MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Brahmamudi: రుద్రాణి నోరు మూయించిన కావ్య.. రాహుల్ మాటలకు నిజం బయటపడనుందా?

Brahmamudi: రుద్రాణి నోరు మూయించిన కావ్య.. రాహుల్ మాటలకు నిజం బయటపడనుందా?

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తన అక్క ప్రేమించిన వ్యక్తి మోసగాడని నిరూపించడానికి తపన పడుతున్న ఒక చెల్లెలి కథ  ఈ సీరియల్. ఇక ఈరోజు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Published : May 26 2023, 01:28 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య తల్లిదండ్రులని ఫంక్షన్ కి పిలవద్దు అంటుంది అపర్ణ. నీకు కావాలంటే నీ కొడుకు ఫంక్షన్ కి పిలువకు అంతేకానీ నా కొడుకు ఫంక్షన్ కి పిలవద్దని నువ్వు చెప్పడం ఏమిటి అంటూ పంతం కొద్దీ కనకానికి ఫోన్ చేసి నిశ్చితార్థానికి పిలుస్తుంది రుద్రాణి. స్వప్న కి కూడా రేపే నిశ్చితార్థం అని మనసులో అనుకొని బయటకు మాత్రం రేపు ఇంట్లో పూజ ఉందండి.

210
Asianet Image

రావటానికి అవ్వదు ఏమీ అనుకోవద్దు అని సున్నితంగా తిరస్కరించి ఫోన్ పెట్టేస్తుంది కనకం. మరోవైపు కారులో వస్తూ రాహుల్ సరదాగా ఆడపిల్లల్ని ఏడిపిస్తాడు అనుకున్నాను కానీ మరీ ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడని అనుకోలేదు ఇలాంటి వాడిని మా అక్కకిచ్చి చేయాలా అంటుంది కావ్య. మీరేంటండి.. ఇన్నాళ్లు కలిసి పెరిగిన నాకే తెలియదు వాడంత దుర్మార్గుడని.

310
Asianet Image

అన్నయ్యకి చెప్దామంటే రుజువులు సాక్షాలు అడుగుతాడు అంటాడు కళ్యాణ్. శృతి కళ్ళల్లో బాధని చూశాను ఆ బాదే శృతి చేత సాక్షాలని వెలికి తీసేలాగా చేస్తుంది అప్పుడు నిజాలు బయటికి వస్తాయి అంటుంది కావ్య. పుట్టలో దాగిన నల్లత్రాచుని పొగ పెట్టి బయటికి రప్పిద్దాము అంటాడు కళ్యాణ్. మరోవైపు తన కోడలికి పెట్టే నగలరని చూపిస్తుంది రుద్రాణి.

410
Asianet Image

అందులో ఒక నగని తీసి ఇది ఇంకా మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు కదా దీన్ని ఎందుకు పెడుతున్నావు అంటుంది అపర్ణ. నా కోడలికి కొన్ని ఖరీదైనవే ఉండాలి నీ కోడలు లాగా నా కోడలు పూర్ ఫ్యామిలీ నుంచి రావడం లేదు అని చులకనగా మాట్లాడుతుంది రుద్రాణి. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా ఆ పెళ్లి జరగడానికి కారణం మీరు ముసుగేసుకుని పీటల మీద కూర్చొని బలవంత పెట్టింది మీరు.

510
Asianet Image

మీరు మీ కోడలికి పెడుతున్న ఎక్స్క్లూజివ్ నగని డిజైన్ చేసింది నా భర్త అంటూ కోపంగా మాట్లాడుతుంది కావ్య. నిన్న కాక మొన్న వచ్చి ఈ ఇంటి ఆడపడుచుని నన్నే అన్ని మాటలు అంటావా అంటుంది రుద్రాణి. ఇంటి ఆడపడుచు ఇంటి సుఖాన్ని కోరుకోవాలి అంతేకానీ ఇలా అవమానపరిచే లాగా మాట్లాడకూడదు అంటుంది కావ్య. నన్నే అంత మాట అంటావో అంటూ కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది రుద్రాణి.

