- Home
- Entertainment
- Brahmamudi: కళ్యాణ్ కు అన్యాయం జరిగిందంటున్న ధాన్యలక్ష్మి.. తెలివిగా రాహుల్ ని ఇరికించిన కావ్య?
Brahmamudi: కళ్యాణ్ కు అన్యాయం జరిగిందంటున్న ధాన్యలక్ష్మి.. తెలివిగా రాహుల్ ని ఇరికించిన కావ్య?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంటుంది. మోసపోయినా కూడా ఇంకా ప్రేమించిన వాడినే నమ్ముతున్న ఒక ప్రేమికురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అరుంధతి వాళ్ళ అమ్మాయి వెన్నెలని మన రాహుల్ కి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటుంది అని చెప్తుంది చిట్టి. రాహుల్ రుద్రాణి చాలా ఆనంద పడిపోతారు. ధాన్యలక్ష్మి మొహం చిన్నబుచ్చుకొని కళ్యాణ్ కి అన్యాయం జరుగుతుందక్క అని అపర్ణతో చెప్తుంది. అవతల పెళ్లికూతురుకి కూడా అన్యాయం జరుగుతుంది అరుంధతిని చూస్తే జాలి వేస్తుంది అంటుంది అపర్ణ.
ఇది నా అభిప్రాయం మాత్రమే నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి. మా అమ్మాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా అని రాహుల్ ని అడుగుతుంది అరుంధతి. ఈ ఇంట్లో పెద్దవాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు పిల్లలు ఆచరిస్తారు ఈ పెళ్లి నాకు ఇష్టమే అంటుంది రుద్రాణి. రాహుల్ కి పదేపదే ఫోన్ వస్తువు ఉండటంతో ఇంపార్టెంట్ కాల్ ఏమో వెళ్లి మాట్లాడు అంటుంది అరుంధతి.
అలాగే అంటూ డాబా మీదికి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాహుల్. నన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఎవడో వచ్చాడు నన్ను మాత్రం ఎన్ని సంబంధాలు అని చెడగొట్టుకోమంటావు అని ప్రశ్నిస్తుంది స్వప్న. ఇప్పటికే నిజం తెలిసిపోయి మా ఇంట్లో అందరూ నన్ను దోషిని చూసినట్టు చూస్తున్నారు. మన పెళ్లి ఏం జరగదు నువ్వేనా పెళ్లి చేసుకుని హాయిగా ఉండు నా బాధతోనే నేను బ్రతికేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాహుల్.
నువ్వేమీ బాధపడకు..మన పెళ్లి జరుగుతుంది ఆస్తికి నిన్ను దూరం కానివ్వను అలాగే నేను దూరం చేసుకోను అనుకుంటుంది స్వప్న. ఆ తర్వాత కిందికి వచ్చిన రాహుల్ వెన్నెలతో మాటలు కలుపుతాడు. కళ్యాణ్ ని దగ్గరికి పిలిచి వాళ్ళిద్దరితో కలిపి నువ్వు సెల్ఫీ తీసుకో అంటుంది కావ్య. ఎందుకు వదిన అంటాడు కళ్యాణ్. చెప్తాను ముందు తీసుకో అని కావ్య అనటంతో ఎవరికి అనుమానం రాకుండా అందరితో సెల్ఫీలు తీసుకుంటూ ఆఖరికి రాహుల్, వెన్నెలతో కూడా సెల్ఫీ తీసుకుంటాడు కళ్యాణ్.
పక్కకు వెళ్లిన తర్వాత దీన్ని మీ అక్కకు పంపిద్దామా అంటాడు. వద్దు మనమే ఏదో ప్లాన్ చేసాం అనుకుంటుంది ఈ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి కాబోయే వధూవరులకి అడ్వాన్స్ విషెస్ చెప్పు అప్పుడు తన అర్థం చేసుకుంటుంది అంటుంది కావ్య. సూపర్ ఐడియా అంటూ కావ్య చెప్పినట్లు చేస్తాడు కళ్యాణ్. మరోవైపు కృష్ణమూర్తి. ప్రస్తుత పరిస్థితుల్లో వేరే దారి లేదు అంటుంది కనకం.
ఆమె తోటి కోడలు కూడా కనకానికే సపోర్టు చేయడంతో సరే మీ ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. కనకం కూతురు దగ్గరికి వెళ్లి మీకు అతనితో పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని రమ్మన్నాను అని చెప్తుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మిడిల్ క్లాస్ బ్రతుకు నాకు వద్దు అంటుంది స్వప్న. కానీ తప్పదు రోజులన్నీ ఒకే లాగా ఉండవు ప్రతి బ్రతుకులోని ఒక అసంతృప్తి ఉంటుంది పెళ్లయితే అది నీకు కూడా అలవాటు అవుతుంది అంటుంది కనకం.
నువ్వు మారిపోయావు నా పాతమ్మ నన్ను మహారాణి లాగా చూసుకునేది. నాకు ఈ అమ్మ కాదు ఆ అమ్మ కావాలి అంటుంది స్వప్న. ఎప్పుడూ ఒకేలాగా ఉండడం అంటే కుదరదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కనకం. మరోవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చే ఎప్పుడూ నా మీద ఇంత కోపంగా లేవు పరాయి వ్యక్తి కోసం కొడుకుని వదులుకుంటావా అని అడుగుతాడు రాజ్.
నువ్వు కావ్యని క్షమిస్తావా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. కుదరదు అంటాడు రాజ్. మరి నీకు ఒక న్యాయము నీ భార్యకి ఒక న్యాయమా అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఆ తర్వాత గదిలో శీర్షాసనం వేసిన భర్తను చూసి మోకాళ్ళ నుంచి మెదడు జారీ కిందికి వస్తుందని ఇలా చేస్తున్నారా అంటుంది కావ్య. డాక్టర్ గారు సలహా ఇచ్చారు ఇలా చేస్తే గురకరాదంట అంటాడు రాజ్.
కానీ నాకు అలా అనిపించలేదు అంటుంది కావ్య. కావాలంటే పక్కన పడుకో నీకే తెలుస్తుంది అంటాడు రాజ్. నేరుగా వెళ్లి మంచం మీద పడుకుంటుంది కావ్య. ఏం చేస్తున్నావ్ అంటూ కసురుకుంటాడు రాజ్. మీరే పక్కన పడుకోమన్నారు కదా నేను భారత స్త్రీని భర్త మాటను కాదనను అంటుంది కావ్య. తరువాయి భాగంలో రాహుల్ ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చూపించి ఏంటిది అని నిలదీస్తుంది. కంగారు పడిన రాహుల్ ఆమెని అక్కడినుంచి తీసుకొని పార్క్ కి వెళ్ళిపోతాడు. వాళ్లని కళ్యాణ్, కావ్య ఫాలో అవుతారు.