కొరటాల సీక్రెట్ గా సాయం, మహేష్ మరో ఆలోచన చేయకుండా ఓకే

First Published 31, Mar 2020, 7:39 AM

తెలుగు సినిమా స్పాన్ బాగా పెరిగింది. వందల కోట్లతో సినిమాలు నిర్మాణమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ పెద్ద సినిమాలు సెట్ చేసేటప్పుడు రకరకాల అంచనాలు, లెక్కలు వేస్తూంటారు హీరోలు, నిర్మాతలు. ముఖ్యంగా హీరోలు తమ ఇమేజ్ పడిపోకుండా సరిపడే ప్రాజెక్టు కోసం సెర్చ్ చేస్తూంటారు. అందుకోసం తన సన్నిహితుల సాయం తీసుకుంటూంటారు. 

అలాంటి పెద్ద ప్రాజెక్టులు సెట్ అయ్యేటప్పుడు రకరకాల విషయాలు,ఊహించని వ్యక్తుల ప్రమోయం ఉంటుంది.  ఆ క్రమంలో  జరిగే కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అయితే వాటిని బయిటకు రాకుండా సీక్రెట్ గా ఉంచే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ హీరోకో లేక ఆ ప్రాజెక్టుకు సంభందించిన వారి ద్వారా అవి బయిటకు వచ్చేస్తూంటారు. ప్రమాదరహితమైనవే కాబట్టి మీడియా ద్వారా ప్రచారంలోకి వెళ్లిపోతాయి. రీసెంట్ గా మహేష్ బాబుకొత్త ప్రాజెక్టు విషయంలో అలాంటి ఓ సంఘటన చోటు చేసుకుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
మహేష్ కు, ప్రముఖ దర్శకుడు కొరటాల శివకు ఉన్న అనుబంధం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో భరత్ అనే నేను, శ్రీమంతుడు చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దాంతో కొరటాల శివ అంటే మహేష్ కు మంచి నమ్మకం ఏర్పడింది. దాంతో కొరటాలను తమ సినిమాల విషయాల్లో మహేష్ సలహా తీసుకోవటం మొదలెట్టారు.

అలా రీసెంట్ గా కొరటాల సీక్రెట్ గా మహేష్ కు ప్రాజెక్టు సెట్ చేసినట్లు చెప్తున్నారు. కొరటాల ఎంటర్ కాకపోతే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లేదే కాదంటున్నారు. అది మరేదో కాదు పరుశురామ్, మహేష్  కాంబినేషన్ సినిమా.

మొదట పరుశురామ్ ని స్వయంగా కొరటాల శివ ...తీసుకెళ్లి మహేష్ కు పరిచయం చేసారు. ఆ తర్వాత పరుశరామ్ చెప్పిన కథ  తను విన్నానని నచ్చిందని చెప్పి...దాన్ని మహేష్ కు వినిపించేలా చేసారట. మహేష్ కు వినిపించే ముందు..పరుసరామ్ తో కొద్ది రోజులు ఆ కథ పై కొరటాల శివ కూర్చున్నారట.

మహేష్ తో రెండు సినిమాలు చేసిన అనుభవంతో ఆయనకు నచ్చే ఎలిమెంట్స్ ని ఆ స్క్రిప్టులో కొరటాల కలిపారట. అంతేకాకుండా మహేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కొన్ని సీన్స్ మార్పించారట. అయితే తాను స్వయంగా సీన్స్ చెయ్యకుండా సజెషన్స్ చెప్పి పరుశురామ్ చేత చేయించాడట.

అయితే పరుశురామ్ తెచ్చిన రొమాంటికి కామెడి తనకున్న ఇమేజ్ కు సెట్ అవుతుందా అని మహేష్ సందేహం వ్యక్తం చేస్తే, కొరటాల..ఆ అనుమానాలకు తగ్గ సమాధానం చెప్పి , ప్రాజెక్టు ముందుకు వెళ్లేలా చేసారట. ఇలాంటివి చేస్తేనే కెరీర్ లో మరో మెట్టు ఎక్కడానికి ఉంటుంది, ముఖ్యంగా యూత్ లోకు వెళ్లే అవకాసం ఉందని చెప్పారట.

కొరటాల కనుక లేకపోతే ఈ రోజు పరుసరామ్,మహేష్ ప్రాజెక్టు ముందుకు వెళ్ళేది కాదంటున్నారు. స్క్రిప్టు పరంగా వచ్చే ప్రతీ సమస్యను తాను ట్రబుల్ షూటర్ గా మారి కొరటాల పరిష్కరించారట. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఓ భారీ ఎపిసోడ్ కు కొరటాల బాగా సాయిం చేసాడంటున్నారు.

దాని వలన కొరటాల శివకు వచ్చిన లాభం..కేవలం మహేష్ తో స్నేహబంధం పటిష్టం కావటమే కాదుట. ఈ ప్రాజెక్టుని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లినందుకు మైత్రీ మూవీస్ వారు లాభాల్లో వాటా ఇస్తానని ప్రామిస్ చేసారట. అయితే కొరటాల వద్దన్నాడు అని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. కరోనా ప్రభావం తగ్గాక జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. కంటిన్యూ షెడ్యూల్ తో షూటింగ్ ఫినిష్ చేస్తారట.

పరుసరామ్ ప్రస్తుతం మరోసారి స్క్రిప్టుని రీరైట్ చేస్తున్నారట. కొరటాల శైతం కొన్ని క్రియేటివ్ ఇన్ ఫుట్స్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అలాగని దర్శకుడు పరుసరామ్ ని ఇబ్బంది పెట్టేలా చేయలేదట. కేవలం మహేష్ తో ఈ సినిమాను ముందుకు వెళ్లేంత వరకే సాయిం చేసారట.

మహేష్ సైతం కొరటాల శివ తన సమయం కేటాయించి,సాయిం చేసినందుకు చాలా హ్యాపీ ఫీలయ్యారట. కొరటాల సీక్రెట్ హ్యాండ్ లేకపోతే పరుసరామ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కేది అని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది.

ఈ సినిమాకి కీర్తిసురేష్ హీరోయిన్ గా ఫైనలైజ్ అయినట్టు వార్తలు అందుతున్నాయి. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో, కీర్తిసురేష్ అయితే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని భావించాడట డైరెక్టర్ పరశురామ్. మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆల్ మోస్ట్ కీర్తిసురేష్ ఈ సినిమాకి ఫైనలైజ్ అయిపోయినట్టే.

ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తారని వెల్లడించారు. మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కానీ స్క్రిప్ట్ విషయంలో వంశీతో బేధాభిప్రాయాలు రావడంతో మహేష్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు.

loader