- Home
- Entertainment
- విజయ్ దేవరకొండ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా? రౌడీ హీరో అభిమానులకు కు షాకింగ్ న్యూస్..
విజయ్ దేవరకొండ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా? రౌడీ హీరో అభిమానులకు కు షాకింగ్ న్యూస్..
వరుస డిజాస్టర్ సినిమాలతో ఇబ్బందిపడుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈక్రమంలో విజయ్ చేయాల్సిన ఓ సీక్వెల్ సినిమాపై సస్పెన్స్ నెలకొంది. ఇంతకీ రౌడీ హీరోతో ఆ సీక్వెల్ మూవీ ఉన్నట్టా లేనట్టా?

విజయం కోసం విజయ్ దేవరకొండ తిప్పలు..
సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ చేయని ప్రయత్నం అంటూ లేదు.. అయినా సరే రౌడీ హీరోను విజయం వరించడంలేదు. పక్కా మాస్ సినిమాతో భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండను.. ఆతరువాత క్లాస్ మూవీ గీత గోవిందంతో కూడా అదే రేంజ్ లో అభిమానులు ఆధరించారు. ఇక గీత గోవిందం తరువాత నుంచి ఒక్కటంటే ఒక సాలిడ్ హిట్ ను ఈ హీరో చూడలేదు. అప్పటి నుంచి వరుసగా క్లాస్, మాస్, ఫ్యామిలీ కథలతో వరుసగా ప్రయోగాలు చేశాడు. కానీ ఏదీ విజయ్ కు సక్సెస్ ను అందించలేదు. ఎన్నో అంచనాల మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన కింగ్ డమ్ కూడా ఫ్లాప్ అవ్వడంతో.. విజయ్ కెరీర్ డేంజర్ లో పడింది.
భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యింది..
విజయ్ దేవరకొండ నటించిన తాజా మూవీ ‘కింగ్డమ్’. ఈసినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న విజయ్.. ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడిపై గట్టి నమ్మకంతో సినిమా చేశాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడంతో, ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండకు ఇక హిట్లు పక్కా అనకున్నారు. అంతే కాదు.. ఈసినిమాలో కీలకపాత్రలో సత్యదేవ్ నటించడంతో.. కింగ్డమ్ పై ఆడియన్స్ లో ఆసక్తి మరింతగా పెరిగింది. కానీ ఈ సినిమా కూడా విజయ్ కు నిరాశను మిగిల్చింది.
కింగ్డమ్ ఫెయిల్యూర్ కు కారణాలు..
కింగ్డమ్ సినిమా థియేటర్లలో భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయ్యింది.. కానీ లాంగ్ రన్‌లో మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.. భారీ అంచనాలతో పైకి లేచిన కింగ్డమ్.. అంతే స్పీడ్ తో పడిపోయింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా నిర్మాతకు నష్టాలు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కింగ్డమ్ అద్భుతం అని చెప్పాలి. కింగ్డమ్ కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేశాడు. కానీ కథ దగ్గరే ఏదో తేడా వచ్చినట్టు తెలుస్తోంది. పాత కథ, స్క్రీన్ ప్లే తేలిపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదని అంటున్నారు.
కింగ్డమ్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా?
ఈ సినిమాకు ముందు నుంచే.. సీక్వెల్.. ప్రీక్వెల్ ఉంటుందని చెపుతూ వచ్చారు మేకర్స్. ప్రీక్వెల్‌లో విజయ్ దేవరకొండ రాజుగా కనిపిస్తారని, సీక్వెల్ లో నాయకుడిగా విజయ్ కనిపిస్తాడని ప్రచారం జరిగింది. దీంతో కింగ్డమ్ 2పై విజయ్ అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. కానీ ఈాసినిమాకు ఇక ఎటువంటి సీక్వెల్, ప్రీక్వెల్ ఇప్పట్లో ఉండదని.. నిర్మాత హింట్ ఇచ్చినట్టు సమాచారం. కింగ్డమ్ 2 సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ, “కింగ్డమ్ 2 సినిమా ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు. కానీ.. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో మాత్రం మరో సినిమా తప్పకుండా చేస్తామని నిర్మాత అన్నట్టు సమాచారం. నిర్మాత వ్యాఖ్యలతో కింగ్డమ్ 2కు అవకాశమే లేనట్టు తెలుస్తోంది. దాంతో విజయ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ రష్మిక పెళ్లి వార్తలు..
విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్దన్ సినిమా చేస్తున్నాడు.. ఈసారి గట్టిగా హిట్ కొట్టి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన విజయ్, రష్మిక ప్రేమ, ఎంగేజ్మెంట్ విషయాలు అందరికి తెలిసినవే.. ఈ విషయంలో వారు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకపోయినా.. ఈ ఏడాది వారి పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ సాలిడ్ సక్సెస్ కోసమే.. ఇన్నాళ్లు వెయిట్ చేసినట్టు తెలుస్తోంది. రష్మిక మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్టు టాలీవుడ్ టాక్. జైపూర్ లో ఈ స్టార్స్ పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నట్టు సమాచారు.

