- Home
- Entertainment
- 9 గంటలు నాన్ స్టాప్ గా డబ్బింగ్, ఒక పాత్రకు 5 భాషల్లో వాయిస్ అందించిన స్టార్ హీరోయిన్ ఎవరు?
9 గంటలు నాన్ స్టాప్ గా డబ్బింగ్, ఒక పాత్రకు 5 భాషల్లో వాయిస్ అందించిన స్టార్ హీరోయిన్ ఎవరు?
ఈ కాలంలో హీరోయిన్ల సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కష్టం...కానీ కొంత మంది మాత్రం పట్టుబట్టి భాష నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చేప్పుకుంటున్నారు. ఒక పాత్రకు 5 భాషల్లో డబ్బింగ్ చెప్పిన హీరోయిన్ గురించి మీకు తెలుసా?

చిన్న వయసులోనే జాతీయ అవార్డు..
హీరోయిన్ గా చాలా చిన్న వసులోనే జాతీయ అవార్డు సాధించింది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. పని మీద ఆమెకు ఉన్న నిబద్ధ తనను ఈ స్థాయికి తీసుకువచ్చింది. కష్టపడే తత్వం కీర్తికి మొదటినుంచీ ఉంది. ఆ సిన్సియారిటీ మరోసారి నిరూపించుకుంది కీర్తి సురేష్.. మరోసారి అభిమానుల , సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది ఈ హీరోయిన్. ఒక సినిమా కోసం ఏకంగా 9 గంటల పాటు నిరంతరంగా డబ్బింగ్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
9 గంటలు నాన్ స్టాప్ డబ్బింగ్
డబ్బింగ్ స్టూడియోలో అలసటతో కనిపిస్తున్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది కీర్తి సురేష్. “9 గంటల డబ్బింగ్ తర్వాత నా పరిస్థితి ఇది” అని ఫోటోకు కాప్షన్ కూడా రాసింది. భాష వేరైనా.. ఏ భాషలో నటించినా.. కీర్తి సురేష్ తన పాత్రలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.
ముఖ్యంగా ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రకు తెలుగు, తమిళ భాషల్లో ఆమె ఇచ్చిన వాయిస్ సినిమాకు ప్రాణం పోసింది. సావిత్రి పాత్రకు సంబంధించి ఎమోషన్స్ ను అంద్భుంగా పండించింది కీర్తి. అందుకే ఆ సినిమాకు జాతీయ అవార్డును అందుకుంది ఈ హీరోయిన్.
ఒక పాత్రకు 5 భాషల్లో డబ్బింగ్..
ఈమధ్య కాలంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’లో ‘బుజ్జి’ అనే ఏఐ క్యారెక్టర్‌కు ఏకంగా 5 భాషల్లో వాయిస్ అందించి తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది కీర్తి సురేష్. తన వాయిస్ మాడ్యులేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భాష మారినా భావాన్ని అదే స్థాయిలో ప్రేక్షకులకు చేరవేయగల ఆమె వాయిస్ విమర్శకులు ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం కీర్తి సురేశ్ చేతిలో పలు భాషల్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఆడియన్స్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇంత మాస్ సినిమాలో కీర్తి ఎలాంటి పాత్రలో కనిపిస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు.
కీర్తి సురేష్ సినిమాలు
ఇక తమిళంలో ఆమె ఒక సినిమాలో లాయర్ పాత్రను పోషిస్తుండగా, హిందీలో ‘అక్కా’ అనే రివెంజ్ థ్రిల్లర్ సిరీస్‌లో కనిపించనుంది.ఇక మలయాళంలో రూపొందుతున్న ‘తొట్టం’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతుండగా, ఇందులో కీర్తి సురేశ్ ఇప్పటివరకు చూడని యాక్షన్ అవతార్‌లో కనిపించనుందని సమాచారం. ‘ది రైడ్’ వంటి అంతర్జాతీయ యాక్షన్ చిత్రాలకు పనిచేసిన వీ యాక్షన్ డిజైన్ టీమ్ ఈ సినిమాకు స్టంట్స్ అందిస్తుండటం విశేషం. అలాగే ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు.

