- Home
- Entertainment
- Krishnam Raju: కృష్ణంరాజు నుంచి చిరంజీవి వరకు.. అంతమంది స్టార్స్ ఉన్నా చిన్నచూపు, కట్ చేస్తే 250 రోజులు
Krishnam Raju: కృష్ణంరాజు నుంచి చిరంజీవి వరకు.. అంతమంది స్టార్స్ ఉన్నా చిన్నచూపు, కట్ చేస్తే 250 రోజులు
కృష్ణంరాజు మేకప్ లేకుండా నటించిన సినిమా 250 రోజులు ఆడింది. ఈ విషయాన్ని కృష్ణంరాజు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కృష్ణంరాజు, చిరంజీవి నటించిన ఆ మూవీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

కృష్ణంరాజు
రెబల్ స్టార్ కృష్ణం రాజు, చిరంజీవి కలసి కొన్ని సినిమాల్లో నటించారు. అందులో మనవూరి పాండవులు చిత్రం కూడా ఒకటి. బాపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర విశేషాలని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కెరీర్ లో మేకప్ లేకుండా నటించిన చిత్రం మనవూరి పాండవులే అని కృష్ణంరాజు తెలిపారు.
చిరంజీవి మా ఊరి అబ్బాయే
మహాభారతంలోని క్యారెక్టర్స్ ని ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథ రూపొందించాం. నేను కృష్ణుడిగా నటించా. చిరంజీవి పార్థు పాత్రలో నటించాడు. అప్పటికి చిరంజీవి ప్రాణం ఖరీదు అనే సినిమాలో నటించాడు. మా ఊరి అబ్బాయే. చూడడానికి బావున్నాడు..బాగా నటిస్తున్నాడు. దీనితో పార్థు పాత్రలోకి చిరంజీవిని తీసుకున్నాం. పాత్రలు నేచురల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో కెమెరామెన్ బాలు మహేంద్ర గారు మేకప్ వద్దు అన్నారు.
మేకప్ లేకుండా నటించిన మూవీ
మేకప్ లేకుంటే ఎలా సార్.. సన్నివేశాలు బాగా వస్తాయా అని అడిగా. సన్నివేశాలు అద్భుతంగా కనిపించేలా ఏం చేయాలో నాకు తెలుసు అన్నారు. అలా ఏమాత్రం మేకప్ లేకుండా ఆ చిత్రంలో నటించాం. కేవలం 30 రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తయింది. సింగిల్ షాట్ కూడా పెండింగ్ లేదు. రాజమండ్రిలో ఎక్కువ భాగం షూటింగ్ చేశాం.
చిన్న సినిమా అంటూ చిన్న చూపు
రిలీజ్ కి మాత్రం 2 నెలల టైం పట్టింది. ఇక రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు అదే సమయంలో నేను నటించిన మరో సినిమా కటకటాల రుద్రయ్య కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఆ చిత్ర నిర్మాతలని అడిగితే లేదు ఇప్పుడే రిలీజ్ చేయాలి అన్నారు. ఎందుకంటే వాళ్ళతో పాటు ఇండస్ట్రీలో అందరికీ మనవూరి పాండవులు అనేది చాలా చిన్న సినిమా అనే ఫీలింగ్. కనీసం మేకప్ కూడా లేకుండా చేశారట.. 30 రోజుల్లో షూటింగ్ చుట్టేశారట అని మాట్లాడుకుంటున్నారు. కృష్ణం రాజు, మురళి మోహన్, చిరంజీవి, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య లాంటి వారు నటించినప్పటికీ మనవూరి పాండవులు చిత్రాన్ని చిన్న చిత్రంగానే భావించారు.
సంచలనం సృష్టించిన మనవూరి పాండవులు
దీనితో మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య ఒకేసారి విడుదలైనా.. కటకటాల రుద్రయ్యకి ఎలాంటి సమస్యా ఉండదు అని అంతా భావించారు. అనుకున్నట్లుగానే కొన్ని వారాల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి అని కృష్ణంరాజు తెలిపారు. రెండు సినిమాలు 250 రోజులు ఆడాయి. ఆ టైంలో కొంత కాలం నేషనల్ అవార్డులు ఆపేసి ఉన్నారు. లేకుంటే మనవూరి పాండవులు చిత్రానికి తప్పకుండా నేషనల్ అవార్డులు దక్కేవి అని కృష్ణంరాజు పేర్కొన్నారు.














