MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Superstar Krishna: ఒకే సంవత్సరంలో 23 సినిమాలు.. హీరో కృష్ణ గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పారంటే.?

Superstar Krishna: ఒకే సంవత్సరంలో 23 సినిమాలు.. హీరో కృష్ణ గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పారంటే.?

Kodi Ramakrishna: దర్శకుడు కోడి రామకృష్ణ తన గురువు దాసరి నారాయణరావుతో ఉన్న అనుబంధాన్ని, అప్పటి స్టార్ హీరోల క్రమశిక్షణను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ పంచ్యువాలిటీ, కృష్ణ వేగం, దాసరి నిరంతర శ్రమ.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 20 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అప్పటి స్టార్ హీరోల క్రమశిక్షణ..
Image Credit : Superstar Krishna\Twitter

అప్పటి స్టార్ హీరోల క్రమశిక్షణ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు కోడి రామకృష్ణ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలోని అద్భుత ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. తన గురువు దాసరి నారాయణరావు పని తీరు, అప్పటి స్టార్ హీరోల క్రమశిక్షణ తనను ఎలా ప్రభావితం చేశాయో ఆయన వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దాసరి నేచురల్ డ్రామా
Image Credit : google

దాసరి నేచురల్ డ్రామా

దాసరి నారాయణరావు గురించి చెబుతూ, ఆయన డ్రామాను పండించడంలో దిట్ట అని కోడి రామకృష్ణ కొనియాడారు. చాలా మంది డ్రామా చేస్తే అది నాటకంలా అనిపిస్తుందని, కానీ దాసరి సినిమాల్లో ఎమోషన్స్ చాలా నేచురల్ గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఆయన 24 గంటలు సినిమా గురించే ఆలోచిస్తూ ఉండేవారని, తెల్లవారుజామున 3 గంటల వరకు చర్చలు జరిపి, మళ్ళీ 6 గంటలకే షూటింగ్ కు రెడీ అయ్యేవారని గుర్తు చేసుకున్నారు.

35
నిత్య కళ్యాణం పచ్చ తోరణం రోడ్డు
Image Credit : the indian express

నిత్య కళ్యాణం పచ్చ తోరణం రోడ్డు

దాసరి, ఎన్టీఆర్ ఇళ్లు ఎదురెదురుగా ఉండటంతో ఆ రోడ్డు ఎప్పుడూ కార్లతో రద్దీగా ఉండేదని, అందుకే ఆ వీధికి 'నిత్య కళ్యాణం పచ్చ తోరణం రోడ్డు' అని పేరు వచ్చిందని రామకృష్ణ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఎన్టీఆర్ తెల్లవారుజామున 2 గంటలకే రెడీ అయిపోయి, మేకప్ తో సహా దాసరి ఇంటికి వచ్చి కథా చర్చల్లో పాల్గొనేవారని ఆయన తెలిపారు.

45
సూపర్ స్టార్ కృష్ణ వేగం
Image Credit : facebook/@SuperstarNatasekharaKrishna

సూపర్ స్టార్ కృష్ణ వేగం

అప్పట్లో హీరోల వేగం గురించి ప్రస్తావిస్తూ, సూపర్ స్టార్ కృష్ణ ఒకే ఏడాదిలో 23 సినిమాలు విడుదల చేసిన ఘనతను గుర్తు చేసుకున్నారు. కృష్ణకి కథలోని ముఖ్యాంశాలను పట్టుకోవడంలో చాలా తెలివితేటలు ఉండేవని, ఆయన నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా కార్లోనే కథ వినేవారని ఆయన పేర్కొన్నారు.

55
ఎన్టీఆర్ క్రమశిక్షణ: ఒక ఆశ్చర్యకర ఘటన
Image Credit : Senior NTR\Twitter

ఎన్టీఆర్ క్రమశిక్షణ: ఒక ఆశ్చర్యకర ఘటన

నెల్లూరులో జరిగిన ఒక షూటింగ్ అనుభవాన్ని రామకృష్ణ వివరించారు. వర్షం వల్ల షూటింగ్ ఆగిపోతుందని అంతా అనుకుంటున్న సమయంలో, ఎన్టీఆర్ తెల్లవారుజామున 2:30 గంటలకే ఫోన్ చేసి, "వర్షం ఆగిపోయింది, నేను మేకప్ తో రెడీగా ఉన్నాను" అని చెప్పడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. అప్పటికప్పుడు దాసరి బాత్ రూమ్ లో ఉంటూనే 24 పేజీల డైలాగ్స్ చెబితే, తాను వాటిని రాసి షూటింగ్ కు సిద్ధం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Related Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌
Recommended image2
Chiranjeevi: చిరంజీవి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు..వాటిని గుర్తు చేస్తూ తేల్చి చెప్పేసిన యంగ్ హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved