- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode: మీకు నాకంటే దీపే ఎక్కువన్న జ్యో-పారు మాటలను తండ్రితో చెప్పిన శౌర్య
Karthika Deepam 2 Latest Episode: మీకు నాకంటే దీపే ఎక్కువన్న జ్యో-పారు మాటలను తండ్రితో చెప్పిన శౌర్య
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 6వ తేదీ)లో దీప, కార్తీక్ లతో కోపంగా మాట్లాడుతుంది కాంచన. దీపపై మరోసారి అక్కసు వెళ్లగక్కుతుంది జ్యో. దీప కోసం ఏమైనా చేస్తానంటాడు శివన్నారాయణ. పారు మాటలను తండ్రితో చెప్తుంది శౌర్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో ఆ చంటిదాన్ని వాళ్ల దగ్గర పడుకోనివ్వద్దు అని చెప్పాను. కానీ వీళ్లు వినలేదు. అది కడుపులో తన్నితే.. కూడా నాతో అబద్దం చెప్పారు వీళ్లు. డాక్టర్ వస్తే కానీ నిజాలు బయటపడలేదు అంటుంది కాంచన.
అమ్మ అని కార్తీక్ ఏదో చెప్పబోతుండగా.. నువ్వు నాతో ఏం చెప్పొద్దురా.. నువ్వు నీ కూతురికి చెప్పలేవు. నీ భార్యకు చెప్పలేవు అంటూ లోపలికి వెళ్లిపోతుంది కాంచన. నీ నిర్ణయం వల్ల చెల్లెమ్మ చాలా బాధపడుతోంది దీప అంటుంది అనసూయ. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని విసుగ్గా పక్కకు వెళ్తాడు కార్తీక్. ఏడుస్తూ నిలబడిపోతుంది దీప.
దాని వెనుక కారణం వేరే ఉంది
మరోవైపు జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని తండ్రితో చెప్తాడు దశరథ. ఇంత సంతోషకరమైన విషయాన్ని ఇంత లేటుగా చెప్తావేంటి దశరథ అంటాడు శివన్నారాయణ. సుమిత్రను పిలిచి స్వీట్స్ తీసుకురమ్మని చెప్తాడు. ఇప్పుడు నాకు ఏ స్వీట్స్ వద్దు మమ్మీ అంటుంది జ్యోత్స్న.
ఈ ఆనందం వెనుక చేదు నిజం కూడా ఉంది అంటుంది జ్యోత్స్న. ఏంటని అడుగుతాడు దశరథ. నేను పెళ్లికి ఒప్పుకోవడం ఇప్పుడు కొత్తేమి కాదు.. ఇప్పటికీ మూడుసార్లు ఒప్పుకున్నాను. అయినా సరే మీరు ఇంత సంతోషపడుతున్నారు అంటే.. దాని వెనుక కారణం వేరే ఉంది అంటుంది జ్యోత్స్న. ఏంటది అంటాడు శివన్నారాయణ.
దీపకు తాత స్థానంలో ఉంటాను
మామూలుగా అయితే మనకు ఎవరైనా అడ్డుగా ఉంటే వారిని పక్కకు పంపిచే ప్రయత్నం చేస్తాం. శత్రువులను అయితే ఓడిస్తాం. పనివాళ్లను అయితే డబ్బులిచ్చి పనిలో నుంచి తీసేస్తాం. కూతుర్లను అయితే ఇదిగో ఇలా పెళ్లి చేసి బయటకు పంపిస్తాం అంటుంది జ్యోత్స్న.
నిన్ను బయటకు పంపించి మేము ఎవరితో ఉండాలని కోరుకుంటాం అని అడుగుతాడు దశరథ. మీ చెల్లెలి ఫ్యామిలీతో అంటుంది జ్యోత్స్న. జ్యోపై సీరియస్ అవుతుంది సుమిత్ర. మీకు నాకంటే అత్త, దీప వాళ్లే ఎక్కువ అంటుంది జ్యోత్స్న. దీప కోసం కుటుంబం మొత్తం వెళ్లాల్సిన అవసరం ఏంటి? డాక్టర్ ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తుంది.
దీప కడుపులో ఉన్నది మీ నానమ్మ అని మీ తాత గట్టిగా నమ్ముతున్నాడు కదా.. అందుకే ఆ ప్రేమ అంటుంది పారు. మన చుట్టూ ఉన్న మనుషులే మన మనసుని కలుషితం చేస్తారు అంటాడు శివన్నారాయణ. నేను ఎవ్వరి మనసు కలుషితం చేయలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. మీరు దీపకు తాత స్థానంలో ఉండండి. లేదా ఇంకేమైనా చేసుకోండి. నాకేమి ఇబ్బంది లేదు అంటుంది పారిజాతం.
