- Home
- Entertainment
- Mysaa Business: రష్మిక మందన్నా సినిమాకి భారీ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
Mysaa Business: రష్మిక మందన్నా సినిమాకి భారీ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
రష్మిక మందన్నా ప్రస్తుతం `మైసా` చిత్రంలో నటించింది. ఇది ఈ వచ్చే వారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ లీక్ అయ్యాయి.

మైసా ప్రతీకారం, తిరుగుబాటు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు చేస్తూనే ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు `మైసా` అనే చిత్రంలో నటించింది. ఆదిలాబాద్ గోండు జాతికి చెందిన ఒక మహిళా స్ట్రగుల్స్, తిరుగుబాటు, పోరాటం ప్రధానంగా చేసుకొని ఈ చిత్రం రూపొందింది. తమ వారికి అన్యాయం జరిగితే, తన సొంత తండ్రినే కోల్పోయిన నేపథ్యంలో మైసా తిరగబడి పోరాడుతుందని, యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రం అని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆ విషయాన్ని ఆవిష్కరించాయి. రష్మిక మందన్నా చేసే యాక్షన్ గూస్‌బంమ్స్ తెప్పిస్తోంది. నిన్న విడుదలైన `ఒసేయ్ రాములమ్మ` పాట కూడా ఆకట్టుకుంటోంది. ట్రెండ్ అవుతుంది.
మైసా మూవీ బిజినెస్ లెక్కలు
వీటిని బట్టి చూస్తే ఈ సినిమా ఎంత వీరోచితంగా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇక ఈ నెల 27న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్ వివరాలు ఇప్పుడు లీక్ అయ్యాయి. ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది. ఓవర్సీస్, తెలుగు స్టేట్స్ కలిపి దాదాపు రూ.15కోట్లకు అమ్ముడుపోయిందని సమాచారం. ఇతర స్టేట్స్ బిజినెస్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రం ఓటీటీ రైట్స్ దక్కించుకుందని, శాటిలైట్, ఆడియో రైట్స్ అన్నీ కలుపుకొని దాదాపు రూ.25కోట్ల వరకు వచ్చాయని సమాచారం.
మైసా మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
`మైసా` సినిమాకి అయిన బడ్జెట్ రూ.45కోట్లు అని టాక్. ఇప్పుడు బిజినెస్ రూపంలోనే రూ.40కోట్లు వచ్చింది. ఆల్మోస్ట్ నిర్మాతకు మేజర్ బడ్జెట్ వచ్చేసింది. థియేట్రికల్‌గా మిగిలిన బడ్జెట్ రావాల్సి ఉంది. అంటే ఈ సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ముప్పై కోట్లుగా చెప్పొచ్చు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి, బాగా ఆడి, దాదాపు రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్లని వసూలు చేస్తే బయ్యర్లతోపాటు నిర్మాత కూడా సేఫ్ అవుతాడని చెప్పొచ్చు. మరి ఎంత వరకు సత్తా చాటుతుందో చూడాలి.















