- Home
- Entertainment
- ఎన్టీఆర్ అంటే అందుకే చాలా కోపం, ఆయన చరిత్రని ఆయనే చెరిపివేసుకున్నారు.. ఓపెన్ గా మ్యాటర్ బయటపెట్టిన కోట
ఎన్టీఆర్ అంటే అందుకే చాలా కోపం, ఆయన చరిత్రని ఆయనే చెరిపివేసుకున్నారు.. ఓపెన్ గా మ్యాటర్ బయటపెట్టిన కోట
ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం గురించి కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ తప్పు చేసి ఎన్టీఆర్ తన చరిత్రని తానే చెరిపివేసుకున్నారు అంటూ కోట తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us

కోట శ్రీనివాసరావు ముక్కుసూటితనం
టాలీవుడ్ లో ముక్కుసూటితనం ఉండే నటుల్లో కోట శ్రీనివాస రావు ఒకరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేయడం ఆయనకి అలవాటు. కొన్ని రోజుల క్రితం జూలై 13న కోట శ్రీనివాసరావు మరణించారు. 750 పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆయనది. తెలుగు సినిమాల్లో ఎక్కువగా తెలుగు నటీనటులకే అవకాశాలు ఇవ్వాలని చివరి వరకు కోట తన గళం వినిపించారు.
తెలుగువారి సత్తా చూపించిన మహానుభావుడు ఎన్టీఆర్
ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తెరకెక్కించిన మండలాధీశుడు చిత్రంలో నటించి వివాదంలో నిలిచారు. ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాస రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట మాట్లాడుతూ.. తెలుగువారి సత్తా చూపించిన మహానుభావుడు ఎన్టీఆర్. కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించారు. అలాంటి వ్యక్తి తన చరిత్రని తానే చెరిపివేసుకున్నాడు. 60 ఏళ్ళ వయసొచ్చిన తర్వాత మరో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది ? ఆయన భార్య బసవతారకం గారు 12 మంది పిల్లలని కని పెంచిన మహా ఇల్లాలు. అనారోగ్యం కారణంగా మరణించారు.
మరో మహిళని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ?
అలాంటి మహా ఇల్లాలిని మరచిపోయి మరో మహిళ మెడలో తాళి కట్టడానికి ఆయనకి మనసు ఎలా వచ్చింది. ఆ విషయంలో రామారావు గారు అంటే నాకు చాలా కోపం. ఆ వయసులో నీకు ఎం కావాలి ? శృంగారమా ? అంటూ కోట సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ ఆయనకి ఆ వయసులో తోడు కావాలి అనిపిస్తే పిల్లలతో మాట్లాడి ఉండాలి. ఆ విషయంలో ఆయన పిల్లలు కూడా తప్పు చేశారు. అప్పట్లోనే ఎన్టీఆర్ తన పిల్లలందరికీ రూ.4 కోట్ల వరకు ఆస్తులు పంచారు.
పిల్లలు బాధ్యత తీసుకుని ఉండాలి
ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని ఎన్టీఆర్ బాగోగులు చూసి ఉండాలి. ఏది ఏమైనా ఆయన రెండో పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. ఆ విషయంలో నా కడుపు రగిలిపోయింది. ఆ వయసులో ఆయనకి ఒక అసిస్టెంట్ ఉంటే సరిపోతుంది. పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు. పద్మనాభం గారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత. కానీ చివరికి ట్రైన్ లో సెకండ్ క్లాస్ లో ప్రయాణించే స్థితికి చేరుకున్నారు అని కోట గుర్తు చేశారు.
తన చరిత్రని తానే రబ్బరుతో చెరిపి వేసుకున్నారు
ఆ ఒక్క తప్పు చేసి ఎన్టీఆర్ తన చరిత్రని తానే రబ్బరుతో చెరిపి వేసుకున్నారు అని కోట తెలిపారు. ఎన్టీఆర్ 1993లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ వివాహం గురించి అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది.