MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Missing Meghana: శ్రోతల్ని కట్టిపడేస్తున్న పిల్ల పిల్ల సాంగ్‌.. మిస్సింగ్‌ మేఘన నుంచి అదిరిపోయే పాట

Missing Meghana: శ్రోతల్ని కట్టిపడేస్తున్న పిల్ల పిల్ల సాంగ్‌.. మిస్సింగ్‌ మేఘన నుంచి అదిరిపోయే పాట

Missing Meghana: ఫోక్‌ సాంగ్స్, స్టార్‌ హీరోల పాటలే కాదు, చిన్న సినిమాల పాటలు కూడా యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. తాజాగా `మిస్సింగ్‌ మేఘన` నుంచి అదిరిపోయే పాట వచ్చింది. ఇది ట్రెండ్‌ అవుతుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 12 2026, 10:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిస్సింగ్‌ మేఘన నుంచి ఫస్ట్ సాంగ్‌
Image Credit : Asianet News

మిస్సింగ్‌ మేఘన నుంచి ఫస్ట్ సాంగ్‌

ఇప్పుడు సినిమా పాటలకంటే జానపద పాటలే యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. స్టార్‌ హీరోల పాటలు కూడా వాటి ముందు వెనకబడి పోతున్నాయి. వాటితో పోటీపడలేకపోతున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా ఒక పాట విశేషంగా ఆకట్టుకుంటుంది. అది సినిమా పాట కావడం విశేషం. ప్రస్తుతం తెలుగులో `మిస్సింగ్‌ మేఘన` అనే సినిమా రూపొందుతుంది. రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఫస్ట్ కాపి మూవీస్‌, కేడీ అండ్‌ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్‌ బాబు నిర్మించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పిల్ల పిల్ల సాంగ్‌ని రిలీజ్‌ చేసిన సురేష్‌ బాబు
Image Credit : Asianet News

పిల్ల పిల్ల సాంగ్‌ని రిలీజ్‌ చేసిన సురేష్‌ బాబు

ఈ సినిమా నుంచి ఆ మధ్య ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. దర్శకుడు వినాయక్‌ చేతుల మీదుగా ఈ పోస్టర్‌ విడుదల చేయగా, ఆకట్టుకుంది. ఇప్పుడు `పిల్ల పిల్ల పిల్ల` అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకున్నారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, `సురేష్ బాబు గారి చేతుల మీదుగా మా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నరేష్ గారికి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందించిన ఆర్. ఆర్. ధృవన్ గారికి, అలాగే ఈ పాట పాడిన మనందరి ఫేవరెట్ సింగర్ జావేద్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను` అని అన్నారు.

33
సీట్‌ ఎడ్జ్ థ్రిల్లర్‌ మిస్సింగ్‌ మేఘన
Image Credit : Asianet News

సీట్‌ ఎడ్జ్ థ్రిల్లర్‌ మిస్సింగ్‌ మేఘన

నిర్మాత నరేష్ మాట్లాడుతూ: మా సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. రామానాయుడు స్టూడియో అధినేత సురేష్ బాబు గారి చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ తో మాకు ఇది రెండో సినిమా. `తంత్ర` మ్యూజికల్ గా ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. ధృవన్ గారే రాసి మ్యూజిక్ అందించి, జావేద్ అలీ గారితో పాడించిన ఈ పాట మంచి సక్సెస్ అవుతుంది. అదే విధంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం` అని చెప్పారు. `ఈ సినిమాని ఒక మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీశారు. ధృవన్ గారు మంచి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది`అని హీరో రామ్‌ కార్తీక్ చెప్పాడు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ మాట్లాడుతూ, నేనే పాట రాసి మ్యూజిక్ అందించడం, నా ఫేవరెట్ సింగర్ జావేద్ అలీ గారు ఈ పాట పాడటం ఆనందంగా ఉంది. ఇది ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ` అని చెప్పాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image2
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Recommended image3
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Related Stories
Recommended image1
Ntr Health Bulletin: ఎన్టీఆర్‌కి సర్జరీ విజయవంతం.. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎన్ని నెలలు రెస్ట్ అంటే?
Recommended image2
Irumudi Trailer Review: కూతురి కోసం తండ్రి ఆరాటం, అసలు కథ ఇదే, ఇరుముడి ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved