'జైలర్' లో బాలకృష్ణగారికి ఏ పాత్ర అనుకున్నానంటే.. : నెల్సన్
రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. జైలర్ 2 కోసం దర్శకుడు నెల్సన్, బాలకృష్ణను ఒక పాత్ర కోసం సంప్రదించాలనుకున్నట్లు తెలిపారు. జైలర్ 2 టీజర్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.
Nandamuri Balakrishna, Jailer2, rajanikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా కలెక్షన్స్ కుంభవృష్టి కురిపించింది.
అటు తమిళంలో తో పాటు ఇటు తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు. స్క్రీన్ ప్లే పరంగానూ, కలెక్షన్ల పరంగానూ జనాల ఆదరణ పొందింది జైలర్ సినిమా. అలాగే జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు. మన తెలుగు స్టార్ హీరోలు ఎవరూ గెస్ట్ లుగా కనిపించకపోవటం లోటుగా కనపడింది.
ఇప్పుడు జైలర్ 2 సినిమా చేస్తున్నారు రజినీకాంత్. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ టీజర్‌కి జనాల నుంచి విశేష స్పందన వస్తోంది.
ఈ టీజర్‌లో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమాలో మరింత వైలెన్స్ ఉండనుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో నెల్సన్ మొదట తెలుగు స్టార్ బాలయ్య ని ఓ గెస్ట్ రోల్ లో ప్లాన్ చేసారని తెలిసింది.
jailer 2
బాలయ్యని జైలర్ లో నటింపచేయాలనేది దర్శకుడు ఆలోచనట. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాతో చెప్పారు. భయం అంటే ఎరగని ఓ పోలీస్ అధికారి పాత్రలో బాలయ్యను తీసుకోవాలని దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేసారట.
తమిళ పత్రిక సినిమా వికటన్ లో మాట్లాడుతూ నెల్సన్.., “నేను బాలకృష్ణ సార్ ని తెలుగు నుంచి సినిమాలోకి తీసుకోవాలనుకున్నాను. అయితే పార్ట్ వన్ లో నాకు సరైన ప్లేస్ మెంట్ దొరకలేదు. నేను ఎప్రోచ్ అయ్యి అడిగినా ఆయన ఒప్పుకుంటారో లేదో తెలియదు. . కానీ నేను ఆయన్ను నా సినిమాలోకి తెద్దామనుకున్నాను .”
Jailer movie
నెల్సన్ కంటిన్యూ చేస్తూ...“ఇంక జైలర్ సినిమాలో ఆయనకు ఫలానా పాత్ర చేస్తే బాగుంటుందనిపిస్తే ఖచ్చితంగా ఆయన్ను ఎప్రోచ్ అవుతాను. నా ఆలోచన అయితే డెడ్లీ ఎటాకింగ్ పోలీస్ పాత్ర ఆయన చేత చేయించాలి. ఆ పాత్రకు ఆర్క్ ఫెరఫెక్ట్ గా రాసుకోవాలి. అందరూ సూపర్ స్టార్స్ జైలర్ లో కనిపిస్తే బాగుంటుందనేది నా డ్రీమ్.” అన్నారు. అయితే జైలర్ 2 లో బాలయ్య పాత్రకు ఏమైనా ప్లానింగ్ గా ఉందా లేదనే విషయం మాత్రం చెప్పలేదు. అలాంటిది ఏమన్నా ఉన్నా సర్పైజ్ గా ఉంచుతారు దర్శకుడు.
Jailer Movie
సంక్రాంతి పండుగ సందర్భంగా జైలర్ 2 టీజర్ ను విడుదల చేశారు. జైలర్ 1లో రజనీకాంత్‌తో కలిసి రమ్యకృష్ణ, వినాయకన్, తమన్నా భాటియా, వసంత్ రవి, మీర్నా మీనన్ మరియు యోగి బాబు నటించారు. ఇదే టీమ్ ఇప్పుడు జైలర్ 2లోనూ కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్.