- Home
- Entertainment
- పానీపూరి అంటే ప్రాణమంటున్న పాన్ ఇండియా హీరోయిన్, రోడ్ సైడ్ ఫుడ్ అంటే అంత క్రేజ్ ఎందుకు?
పానీపూరి అంటే ప్రాణమంటున్న పాన్ ఇండియా హీరోయిన్, రోడ్ సైడ్ ఫుడ్ అంటే అంత క్రేజ్ ఎందుకు?
ఆమె ఓక పాన్ ఇండియా హీరోయిన్, వెయ్యి కోట్ల సినిమా చేసిన స్టార్, సౌత్ లో పేరు మారుమోగిన తార. అంత పెద్ద హీరోయిన్ రోడ్ సైడ్ పానీపూరి ఇష్టంగా తింటుందని మీకు తెలుసా? అంత పెద్ద స్టార్ హీరోయిన్ పబ్లిక్ గా ఎలా వెళ్లి పానీపూరి తింటుంది? ఎవరా స్టార్ బ్యూటీ?

మొదటి సినిమాతోనే
ఒక నటికి మొదటి సినిమానే పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అవడం అరుదైన సంఘటన. అలాంటి అదృష్టాన్ని అందిపుచ్చుకుంది ఓ స్టార్ హీరోయిన్. సైలెంట్ గా వచ్చి, జాతీయ స్థాయిలో దుమ్మురేపిన సినిమాలో హీరోయిన్ గా నటించింది బ్యూటీ. ఆతరువాత కెరీర్ కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అంత స్టార్ డమ్ ఉన్నా కానీ, సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తోన్న ఆ బ్యూటీ ఏవరో తెలుసా?
కేజీఎఫ్ తో స్టార్ డమ్
ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీనిధి శెట్టి . 2018లో విడుదలైన 'కేజీఎఫ్: ఛాప్టర్ 1' సినిమా ద్వారా సినీ ప్రపంచంలో అడుగుపెట్టింది శ్రీనిధి. ఆ సినిమా లో రాక్ స్టార్ యష్ సరసన నటించి మెప్పించింది. ఇక ఈసినిమా విజయం ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఈసినిమాలో ఆమె కనిపించింది చాలా తక్కువ సమయమే అయినా.. ఆ పాత్ర ఇంపాక్ట్ సినిమాలో గట్టిగా కనిపించింది. దాంతో శ్రీనిధి శెట్టికి సైలెంట్ గా ప్యాన్స్ పెరిగిపోయారు. మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే సినిమాల విషయంలో చాలా సెలక్టీవ్ గా వెళ్తోంది శ్రీనిధి. కధ నచ్చితేనే సినిమాలు చేస్తోంది. పెద్ద సినిమా అయినా నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది బ్యూటీ.
ఇష్టంతో
అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కాని.. సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతోంది శ్రీనిధి శెట్టి. సాధారణ జనాల మాదిరిగా బయట తిరగడవ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి వెల్లడించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. శ్రీనిధి మాట్లాడుతూ.. "మా పేరెంట్స్‌కు మేము ముగ్గురం ఆడపిల్లలమే. నేను పదో తరగతి చదువుతున్నపుడు మా అమ్మ చనిపోయారు. అప్పటి నుంచి నాన్నే మమ్మల్ని పెంచారు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఈ ఫీల్డ్‌కి వచ్చాను." అని చెప్పారు.
పానీ పూరీ అంటే ఎంతో ఇష్టం
'కేజీఎఫ్' సినిమా అనంతరం ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. అయితే అందరూ అంగీకరించేలా కాకుండా, తనకు నచ్చిన కథలకే ఓకే చెబుతానని చెప్పింది. శ్రీనిధి శెట్టి. అంతే కాదు సాధారణ లైఫ్ ను గడపడం ఆమెకు చాలా ఇష్టం. రోడ్ సైడ్ పానీపూరి తినడం అంటే మరింత ఇష్టమట. ఈ విషయంలో శ్రీనిధి మాట్లాడుతూ.. "ఎంత క్రేజ్ వచ్చినా నాకు సింపుల్‌గా ఉండడమే ఇష్టం. అవసరమైతే క్యాబ్‌లో వెళ్తాను. సూపర్ మార్కెట్‌లు, మాల్స్‌కి వెళుతాను. రోడ్డుపక్కన పానీపూరీ తినడం నాకు ఇష్టం. పానీపూరి చాలా ఇష్టంగా తింటాను. అయితే అక్కడివాళ్లు నన్ను గుర్తించకముందే నేను వెళ్లిపోతాను." అని నవ్వుతూ చెప్పింది శ్రీనిధి.
సాధారణ జీవనశైలి
ఇక పాన్ ఇండియా క్రేజ్ ఉన్నా కానీ.. శ్రీనిధి శెట్టి సాధారణ జీవనశైలికి అభిమానులు ఫిదా అవుతున్నారు. స్టార్ స్టేటస్ వచ్చినప్పటికీ, ఇంత సింపుల్ గా ఉండటం నిజంగా గొప్పవిషయం అని వారు అంటున్నారు. శ్రీనిధి ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. తన తాజా తెలుగు చిత్రం ‘తెలుసు కదా’ విడుదల కోసం ముస్తాబవుతోంది. ఈ సినిమాలో ఆమెకు జోడీగా సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మంచి అభిరుచి గల పాత్రలను ఎంచుకుంటూ తన జాగ్రత్తగా పయనిస్తోన్న శ్రీనిధి శెట్టి, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు.