- Home
- Entertainment
- Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం
సూపర్ స్టార్ కృష్ణ, పూరీ జగన్నాథ్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. నిజానికి పూరీ మొదటి సినిమా అదే. కానీ ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. దానికి అసలు కారణం ఏంటంటే?

పూరీ జగన్నాథ్, కృష్ణ కాంబినేషన్‌లో ఆగిపోయిన సినిమా
చిత్ర పరిశ్రమలో సినిమా సెట్ కావడం, ఆగిపోవడం సర్వసాధారణమే, కానీ దాని వెనుక అటు హీరోకిగానీ, అటు దర్శకుడికిగానీ, నిర్మాతలకుగానీ చాలా పెయిన్ ఉంటుంది. దానివెనుక వారి జీవితాలుంటాయి. ముఖ్యంగా కొత్తగా వచ్చేవారికి అదొక జీవితం. ఆ ఒక్క సినిమానేవారి లైఫ్‌ని మార్చేస్తుంది. అందుకోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు ఫేస్ చేస్తారు. ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తారు. ఎన్నో స్ట్రగుల్స్ ఫస్ చేస్తారు. ఇలా అన్నింటికి దాటుకొని ఒక సినిమా స్టార్ట్ అయితే వచ్చే ఆనందం వేరు. అది హిట్ అయితే ఆ ఆనందాన్ని మాటల్లే వర్ణించేం. కానీ అదే ప్రారంభమై ఆగిపోతే అదొక దారుణమైన అనుభవం. అలాంటిది చాలా మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు అనుభవించి ఉంటారు. అలా పూరీ జగన్నాథ్ ఫేస్ చేశారు. ఆయన ఏకంగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సినిమా ప్రారంభించారు. కానీ అది ఆగిపోయింది.
బద్రితో దర్శకుడిగా పరిచయం అయిన పూరీ
పూరీ జగన్నాథ్ తొలి సినిమా `బద్రి`. పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్, అమిషా పటేల్ హీరోయిన్లుగా ఈ మూవీ రూపొందింది. టీ త్రివిక్రమ రావు నిర్మించారు. 2000 ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలైంది. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీతోనే దర్శకుడు పూరీ ఏంటో ఇండస్ట్రీకి తెలిసింది. అదే సమయంలో రేణు దేశాయ్ తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. పవన్ ప్రేమలో పడ్డారు. ఇద్దరు పెళ్లి చేసుకొని విడిపోయారు. ఈ ఒక్క సినిమా అనేక సంచలన విషయాలకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ చిత్రంతో దర్శకుడిగా పూరీ దూసుకుపోయారు. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.
కృష్ణతో `థిల్లానా` మూవీ స్టార్ట్ చేసిన పూరీ
అయితే పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పరిచయం అయిన తొలి చిత్రం `బద్రి` కాదు. దీనికంటే ముందే ఆయన సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఓ సినిమాని ప్రారంభించారు. `థిల్లానా` పేరుతో దీన్ని స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కృష్ణ కూతురు మంజుల ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్నారు. ఫైట్లు, డాన్సులు లేకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తీయాలని భావించారు. ఓపెనింగ్ జరుపుకున్నా సినిమాని ఆపేశారు. బడ్జెట్ విషయంలో తేడా వచ్చి నిర్మాత వెనక్కి తగ్గారట. కృష్ణకి యాక్షన్ ఇమేజ్ ఉంది, అది కాదని ఫ్యామిలీ సినిమా చేస్తే వర్కౌట్ కాదని నిర్మాత భావించారట. పైగా ఆయనకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, దీంతో సినిమాని పక్కన పెట్టారట.
ప్రారంభంలోనే ఆగిపోయిన రెండు సినిమాలు
ఈ విషయాన్ని నటుడు రామ్ జగన్ సాక్షి ఇంటర్వ్యూలో తెలిపారు. అందులో తాను కూడా నటించాల్సి ఉందన్నారు. కానీ ఆగిపోవడంతో మళ్లీ పనిచేయలేకపోయినట్టు తెలిపారు. అలా పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పరిచయం కావాల్సిన మొదటి సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత జగపతిబాబుతోనూ ఓ సినిమా అనుకున్నారట. అది కూడా ఆల్మోస్ట్ పట్టాలెక్కే దశలోనే ఆగిపోయిందట. ఇలా రెండు సినిమాలు ఆగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్‌తో `బద్రి` సినిమా చేశారు. ఈ మూవీలో క్లైమాక్స్ మార్చమని పవన్ చెబితే పూరీ వినలేదట. కానీ అదే నచ్చి పవన్ ఈ సినిమా చేశాడు. ఇండస్ట్రీకి ఒక స్టార్ డైరెక్టర్‌ని అందించారు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు.

