MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi: కోడలి ట్రాప్ లో పడిపోయిన అపర్ణ.. క్యూరియాసిటీ తట్టుకోలేకపోతున్న కావ్య!

Brahmamudi: కోడలి ట్రాప్ లో పడిపోయిన అపర్ణ.. క్యూరియాసిటీ తట్టుకోలేకపోతున్న కావ్య!

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకొని టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంది. భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలని తపన పడుతున్న భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

3 Min read
Author : Navya G
Published : Oct 03 2023, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 ఎపిసోడ్ ప్రారంభంలో మా అమ్మ మొండిది ఎవరు చెప్పినా వినదు అంటుంది కావ్య. మా అక్క చెప్పిన వినదా అంటుంది ధాన్యలక్ష్మి. ఇక్కడికి వస్తే మాటలు పడాల్సి వస్తుందని ఇబ్బంది పడుతోంది అంటుంది కావ్య. కూతురు కోసం ఆ మాత్రం మాటలు పడలేదా.. అయినా నేను పిలిస్తే ఎందుకు రాదో చూస్తాను అంటూ కనకానికి ఫోన్ చేసి పండక్కి రమ్మని పిలుస్తుంది అపర్ణ. మీరు పిలిస్తే తప్పకుండా వస్తాం అంటుంది కనకం. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక నువ్వు రేపు మీ ఇంటికి వెళ్లక్కర్లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

 మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తారు. నీ పనులు ఇక్కడే చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇదంతా చూస్తున్న రుద్రాణి మా వదిన ఇంత సులువుగా కోడలు ట్రాప్ లో పడిపోతుంది అనుకోలేదు అని మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు చీర కట్టుకుంటున్న స్వప్న కడుపుకి పెట్టుకున్న ప్యాడ్ జారిపోతుందేమో అని కంగారుపడుతుంది. జారకూడదని కోరుకుంటుంది.

38

మరోవైపు అందరూ కలిసి తీసుకువచ్చి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. అప్పుడు కావ్య నుదుటన ఉన్న స్టిక్కర్ పడిపోతుంది. అయితే కోడలి మొహాన బొట్టు లేకపోవడంతో ఆమెని మందలిస్తుంది అపర్ణ. పెట్టుకున్నాను కానీ పడిపోయినట్లుగా ఉంది ఇప్పుడే మళ్ళీ వెళ్లి పెట్టుకుని వస్తాను అంటుంది కావ్య. దీనికోసం మళ్లీ పైకి వెళ్ళటం ఎందుకు అని రాజ్ ని కావ్యకి బొట్టు పెట్టమని చెప్తుంది చిట్టి. బామ్మ మాట కాదనలేక కావ్య నుదుటిన బొట్టు పెడతాడు రాజ్.
 

48

ఇక చీటీల కార్యక్రమం మొదలు పెడదాం అంటుంది చిట్టి. అదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్న. మన ఇంట్లో వాళ్ళ కోరికలన్నీ పేపర్ల మీద రాసి ఒక సిటీలో వేస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. అపర్ణ కడుపుతో ఉన్నప్పుడు మేమందరం తనకి పిల్లలు కలగాలని చీటీ మీద రాశాం. వెంటనే అపర్ణ కడుపు పండింది. అది మాకు బాగా నిదర్శనం ఉంటుంది చిట్టి. అయితే చీటీలు రాజకీయాల్సిందే అంటుంది కావ్య. నువ్వేం రాస్తావో మాకు తెలుసులే అందుకే ఒకేసారి ఇద్దరు పిల్లలు కావాలని రాయు ఓ పని అయిపోతుంది అని నవ్వుతుంది ధాన్యలక్ష్మి.
 

58

చిట్టి చెప్పడంతో వెళ్లి కాగితాలు పెన్ను తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది ధాన్య లక్ష్మి. సీతారామయ్య ముని మనవడు పుట్టే వరకు ప్రాణాలు కాపాడమని చీటీలో రాస్తాడు. చిట్టి సుమంగళిగా పోవాలని రాస్తుంది. ధాన్య లక్ష్మీ బంగారం కావాలని రాస్తుంది ఇలా ఒక్కొక్కరు వాళ్లకు నచ్చిన కోరిక రాస్తారు. రాజ్ మాత్రం నేను తాతయ్య కోరిక తీర్చాలని కావ్యతో చనువుగా ఉంటున్నాను కానీ నాకు తనను చూస్తుంటే గిల్టీగా అనిపిస్తుంది త్వరలోనే ఈ పరిస్థితి నుంచి దూరం చెయ్యు అని రాస్తాడు.
 

68

 భర్త కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అమలు జరిగేలాగా చూడమని కావ్య రాస్తుంది. రాజ్ ఏమి రాశాడో తెలుసుకోవాలని ఆ కాగితం వైపు తొంగి చూస్తుంది కావ్య కానీ అలా చూడకూడదు అని చెప్పడంతో ఆగిపోతుంది. కానీ ఆ చీటీలో ఏముందో ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇక ఈ పని అయిపోయింది కాబట్టి వెళ్లి వంట పని చేయండి అని పురమాయిస్తుంది చిట్టి. కాసేపటి తర్వాత కావ్య వినాయకుడి దగ్గరికి వచ్చి భర్త చీటీలో ఏం రాశాడో తెలుసుకోవాలనుకుని దొంగ చాటుగా ఆ జార్ లో చెయ్యి పెట్టబోతోంది.
 

78

 మళ్లీ వినాయకుడిని చూసి నా భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలనుకోవడం నా బాధ్యత. నాకే కాదు నీకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే నీవల్లే మేము కలిసాము. కాబట్టి ఆ చీటీ తీసి చదివేశానని నామీద కోపం తెచ్చుకొని శపించకు అని వినాయకుని చెవిలో చెప్తుంది. అప్పుడే వినాయకుని చేతిలో ఉన్న పువ్వు కింద పడిపోవటంతో వినాయకుడు పర్మిషన్ ఇచ్చాడు అనుకోని జార్లో చేయి పెట్టబోతుంది కావ్య. అప్పుడే అక్కడికి కంగారుగా వచ్చిన కళ్యాణ్ అనామిక తల్లిదండ్రులను తీసుకొని వస్తుంది.
 

88

 పెద్దమ్మ, రుద్రాణి అత్తయ్య ఏం మాట్లాడతారో అని కంగారుగా ఉంది అంటాడు. నేను చూసుకుంటాను అని ధైర్యం చెబుతుంది కావ్య. మళ్లీ చీటీ తీయడం కోసం జార్ లో చెయ్యి పెట్టబోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్య లక్ష్మి ఏం చేస్తున్నావు, పద మీ అమ్మ వాళ్లు వచ్చారు అని చెప్పటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఇంట్లోకి వచ్చిన కనకం కూతుర్ని చూసి ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో పూజ అయిపోయిన తర్వాత టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటారు కావ్య వాళ్ళు.

About the Author

NG
Navya G
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali 2026 OTT Releases: దీపావళికి సినిమాల జాతర, ఓటీటీలో సందడి చేయనున్న 10 కొత్త సినిమాలు ఇవే
Recommended image2
Salman Khan: ఒక్కసారి సారీ చెబితే చాలు.. సల్మాన్‌కు బిష్ణోయ్ బంధువు ఆఫర్, నెక్స్ట్ ఏంటి?
Recommended image3
Ramayana Review: రామాయణం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved