Brahmamudi: కావ్యలో మొదలైన అనుమానం.. అత్త కోడళ్ళ మధ్య నిప్పు రగిల్చిన రుద్రాణి!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల మనసులను గెలుచుకొని టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తిన్నంటివాసాలు లెక్కపెడుతున్న ఒక పెంపుడు కూతురు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో పిల్లో దగ్గర ఉన్నది ఏంటో చూద్దాం అనుకుంటుంది అనామిక. ఆమెని చూడనివ్వకుండా అడ్డుకుంటాడు కళ్యాణ్. చూడవలసిన టైం వస్తే ముందుగా మీరే చూద్దురుగాని అంటాడు. నా డైలాగ్ నాకే అప్ప చెప్తున్నారా అంటూ నవ్వుతుంది అనామిక. సరే నేను బయలుదేరుతాను నేను వెళ్ళిన తర్వాత ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటానికి కింద మీ వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అంటుంది.
మరోవైపు కావ్యని ఇంప్రెస్ చేయడం కోసం కిచెన్ లో తిరుగుతూ ఉంటాడు రాజ్. నేను చెప్పేది విను అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ఇందాక నేను చెప్పేది మీరు విన్నారా ఇప్పుడు నేను కూడా వినను. అయినా మీకు కిచెన్లో ఏం పని, నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అదే మీరు చేసే పెద్ద హెల్ప్ అంటుంది. అయినా వినిపించుకోకుండా స్వీట్ చేయటంలో హెల్ప్ చేస్తాడు.
అందులో చూసుకోకుండా షుగర్ కి బదులు ఉప్పు వేస్తాడు. కావ్య స్వీట్ అనామికకి ఇవ్వడానికి పట్టుకు వెళుతుంది. అప్పుడు రాజ్ స్వీట్ లో ఉప్పు వేసిన విషయం గమనిస్తాడు. ఈ స్వీట్ గనుక కొత్త గెస్ట్ తింటే పరువు పోతుంది అనుకుంటూ కావ్య వెనుకగా వెళ్లి ఏవో కారణాలు చెప్పి ఆ స్వీట్ అనామిక తినకుండా చేస్తాడు. అనామిక మీ ఉమ్మడి కుటుంబం నాకు నచ్చింది అని చెప్పి అక్కడినుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది.
అనామికకి సెండాఫ్ ఇచ్చి లోపలికి వస్తాడు కళ్యాణ్. అందరూ అతన్ని అనుమానంగా చూస్తారు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏమి లేదు ఆమె కేవలం అభిమాని మాత్రమే అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు కళ్యాణ్. అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత సుభాష్ స్వీట్ తీసుకురమ్మని కోడలికి చెప్తాడు. వద్దు అంటాడు రాజ్. వాడు అలాగే అంటాడు కానీ నువ్వు తీసుకురా అని సుభాష్ చెప్పటంతో స్వీట్ తీసుకువచ్చి అందరికీ ఇస్తుంది కావ్య.
అది తిన్న అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఈ ఉప్పు అని అడుగుతారు. ఇదంతా మీ అబ్బాయి పని అంటుంది కావ్య. మరోవైపు అప్పు ఫ్రెండ్ సినిమాకి వెళ్దాం రమ్మంటాడు. రావాలని లేదు అంటుంది అప్పు. నువ్వు బాగా మారిపోయావు, ఎంతసేపూ ఆ కళ్యాణ్ తోనే తిరుగుతున్నావు అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఆ ఫ్రెండ్. గదిలోంచి బయటికి వచ్చిన అప్పుని ఏంటి ఇంతకామ్ గా ఉన్నావు.
నువ్వు ఇంత కామ్ గా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అంటుంది కనకం. అలాంటిదేమీ లేదు అని చెప్పి వాకిట్లో చంద్రుడిని చూస్తూ కూర్చుంటుంది అప్పు నాలో మార్పు వచ్చిందా అని ఆలోచనలో పడుతుంది . ఇదంతా చూసిన అన్నపూర్ణమ్మ అప్పు దగ్గరికి వచ్చి నువ్వు ఇలా కూర్చున్నావంటే అయితే జీవితం గురించైనా ఆలోచించాలి లేదంటే జీవిత భాగస్వామి గురించి అయినా ఆలోచించాలి అంటుంది. అలాంటిదేమీ లేదు, నేను పొద్దుపోక కూర్చున్నాను.
నువ్వు ఇలా అడుగుతావని తెలిస్తే గదిలోనే కూర్చునే దానిని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నవ్వుకుంటుంది అన్నపూర్ణమ్మ. మరోవైపు తాతయ్య దగ్గరికి వెళ్లి నా మీద కంప్లైంట్ చేసేలోపు నేనే తనని ఇంప్రెస్ చేయాలి అనుకోని కావ్య కోసం చూస్తూ ఉంటాడు రాజ్. అది గమనించిన ధాన్య లక్ష్మీ రాజ్ వెనుకగా వచ్చి అతనిని ఆట పట్టిస్తుంది. కంగారుపడిన రాజ్ నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు.
నువ్వు దొంగ పిల్లి లా కావ్య కోసం చూస్తున్నప్పుడు వచ్చాను. అయినా కావ్య ఇక్కడ లేదు తాతయ్య గదిలో ఉంది అని చెప్తుంది ధాన్యలక్ష్మి. కంగారుగా అక్కడికి వెళ్లి తాతయ్యకి అన్నీ చెప్పేస్తున్నావా అని అడుగుతాడు. చెప్పాలి కదా అంటూ ఏదో చెప్పబోతుంది కావ్య. ఆమెని వారిస్తాడు రాజ్. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటాడు సీతారామయ్య.
ఏమీ లేదు తాతయ్య ఇందాక స్వీట్ లో షుగర్ బదులు సాల్ట్ వేసేసారు అంటుంది కావ్య. తర్వాత సీతారామయ్యకి టాబ్లెట్లు ఇస్తూ ఇంతకుముందు ఇన్ని వేసుకునేవారు కాదు, ఇప్పుడు ఎందుకు ఇన్ని వేసుకుంటున్నారు అని అనుమానం గా అడుగుతుంది కావ్య. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరికొన్ని టాబ్లెట్స్ యాడ్ చేశాడు అని మేనేజ్ చేసేస్తాడు సీతారామయ్య.
అయినా టాబ్లెట్లు నేను వేసుకుంటాను కానీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని వాళ్ళిద్దర్నీ బయటికి పంపించేస్తాడు సీతారామయ్య. ఆ తర్వాత గదిలోకి వచ్చిన కావ్య తో ఈ రాజ్ నీకు థాంక్స్ చెప్తున్నాడు అంటాడు రాజ్. అందుకు షాక్ అవుతుంది కావ్య. తరువాయి భాగంలో పనావిడ అపర్ణని డబ్బులు అప్పు కావాలి అని…