- Home
- Entertainment
- Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్...
Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్...
Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్!బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతున్నాయి.

బిగ్ బాస్ లో ఊహించని ట్విస్ట్ లు..
బిగ్ బాస్ హౌస్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు షాక్ ఇస్తున్నాయి. తాజా ఎపిసోడ్‌లో ముఖేష్ చేసిన త్యాగం కారణంగా ఎలిమినేషన్ నిలిచిపోయింది. కానీ ముఖేష్ మాత్రం నష్టపోవాల్సి వచ్చింది. ఎప్పుడు ఏ ట్విస్ట్ వినాల్సి వస్తుందో అని ఆడియన్స్‌తో పాటు హౌస్‌లో ఉన్నవారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్ల కంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉందనే చెప్పవచ్చు. ఈ వారమంతా ఎన్నో ట్విస్ట్‌లు చూశారు. ఇక వీకెండ్‌లో కూడా డబుల్ ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను, హౌస్‌లో ఉన్నవారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
బిగ్ బాస్ హౌస్ లో పెరుగుతున్న గొడవలు..
విన్నర్ ప్రైజ్ మనీ నుంచి మిథిలేష్ 15 లక్షల రూపాయలు తీసుకెళ్లాడు. కేవలం రెండు రోజులు హౌస్‌లో ఉండి, అంత మొత్తంలో డబ్బు తీసుకుని బయటకు వెళ్లడంతో.. అతనికి సపోర్ట్ చేసిన వారికి, ఇతరులకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని త్రిగుణ్ చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. హౌస్‌లో ఉన్నవారిపై ఫైర్ అయ్యాడు. అమన్‌తో అయితే ఏకంగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మధ్యలో గొడవ ఆపడానికి వెళ్లిన వెంకట్‌తో కూడా అమన్‌కు గొడవయ్యింది. మొత్తానికి మిథిలేష్ 15 లక్షలు తీసుకుని ఇంటి నుంచి హ్యాపీగా వెళ్లిపోగా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నవారు మాత్రం కొట్టుకుచస్తున్నారు. మిథిలేష్ వెళ్లిపోవడానికి కారణమైన వారిని టార్గెట్ చేస్తూ త్రిగుణ్ విమర్శలు గుప్పించాడు.
రోహిత్ కు గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున..
ఇక నాగార్జున సండే ఎపిసోడ్‌లో ఎప్పటిలాగానే ఫన్ గేమ్‌లతో సందడి చేయించారు. కంటెస్టెంట్స్ మధ్య 'అభిప్రాయాల గేమ్' కూడా ఆడించాడు నాగ్. జంతువులతో (Animals) పోల్చే ఆటలో.. త్రిగుణ్‌కు 'విషం ఎక్కువగా ఉన్న పాము' అని, ముఖేష్‌ను 'సింహం' అని ఇద్దరు, 'నక్క' అని అమన్ టాగ్ ఇచ్చారు. షాలినీకి 'నెమలి', 'కోతి' టాగ్స్ రాగా, దేబ్జానికి 'లేజీ' అనే టాగ్ ఇచ్చాడు నరేష్. ఇక ఈ క్రమంలో రోహిత్ చెల్లెలికి బాబు పుట్టాడని నాగార్జున అనౌన్స్ చేయడంతో, ఆ సంతోషాన్ని తట్టుకోలేక రోహిత్ ఏడ్చేశాడు.
ఇద్దరిని కాపాడిన ముఖేష్..
అసలు ట్విస్ట్ చూసుకుంటే.. నామినేషన్‌లో ఉన్న అందరూ సేవ్ అయ్యారు. ఫైనల్‌గా వర్షిణి, వంశీ ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ బిగ్ బాస్ తరఫున నాగార్జున ఒక ఆఫర్ ఇచ్చాడు. ముఖేష్ హౌస్‌కు కెప్టెన్‌గా ఉండటంతో.. అతను తన పవర్‌ను పోగొట్టుకుని, కెప్టెన్సీని వదిలేసుకుంటే నామినేషన్స్ రద్దు అవుతాయని నాగార్జున ప్రకటించాడు.
దాంతో ఏమాత్రం ఆలోచించకుండా, వారిద్దరినీ కాపాడటానికి తన కెప్టెన్సీని, పవర్‌ను వదిలేసుకున్నాడు ముఖేష్. తను అలా చేయకుండా ఉండి ఉంటే హౌస్ నుంచి వంశీ బయటకు వచ్చేవాడనే టాక్ నడిచింది. మొత్తానికి విజయవంతంగా రెండో వారం ముగిసింది. నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ మరో మలుపు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఎలాంటి టాస్క్‌లు ఉంటాయో చూడాలి.
