- Home
- Entertainment
- Roja: 11 ఏళ్ళు తెలుగు నటిని ప్రేమించిన డైరెక్టర్ కి జయలలిత, వాణిశ్రీ వార్నింగ్.. ఏంటి ఈ బెదిరింపులు అంటూ
Roja: 11 ఏళ్ళు తెలుగు నటిని ప్రేమించిన డైరెక్టర్ కి జయలలిత, వాణిశ్రీ వార్నింగ్.. ఏంటి ఈ బెదిరింపులు అంటూ
11 ఏళ్ళ పాటు తెలుగు హీరోయిన్ ఓ దర్శకుడిని ప్రేమించింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ దర్శకుడికి వార్నింగ్ ఇచ్చారట. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకోండి.

రోజా సినిమాలు
90వ దశకంలో టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు తమ హవా ప్రదర్శించారు.వారిలో రోజా సెల్వమణి ఒకరు. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో స్టార్స్ తో ఆమె నటించారు. భైరవద్వీపం, బొబ్బిలి సింహం, శుభలగ్నం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో రోజా నటించారు. తెలుగులో ఆమె బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో నటించారు.
11 ఏళ్ళ పాటు ప్రేమలో రోజా
కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో రోజా తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణితో ప్రేమలో పడ్డారు. 11 ఏళ్ళ పాటు వీరి మధ్య ఘాడమైన ప్రేమ కొసనసాగింది. ఆ తర్వాత వీరిద్దరూ 2002లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ముందు ఆసక్తికర సంఘటన జరిగింది.
పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి వెళితే..
పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి రోజా, సెల్వమణి ఇద్దరూ చాలా మంది ప్రముఖుల వద్దకు వెళ్లారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని కూడా ఇన్వైట్ చేశారు. ఆ సమయంలో జయలలిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెల్వమణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని రోజా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. 11 ఏళ్ళు రోజా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది.
సెల్వమణికి వార్నింగ్
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి కంట్లో నీళ్లు రాకుండా బాగా చూసుకోవాలి. ఒక అమ్మాయి 11 ఏళ్ళు ప్రేమించి ఎదురుచూసి పెళ్లి చేసుకుంటోంది అంటే అది చిన్న విషయం కాదు అని జయలలిత అన్నారు. వాణిశ్రీ గారు కూడా అదే వార్నింగ్ ఇచ్చారు. బయటకు వచ్చాక ఆయన నాతో.. నేను కూడా నిన్ను 11 ఏళ్ళు ప్రేమించాను కదా. కానీ అందరూ నన్నే బెదిరిస్తున్నారు ఏంటి.. నీకు ఎవ్వరూ జాగ్రత్తలు చెప్పడం లేదు ఏంటి అంటూ సరదాగా చిరాకు పడ్డారు.
ఆమె నా ఫేవరేట్ పొలిటీషియన్
రాజకీయాల్లో తనకు జయలలిత ఫేవరేట్ పొలిటీషియన్ అని రోజా అన్నారు. ఆమె పడ్డ కష్టాలు నేను పడలేదు. నాకు పాలిటిక్స్ లో ఏదైనా కష్టం వస్తే.. ఆమెని ఆదర్శంగా తీసుకుంటా. జయలలితగారు పడ్డ కష్టాలతో పోల్చుకుంటే ఇది చిన్నది. దీనిని మనం అధికమించాలి అని నాకు నేను ధైర్యం నింపుకుంటా అని రోజా పేర్కొన్నారు.

