- Home
- Entertainment
- మిరాయ్ మూవీ ఆర్టిస్ట్ ల పారితోషికాలు.. ప్రీ రిలీజ్ బిజినెస్, సీనియర్ హీరోలకు తేజ సజ్జా ఝలక్
మిరాయ్ మూవీ ఆర్టిస్ట్ ల పారితోషికాలు.. ప్రీ రిలీజ్ బిజినెస్, సీనియర్ హీరోలకు తేజ సజ్జా ఝలక్
`మిరాయ్` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. సినిమాలో నటించిన ఆర్టిస్ట్ లకు ఎంత పారితోషికం ఇచ్చారు. ప్రొడక్షన్‌కి ఎంత ఖర్చు చేశారు. ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందనేది చూస్తే

బాల నటుడి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తేజ సజ్జా
కుర్ర హీరో తేజ సజ్జా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. బాల నటుడిగా వెండితెరకు పరిచయమై అందరు స్టార్ హీరోలకు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అలాగే దాదాపు అందరితోనూ కలిసి నటించాడు. `జాంబిరెడ్డి` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. హిట్ అందుకున్నాడు. `ఇష్క్`, `అద్భుతం` చిత్రాలతో మెప్పించాడు. చివరగా `హనుమాన్` మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. `హనుమాన్` మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు మూడు వందల కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో స్టార్ అయిపోయాడు.
`మిరాయ్` తో దుమ్మలేపుతున్న తేజ సజ్జా
తాజాగా తేజ `మిరాయ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ నెగటివ్ రోల్ చేశారు. శ్రియా శరణ్, జగపతిబాబు, జయరాం, రితికా నాయక్ ముఖ్య పాత్రలు పోషించారు. మైథాలజీ సూపర్ హీరో నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. తాజాగా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది. ఈ మూవీ మొదటి రోజు భారీ వసూళ్లని రాబట్టింది. ఇండియా వైడ్‌గా రూ.12కోట్ల నెట్‌ని సాధిస్తే. ప్రపంచ వ్యాప్తంగా రూ.27కోట్ల గ్రాస్ సాధించినట్టు చిత్ర బృందం ప్రకటించింది.
`మిరాయ్` ఆర్టిస్ట్ ల పారితోషికాలు
ఇదిలా ఉంటే `మిరాయ్`లో నటించిన ఆర్టిస్ట్ లకు ఎంత పారితోషికం ఇచ్చారనేది చూస్తే, హీరో తేజ సజ్జాకి రూ.పది కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. మంచు మనోజ్‌కి మూడు కోట్లు, అలాగే జగపతిబాబుకి రెండు కోట్లు, శ్రియాకి రెండు కోట్లు, రితికా నాయక్‌కి మూడు కోట్లు, జయరాంకి యాభై లక్షలు పారితోషికంగా అందించినట్టు సమాచారం. వీరితోపాటు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి ఐదు కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, ఇతర టెక్నీకల్ టీమ్ అందరికి కలిపి పది కోట్ల వరకు ఇచ్చారని టాక్. సినిమాకి మొత్తంగా రూ.60కోట్ల బడ్జెట్ అయ్యిందని తెలుస్తోంది.
`మిరాయ్` ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు
`మిరాయ్` ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే, ఈ మూవీకి నైజాంలో రూ.10కోట్లు, ఆంధ్రాలో రూ.12కోట్లు, సీడెడ్‌లో ఐదు కోట్ల వరకు బిజినెస్ అయ్యింది. తెలుగు స్టేట్స్ లోనే రూ.27కోట్ల వ్యాపారం జరిగింది. ఇక హిందీ రైట్స్ రూ.5కోట్లు, ఓవర్సీస్‌లో రూ.4.5కోట్లు, తమిళంలో రెండు కోట్ల వరకు బిజినెస్ అయ్యిందట. కేరళా హక్కులు కలుపుకుని సుమారు రూ.40కోట్ల వరకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.80కోట్ల గ్రాస్ వసూలు చేస్తే సరిపోతుంది. ఈ లెక్కన సినిమాకి ఉన్న టాక్‌ని బట్టి చూస్తే ఇది వీకెండ్‌లోనే రీచ్ అయ్యేలా ఉంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో తేజ చాలా మంది సీనియర్ హీరోలకు ఝలక్ ఇచ్చాడని చెప్పొచ్చు. వారి సినిమాలకు కనీసం ఇరవై,ముప్పై కోట్ల వ్యాపారం కూడా కావడం లేదు, కొన్ని చిత్రాలకు థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ బిజినెస్ కావడం లేదు. అలాంటిది తేజ సినిమాలకు పెద్ద స్టార్ హీరోల రేంజ్‌లో బిజినెస్ కావడం విశేషం.
`మిరాయ్` ఓటీటీ, శాటిలైట్ రైట్స్
`మిరాయ్` మూవీ ఓటీటీ రైట్స్ ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఓటీటీ హక్కులు రూ.40కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. దీంతోపాటు శాటిలైట్, ఆడియో రైట్స్ పరంగా మరో పది కోట్ల వరకు వచ్చిందట. ఇలా ఈ మూవీ సుమారు రూ.80-90కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది విడుదలకు ముందే రూ.20కోట్ల లాభాలు తెచ్చిపెట్టినట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా సక్సెస్ చూడని పీపుల్స్ మీడియాకి ఎట్టకేలకు హిట్ పడిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఈ మూవీ వారి నష్టాలను చాలా వరకు భర్తీ చేయబోతుందని చెప్పొచ్చు. `మిరాయ్` మున్ముందు భారీ వసూళ్లని రాబట్టే అవకాశం ఉంది.