53 ఏళ్ళ వయసులో కూడా దుమ్మురేపుతోన్న హీరోయిన్, 6 సినిమాలతో సందడికి సిద్ధం
53 ఏళ్ళ వయసులో వచ్చినా తగ్గేది లేదంటోంది ఓ స్టార్ హీరోయిన్. ఇప్పటికీ ఫిల్ గా ఉంటూ, గ్లామర్ ను మెయింటేన్ చేస్తోన్న ఆ హీరోయిన్, వరుస సినిమాలతో దూసుకుపోతోంది. త్వరలో 6 సినిమాలతో సందడి చేయబోతోంది బ్యూటీ.

53 వయస్సులో కూడా
ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో సిల్వర్ స్క్రీన్ ను ఏలింది అప్పటి టాప్ హీరోయిన్ టబు. ఫిట్ నెస్ తో పాటు, గ్లామర్ ను కూడా జాగ్రత్తగా మెయింటేన్ చేస్తుంది. అంతే కాదు ఈ ఏజ్ లో కూడా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు సాధిస్తోంది టబు. ఎక్కువగా సీక్వెలో సినిమాలవైపు మెగ్గుచూపుతోంది.
క్రూ 2
ఇక గతంలో టబు నటించిన 'క్రూ' సినిమా సూపర్ హిట్ అయ్యక, ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఆ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు టీమ్. ఈసినిమాలో మరోసారి టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ కలిసి కనిపిస్తారని అంటున్నారు.
చాందినీ బార్ 2
ఫిల్మ్‌మేకర్ సందీప్ సింగ్, 'చాందినీ బార్' సీక్వెల్ 'చాందినీ బార్ 2' తీయబోతున్నట్టు కొద్దికాలం క్రితం ధృవీకరించారు. ఈ సినిమా షూటింగ్ 2025లో మొదలవుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాన రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాద్వారా టబు మరోసారి సందడి చేయబోతున్నారు.
భోళా 2
'భోళా' సినిమాలో టబును ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. ఈసినిమాలో ఆమె నటన అందరిని ఫిదా చేసింది. మీడియా కథనాల ప్రకారం, సినిమా విడుదల తర్వాత మేకర్స్ దీని సీక్వెల్ 'భోళా 2' తీయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో కూడా టబు ప్రధాన పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. మరి ఈసినిమాకు సబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
దే దే ప్యార్ దే 2
'దే దే ప్యార్ దే 2' సినిమాలో అజయ్ దేవగన్‌తో పాటు టబు కూడా కీలక పాత్రలో కనిపించనుంది. మేకర్స్ ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
దృశ్యం 3
సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'దృశ్యం' సినిమాను బాలీవుడ్ లో అజయ్ దేవగన్, శ్రీయా జంటగా రెండు సార్లు సీక్వెల్ చేశారు. మొదటి, రెండో భాగాల్లో అజయ్ దేవగన్, శ్రీయాతో పాటు పోలీస్ పాత్రలో అదరగొట్టారు. ఇప్పుడు దీని మూడో భాగాన్ని కూడా వీలైనంత త్వరగా తీయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా అజయ్ దేవగణ్ తో పాటు టబు సందడి చేయబోతున్నారు.
అంధాధున్ 2
'అంధాధున్' విజయం తర్వాత ఇప్పుడు దీని రెండో భాగం రాబోతోంది. మేకర్స్ దీని రెండో భాగం స్క్రిప్ట్‌పై పని మొదలుపెట్టారు. ఇందులో కూడా టబు ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఈసినిమా మొదటి భాగంలో టుబు పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి ఈసారి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.