నీ సలహా నాకు బాగా నచ్చింది పారిజాతం అంటాడు శివన్నారాయణ. దీప కడుపులో పెరుగుతోంది తన తల్లి అని నా కూతురు నమ్ముతోంది. నా కూతురి నమ్మకంపై నాకు ప్రేమ ఉంది. ఎవ్వరు ఏమనుకున్నా నేను దీప తాత స్థానంలో నిలబడి అవసరమైనవన్నీ చేస్తాను అని గట్టిగా చెప్తాడు శివన్నారాయణ. ఇప్పుడు కూడా నువ్వే గెలిచావు బావ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయ్యాం
చేతిలో బొమ్మలు పట్టుకొని చూస్తూ ఉంటుంది సుమిత్ర. జ్యోత్స్న బొమ్మలన్నీ శౌర్యకు ఇచ్చాను. ఈ రెండే మిగిలాయి అంటుంది సుమిత్ర. దీపకు బిడ్డ పుట్టాక వాటిని కూడా ఇచ్చెయ్ అంటాడు దశరథ. వద్దండి.. నేను శౌర్యకు ఒక్క బొమ్మ ఇస్తేనే జ్యోత్స్న మిగిలినవన్నీ కోపంగా పడేయమని చెప్పింది. తన విషయంలో మనం తల్లిదండ్రులుగా ఫెయిల్ అయ్యాము.
మనం దీప, కార్తీక్ లపై తనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నామని తను అనుకుంటోంది అని బాధపడుతుంది సుమిత్ర. ఏదైమైనా మీరు తనని పెళ్లికి ఒప్పించారు అది చాలు అంటుంది సుమిత్ర. కార్తీక్ లాంటి మంచి భర్త జ్యోత్స్నకు దొరికితే చాలు అంటుంది సుమిత్ర. నేను అదే కోరుకుంటున్నాను అంటాడు దశరథ.
కార్తీక్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే అవకాశం వచ్చినా ఎందుకో ఇక్కడే ఉంటున్నాడు. వాడిని వాడు బంధించుకున్నాడు. ఏదో చేస్తున్నాడు కానీ.. అర్థం కావట్లేదు అంటుంది సుమిత్ర. కుటుంబాన్ని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి మేనల్లుడు దొరకడం మన అదృష్టం అంటాడు దశరథ.
నిజం చెప్పిన శౌర్య
మరోవైపు బయట కూర్చొని తల్లి మాటలను గుర్తుచేసుకుంటూ ఉంటాడు కార్తీక్. శౌర్య వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చొన్నావు నాన్న.. వెళ్లి పడుకుందా రా అంటుంది. ఈ రోజు నుంచి నువ్వు నానమ్మ దగ్గర పడుకోవాలి అని సున్నితంగా చెప్తాడు కార్తీక్.
పారు మాటలను గుర్తు చేసుకుంటుంది శౌర్య. నువ్వు ఇలా మాట్లాడుతావని నాకు ముందే తెలుసు నాన్న. ఇకపై నువ్వు నాకు ఏమి కొనివ్వవు. నన్ను దూరం పెడతావని కూడా నాకు తెలుసు నాన్న.. జ్యో గ్రానీ ముందే చెప్పింది నాకు అని ఏడుస్తుంది శౌర్య. షాక్ అవుతాడు కార్తీక్.
శౌర్యని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. లోపలికి వెళ్తూ కిందపడుతుంది శౌర్య. దగ్గరికి వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. జ్యో గ్రానీ ఇంకా ఏం చెప్పింది అని అడుగుతాడు కార్తీక్. పూసగుచ్చినట్లు చెప్తుంది శౌర్య. ఇప్పుడు నువ్వు కింద పడితే ఎంత నొప్పి వచ్చిందో.. అంతకు పదిరెట్లు నొప్పి నువ్వు అమ్మను కడుపులో తన్నడం వల్ల వచ్చింది. అమ్మ చాలా ఏడ్చింది. కానీ నిన్ను ఏమైనా అన్నామా మేము అంటాడు కార్తీక్. అనలేదు అంటుంది శౌర్య. ఎందుకు అని అడుగుతాడు కార్తీక్. ఎందుకు నాన్న అని మళ్లీ అడుగుతుంది శౌర్య. ఎందుకంటే రౌడీ అంటే అమ్మానాన్నలకు అంత ఇష్టం అంటాడు కార్తీక్.
మరి జ్యో గ్రానీ చెప్పింది అబద్ధమా అంటుంది శౌర్య. అవును నువ్వు జ్యో గ్రానీకి మనుమరాలివి కదా.. నిన్ను ఏడిపించడానికి అలా చెప్పింది. మనల్ని ఏడిపించిన వాళ్లని మనమూ ఏడిపించాలి అంటూ శౌర్యను పైకి ఎత్తుకుంటాడు కార్తీక్. నాన్న ప్రేమ ఆకాశం.. ఎప్పుడూ మారదు అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

