కీర్తి సురేష్ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశారా?!
నూతన వధూవరులు కీర్తి సురేష్, ఆంటోనీ తాటిల్ తమ మొదటి సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విజయ్, కళ్యాణి ప్రియదర్శన్, మమిత బైజు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
Keerthy Suresh, Antony Thattil, pongal
కొత్త పెళ్లి కూతురు కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తాటిల్ తో కలిసి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంది. అలాగే వీరి సంక్రాంతి వేడుకలలో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా పాలు పంచుకోవటం విశేషం.
Keerthy Suresh, Antony Thattil, pongal
విజయ్ ఒక్కరేనా కాదు కళ్యాణి ప్రియదర్శన్, మమిత బైజు కూడా ఈ సంబరాలులో పాల్గొని ఈ కొత్త జంటకు ఆనందాన్ని కలిగించారు. కీర్తి సురేష్ తన ఇనిస్ట్రాలో ఈ ఫొటోలను షేర్ చేసింది. వివాహం తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతిని ఈ జంట ఘనంగా జరుపుకున్నారు.
Keerthy Suresh, Antony Thattil, pongal
కీర్తి సురేష్ పెళ్లి గత ఏడాది డిసెంబర్ లో వైభవంగా జరిగింది. ఆమె పదిహేనేళ్ల నుంచి ప్రేమిస్తున్న తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ డిసెంబర్ 20న గోవాలో సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఫోటోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
Keerthy Suresh, Antony Thattil, pongal
హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Keerthy Suresh, Antony Thattil, pongal
దీపావళి రోజున ఆంటోనీ తాటిల్‌తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేశ్ తెలియజేసింది. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది.
Keerthy Suresh, Antony Thattil, pongal
ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
Keerthy Suresh, Antony Thattil, pongal
సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా ఉన్న ఆమె కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బేబీ జాన్ మూవీతో ఆమె బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ రీసెంట్ గానే విడుదల అయ్యింది.
read more: 'జైలర్' లో బాలకృష్ణగారికి ఏ పాత్ర అనుకున్నానంటే.. : నెల్సన్
Keerthy Suresh, Antony Thattil, pongal
కీర్తి సురేష్ తన ఇనిస్ట్రాలో ఈ ఫొటోలను షేర్ చేసింది. వివాహం తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతిని ఈ జంట ఘనంగా జరుపుకున్నారు.
read more: `గేమ్ ఛేంజర్` నేను బాగా చేశాను, ఫలితంపై శంకర్ సంచలన స్టేట్‌మెంట్.. కారణం ఎవరు?
also read: దేవర బతికే ఉన్నాడా? ప్రకాష్ రాజే యతినా? `దేవర 2` అసలు స్టోరీ?