- Home
- Entertainment
- Diviki Diviki Song: డివికి డివికి సాంగ్.. పోటీ పడి మరీ డ్యాన్స్ ఇరగదీసిన కీర్తి సురేష్, కృతి శెట్టి
Diviki Diviki Song: డివికి డివికి సాంగ్.. పోటీ పడి మరీ డ్యాన్స్ ఇరగదీసిన కీర్తి సురేష్, కృతి శెట్టి
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'జనవరి 12 విడుదల' మూవీ అప్పుడే సంక్రాంతి వైబ్ స్టార్ట్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన 'డివికి డివికి' అనే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనిల్ రావిపూడి సినిమాలు
సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి సినిమా ఉండాల్సిందే.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టాల్సిందే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావడం, సంక్రాంతి సీజన్ ని వాడుకుని మ్యాజిక్ చేయడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సంక్రాంతికి వస్తున్నాం.. మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు సంక్రాంతికి విడుదలై 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.
జనవరి 12 విడుదల నుంచి క్రేజీ సాంగ్
ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్ తో రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'జనవరి 12 విడుదల' చిత్రం అదే తేదీన రాబోతోంది. ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావిపూడి అందరికంటే 10 అడుగులు ముందే ఉంటారు. క్రేజీ ఐడియాలతో ప్రమోషన్స్ చేస్తుంటారు. తాజాగా ఈ చిత్రం నుంచి సంక్రాంతి వైబ్ స్టార్ట్ అయ్యేలా 'డివికి.. డివికి'అనే సాంగ్ లాంచ్ చేశారు.
డ్యాన్స్ ఇరగదీసిన కీర్తి సురేష్, కృతి శెట్టి
ఈ సాంగ్ లో కీర్తి సురేష్, కృతి శెట్టి లదే హవా. హుషారెత్తించే ఈ పాటలో ఇద్దరు హీరోయిన్లు డ్యాన్స్ ఇరగదీశారు. కీర్తి, కృతి క్రేజీ మూమెంట్స్ తో సాంగ్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ పాటకు బృంద మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. మధుప్రియా, హరి ప్రియా ఈ సాంగ్ పాడారు.















