Krishna Mukunda Murari: రేవతి కోరిక విని షాకైన కృష్ణ దంపతులు.. ఆశ్చర్యంలో ముకుంద?
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కోడలికి అన్యాయం జరుగుతుందని భయపడుతున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే అనాధాశ్రమంలో ఆడుకుంటున్న మురారిని చూసి ఇంత మంచి మనిషిని నేను వదులుకోవాల్సి వస్తుంది. ఈయన మనసులో ఇంకొకరు లేకపోయినా బాగుండేది. ఈ జన్మకి నా రాత ఇంతే అని బాధపడుతుంది కృష్ణ. తర్వాత వాళ్లు కొంచెం సేపు అక్కడ కళ్ళ గంతులు ఆడుకుంటారు అప్పుడు కృష్ణని చూస్తూ, ఈ అగ్రిమెంట్ ఏవి లేకుండా కృష్ణ జీవితాంతం నాతోనే ఉంటే బాగుండేది కదా అని అనుకుంటాడు. తర్వాత అందరూ వెళ్లి జ్యూస్ తాగుతారు. ఇంతలో మురారి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మామిడి పళ్ళు ఇస్తాడు.
అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు అందరూ వీళ్లకు బాయ్ చెప్తారు. ప్రతివారం మీ దగ్గరికి వచ్చి హెల్త్ చెకప్ నేను చేస్తాను అని అంటుంది కృష్ణ. కార్ ఎక్కి తిరిగి ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది సార్ మీరు చాలా గొప్ప మనిషి అని మనసులో అనుకుంటుంది కృష్ణ. నీకు ఎందుకు వాళ్లకు సహాయం చేయాలనిపించింది కృష్ణ అని అడుగుతాడు మురారి. వాళ్లలాగే నేను అనాధ పిల్లనే కదా సార్ వాళ్లు మాతృభవన్ లో ఉంటున్నారు నేను మీ ఇంట్లో ఉంటున్నాను అంతే తేడా అని అంటుంది. నువ్వు అలా అనద్దు కృష్ణ.
వినడానికి చాలా చేదుగా ఉంది అని అంటాడు మురారి.ఆ తర్వాత సీన్లో ముకుంద తన స్నేహితురాలితో మాట్లాడుతూ, ఇలా జరిగిన విషయం అంతా చిన్న అత్తయ్యకి చెప్పేసాను ఇప్పుడు నా అసలు అత్తగారు ఆవిడే. ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి కూడా చెప్పేసాను. కృష్ణ మురారి ఎప్పుడు విడిపోతే అప్పుడు నేను ఇంక మురారి జీవితంలోకి వెళ్లిపోవచ్చు. ఇంక మాకు ఏ అడ్డులు ఉండవు అని అంటుంది ముకుంద. ఇంత జరిగినా కూడా ఆవిడ ఎలా తట్టుకున్నారు అని అడుగుతుంది తన స్నేహితురాలు. మా కుటుంబంలో అందరివి రాతి గుండెలు.
ఆదర్శ్ కనబడట్లేదు అని తెలిసినప్పుడు కూడా ఓర్చుకున్నారు అలాగే ఇప్పుడు కూడా గుండెను రాయి చేసుకుంటారు అని అంటుంది ముకుంద. మరి కృష్ణ ఖచ్చితంగా వెళ్లిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావా అని అడగగా నేను కూడా అమ్మేదాన్ని కాదు కానీ స్వయంగా మురారే తన మాటల్లో చెప్పాడు. కనుక నమ్ముతున్నాను. కృష్ణ వెళ్లిపోయిన తర్వాత నాకు ఇంక ఏ కష్టాలు ఉండవు నేను, మురారి హాయిగా జీవించొచ్చు అని అనుకుంటుంది ముకుంద. మరోవైపు కృష్ణ కార్ ని ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆపిస్తుంది. ఐస్ క్రీమ్ కొట్టు దగ్గరికి వెళ్లి పుల్లయసును తీసుకొని గ్లాసుల్లో వాటిని కరిగించి జ్యూస్ లాగా చేసి ఇంటికి తెస్తుంది.
అప్పటికే రేవతి హాల్లో కూర్చుని దిగులుగా ఉంటుంది. ఇంతలో కృష్ణ మురారి అక్కడికి వస్తారు. అత్తయ్య చూడండి మీ కోసం నేను ఏం తెచ్చానో అని అంటుంది కృష్ణ. కానీ రేవతి అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు అత్తయ్య అలాగున్నారు? నీరసంగా ఉన్నారా? ఇంటి పనులన్నీ ఆవిడ ఒకరే చేస్తున్నారు కదా అందుకే నీరసం వచ్చినట్టుంది అని అనుకుంటుంది కృష్ణ. ఆ తర్వాత సీన్లో అందరూ భోజనం చేస్తూ ఉండగా ఈ ఇంట్లో ఎవరో నా మీద అలిగినట్టు ఉన్నారు నాతో మాట్లాడడం లేదు అని గట్టిగా అంటుంది కృష్ణ.
అవును నేనే మాట్లాడట్లేదు అయితే ఏంటి అని అంటుంది రేవతి. అదే ఎందుకు అని అడుగుతుంది కృష్ణ. నీ వల్లే అని రేవతి అనగా చిన్న అత్తయ్య అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అందరికీ చెప్పేసేలా ఉన్నారు. పోనీలే అది మంచిదే ఇలాగైనా అందరికీ నిజం తెలుస్తుంది అని అనుకుంటుంది ముకుందా. అప్పుడు రేవతి మీరిద్దరూ కాపురం చేయడం లేదు నాకు ఇప్పుడే మనవళ్ళు కావాలి నాకు ఏం చేస్తారో తెలియదు వచ్చే సంవత్సరం రోజు కల్లా నాకు ఒక మనవడిని కానీ మనవరాలను కానీ చేతిలో పెట్టాలి. ఇప్పుడే గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటుంది. మాకు కొంచెం టైం కావాలి అని అడుగుతారు ఇద్దరూ.
టైం వద్దు ఏమి వద్దు నాకు ఎలాగైనా మనవళ్ళు కావాలి అని అంటుంది రేవతి. చిన్న అత్తయ్య ఎంత తెలివైన వారు కొడుకు కోడలు విడిపోకూడదు అని చెప్పి ఇటువైపు నుంచి నరుక్కొని వస్తున్నారు అని అనుకుంటుంది ముకుంద. మరోవైపు కృష్ణ, మురారి ఆందోళన చెందుతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.