610
Asianet Image

ఇంటి కోడలు మీద చేయి ఎత్తవా ముందు ఆ చేయి దించు అంటూ రుద్రాణి మీద కేకలు వేస్తుంది అపర్ణ. నా కొడుక్కి కోటీశ్వరుల సంబంధం వస్తుంది అంటే అందరూ ఒకటైపోయారు అంటుంది రుద్రాణి. పెళ్లికూతురు తల్లి మా అత్తగారి ప్రాణ స్నేహితురాలు ఈ సంబంధాన్ని ఐదు నిమిషాల్లో తప్పించగలరు. కానీ ఈ కుటుంబ సంస్కారం అలా చేయనివ్వడం లేదు.

710
Asianet Image

కానీ మా అత్తగారిని గాని నా భర్తని గాని ఏమైనా అంటే నేను ఊరుకోను అంటూ హెచ్చరించి వెళ్ళిపోబోతుంది కావ్య. అపర్ణ కావ్యని ఆగమని చెప్పి ఖరీదైన పట్టు చీర నగలు రాజ్ కిచ్చి కావ్యకి ఇమ్మంటుంది. రాజ్ తీసుకువెళ్లి కావ్యకి ఇస్తాడు. కావ్య తీసుకోవటానికి మొహమాటపడుతుంది. మీ అత్తగారు నిన్ను కోడలుగా అంగీకరించి ఇస్తున్న సారె అది.
 

810
Asianet Image

మొహమాట పడకుండా తీసుకో అమ్మ అంటుంది చిట్టి. ఆనందంగా భర్త చేతుల్లోంచి సారే అందుకుంటుంది కావ్య. మరోవైపు స్వప్న పెళ్లికి పంతులుగారు మరుసటి రోజు సాయంత్రమే ముహూర్తం పెడతారు. ఖాయం చేసేద్దాం అంటుంది కనకం. మరి రేపు సాయంత్రమే అంటే తొందరపడుతున్నామేమో అంటాడు కృష్ణమూర్తి. ఇప్పుడు తొందరపడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది అని భర్తకి నచ్చచెప్తుంది  కనకం.
 

910
Asianet Image

ఈ విషయాన్ని కావ్యక్కకి చెప్పాలి అనుకొని ఆమెకి ఫోన్ చేస్తుంది అప్పు. మరోవైపు చీర చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది కావ్య. మరి అంత మురిసిపోకు నిన్ను పనిమనిషి అనుకుంది అరుంధతి. అలాంటి స్థాయి వాళ్లే రేపు అందరూ మన ఇంటికి వస్తారు. వాళ్ల దగ్గర ఈ ఇంటి పరువు దిగజారి పోకూడదు అందుకే ఈ చీరలు నగలు ఇచ్చాను అంతేగాని నిన్ను కోడలిగా ఒప్పుకొని కాదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఆ మాటలు విన్న రాజ్ ఇంచుమించు నాది కూడా అదే అభిప్రాయం. గడువులోగా నీ  నిర్దోషిత్వాన్ని నిరూపించుకో లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్లి పోవాల్సి వస్తుంది అంటాడు. 

1010
Asianet Image

అంత దూరం రానివ్వను ఎందుకంటే నా వైపు నిజాయితీ ఉంది అని కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది కావ్య. మరోవైపు రేపు రాహుల్ పేరు మీద నిశ్చితార్థం ముహూర్తాలు లేవు అంటారు పంతులుగారు. సరిగ్గా చూడండి రేపే నిశ్చితార్థం జరగాలి అంటుంది రుద్రాణి. తరువాయి భాగంలో కావ్య బయటికి వెళ్లడాన్ని చూస్తాడు రాహుల్. ఎక్కడికో వెళ్తుంది మీరు ఫాలో అవ్వండి అని రౌడీలుకి చెప్తాడు. కావ్య శృతిని కలిసింది అని చెప్తారు రౌడీలు. రాహుల్ ఫోన్ లో మాట్లాడటం రాజ్ చూస్తాడు.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories