MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Director Teja: వాడిబొంద.. వాడు చెప్పేదంత సోది, స్టార్ హీరోపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్, కారణం ఏంటి ?

Director Teja: వాడిబొంద.. వాడు చెప్పేదంత సోది, స్టార్ హీరోపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్, కారణం ఏంటి ?

టాలీవుడ్ స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేశారు డైరెక్టర్ తేజ. అతను చెప్పేదంతా సోది, సోల్లు అటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ తేజ ఎందుకలా అన్నాడు. అసలు విషయం ఏంటి? ఏం జరిగింది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 17 2026, 07:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
డిఫరెంట్ ఇమేజ్ ఉన్న దర్శకుడు..
Image Credit : Twitter

డిఫరెంట్ ఇమేజ్ ఉన్న దర్శకుడు..

టాలీవుడ్ లో అందరు దర్శకులు ఒక ఎత్తు అయితే.. డైరెక్టర్ తేజ్ మరో ఎత్తు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు తేజ. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీస్‌ తో సినిమాలు చేసి.. వరుస విజయాలను ఆయన సొంతం చేసుకున్నారు. ఉదయ్‌ కిరణ్‌, నితిన్‌ వంటి వారికి కెరీర్‌ ప్రారంభంలో మంచిమంచి సినిమాలతో లైఫ్‌ ఇచ్చారని చెప్పొచ్చు. 

ఒకప్పుడు తేజ దర్శకత్వంలో సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అని ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం తన సినిమాలతో ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు తేజ. వరుసగా ఫెయిల్యూర్స్ ని ఫేస్‌ చేస్తున్నారు. చివరగా ఆయన రానా తమ్ముడు అభిరామ్ తో `అహింస` అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్
Image Credit : Twitter

ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్

టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన తేజా.. వివాదాలతో మరింత పాపులర్ అయ్యడు. కొన్ని సార్లు వివాదాస్పదమైన స్టేట్మెంట్లు ఇచ్చినా.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆయన పలు సందర్భాల్లో చేసిన కామెంట్స్ తేజపై గౌరవాన్ని పెంచాయి. ఇక మరోసారి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు తేజ. తన కెరీర్, పేరెంట్స్, జీవితంలో పడ్డ ఇబ్బందులు, పెళ్లి, పిల్లలు ఇలా చాలా విషయాల గురించి తేజ వెల్లడించారు. అయితే తన పెళ్లి గురించి హీరో జేడీ చక్రవర్తి చేసిన కామెంట్స్ పై తేజ్ కాస్త ఘాటుగా స్పందించారు.

36
జేడీ చక్రవర్తికి ఘాటు కౌంటర్..
Image Credit : facebook / JD Chakravarthy

జేడీ చక్రవర్తికి ఘాటు కౌంటర్..

ఈ మధ్య కాలంలో తన ప్రేమకథ గురించి హీరో జేడీ చక్రవర్తి చెప్పిన వ్యాఖ్యలను తేజ పూర్తిగా ఖండించారు. సుమోలు, చేజింగ్ లు, నెల్లూరు అంటూ జేడీ చక్రవర్తి చెప్పిన విషయాల గురించి యాంకర్ ప్రస్తావించగా.. '' వాడి బొంద అలాంటిదేమి లేదు. అతను చెప్పిందంతా సోది, నా పెళ్లి నార్మల్ గానే జరిగింది.'' అని తేజ అన్నాడు. ఆహీరో చెప్పిన దాంట్లో.. ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆయన చెప్పినవన్నీ సోది, పచ్చి అబద్ధాలేనని తేజ తీవ్రంగా స్పందించారు. అయితే ఈ ఇద్దరు రామ్ గోపాల్ వర్మకు మంచి స్నేహితులు. ఈఇద్దరి మధ్య కూడా మంచి స్నేహం ఉంది. దాంతో ఆ ఫ్రెడ్షిప్ తోనే ఆయన ఈ మాటలు అని ఉంటారని అందరు అనుకుంటున్నారు.

46
తేజ పెళ్ళి జరిపించిన ఏఎన్నార్ తనయుడు..
Image Credit : Twitter

తేజ పెళ్ళి జరిపించిన ఏఎన్నార్ తనయుడు..

తన పెళ్లి ఎలా జరిగిందో కూడా తేజ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన వివాహాన్నిఏఎన్నార్ పెద్ద కొడుకు, అక్కినేని వెంకట్ , ఆయన భార్య జ్యోత్స్న దగ్గరుండి జరిపించారని ,పెళ్లిని అక్కినేని గారు స్వయంగా నిశ్చయించారని తేజ అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి కోడలు జ్యోత్స్న వారింట్లోనే తనను పెళ్లి కొడుకుని చేసి.. పెళ్లి పెద్దగా వ్యవహరించారని చెప్పారు. 

56
అక్కినేని వారి కోడలు సలహాతో..
Image Credit : facebook / JD Chakravarthy

అక్కినేని వారి కోడలు సలహాతో..

కెరీర్ బిగినింగ్ లో తాను ఎదుర్కొన్న కష్టాలను కూడా తేజ గుర్తు చేసుకున్నారు. పెళ్లి ఫిక్స్ అయిన సమయంలో తనకు సొంత ఇల్లు కానీ, కారు కానీ లేవని, ఆ సమయంలో తాను అన్నపూర్ణ స్టూడియోస్‌లోని కాటేజ్‌లోనే నివసించేవాడినని చెప్పారు. జ్యోత్స్న అక్కినేని సూచనతో పెళ్లికి వారం రోజుల ముందు అద్దె ఫ్లాట్ తీసుకున్నానని, అలాగే పెళ్లికి ఐదు రోజుల ముందు కారు కొన్నానని తేజ అన్నారు. అంతే కానీ.. తన పెళ్లిలో ఆ హీరో చెప్పినట్టుగా చేజింగ్ లు, బ్లాస్టింగ్ లు జరగలేదన్నారు. అసలు అతను ఏం చెప్పాడో కూడా తాను వినలేదన్నారు తేజ. 

66
తేజా వారసుడి టాలీవుడ్ ఎంట్రీ?
Image Credit : Twitter

తేజా వారసుడి టాలీవుడ్ ఎంట్రీ?

అదే సమయంలో తన కుటుంబ భవిష్యత్తు గురించి కూడా ఆయన మాట్లాడారు. తన కుమారుడు అమెరికాలో దర్శకత్వానికి సంబంధించిన కోర్సు పూర్తి చేశాడని చెప్పారు. ప్రస్తుతం హీరోగా సినీ రంగంలోకి రావాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాడని వెల్లడించారు. భవిష్యత్తులో తాను పూర్తిస్థాయి నిర్మాతగా మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తేజ తెలిపారు.తేజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా జేడీ చక్రవర్తి వ్యాఖ్యలపై ఆయన ఇచ్చిన కౌంటర్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Recommended image2
CM Vijay: లంచ్ బాక్స్‌తో సెక్రటేరియట్ కు సీఎం విజయ్.. అధికారులకు అదిరిపోయే షాక్ ఇచ్చిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved