కమ్‌ సోర్స్ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాలేదు. సోషల్ మీడియా హవా నడుస్తోన్న నేపథ్యంలో ఆమె ఒక టాప్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నిలుస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఉన్న మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ కారణంగా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, పెయిడ్ ప్రమోషన్ల ద్వారా ఆమె భారీగా ఆర్జిస్తున్నారు. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ పోస్ట్, వీడియో కోసం ఆమె లక్షల్లో ఛార్జ్ చేస్తారని సమాచారం. దీనికి తోడు అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ ప్రత్యేక పాత్రల ద్వారా అదనపు పారితోషికాన్ని అందుకుంటున్నారు. నటిగా, యాంకర్‌గా, మోడల్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తూ, ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, టెలివిజన్ రంగంలో మహిళా యాంకర్ల పవర్ ఏంటో నిరూపిస్తున్నారు. బుల్లితెర క్వీన్‌గా నిలుస్తున్నారు.

45
కోట్లకు ఎదిగిన శ్రీముఖి
Image Credit : instagram/Sreemukhi

కోట్లకు ఎదిగిన శ్రీముఖి

పరిశ్రమలో ఉన్న విపరీతమైన పోటీని తట్టుకుని శ్రీముఖి ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం వెనుక ఆమె కష్టం, సమయస్ఫూర్తి దాగి ఉన్నాయి. షూటింగ్స్ కోసం గంటల తరబడి నిలబడటం, నిరంతరం ఉత్సాహంగా ఉండటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా పండుగ సీజన్లలో వచ్చే స్పెషల్ షోల కోసం ఆమెకు మరింత డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో ఆమె రెమ్యునరేషన్ డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి తన టాలెంట్‌తో ఒక సాధారణ యాంకర్‌గా మొదలై, నేడు కోట్లలో ఆస్తులు సంపాదించే స్థాయికి ఎదగడం శ్రీముఖి సక్సెస్ గ్రాఫ్ కి నిదర్శనం. ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఆమె పారితోషికం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

55
శ్రీముఖి చేస్తన్న షోస్‌
Image Credit : Sreemukhi/Instagram

శ్రీముఖి చేస్తన్న షోస్‌

శ్రీముఖి ప్రస్తుతం `ఆదివారం స్టార్ మా పరివారం`, `మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌` వంటి షోలకు హోస్ట్ గా చేస్తోంది. వీటితోపాటు స్పెషల్‌ షోస్‌, ఫెస్టివల్‌ షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది.  బిజీ యాంకర్‌గా రాణిస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Arya Underwater Stunt: హాలీవుడ్ రేంజ్ రిస్క్.. గడ్డకట్టే నీళ్ళల్లో 90 నిమిషాలు ఫైట్, సినిమా కోసం హీరో సాహసం
Recommended image2
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో
Recommended image3
OTT: ప్రైమ్ వీడియోలో 'ఎ' సర్టిఫికెట్ సినిమాల డామినేషన్.. అర్జెంట్ గా చూడాల్సిన టాప్ 5 మూవీస్ ఇవే
Related Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌
Recommended image2
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved