Brahmamudi: భయంతో వణికిపోతున్న కావ్య.. నిజం తెలుసుకొని ఆశ్చర్యపోయిన రాజ్?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. అక్క కాపురం నిలబెట్టడం కోసం తపన పడుతున్న ఒక చెల్లెలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది అంటుంది రుద్రాణి. ముహూర్తం టైం దాటిపోయి ఐదు నిమిషాలు అయింది అని చెప్తారు పంతులుగారు. ఇంకేముంది ఇక స్వప్న వచ్చినా లాభం లేదు ఈ పెళ్లి ఆపేద్దాం అంటుంది రుద్రాణి. ఈ పెళ్లి కచ్చితంగా జరిగి తీరాలి అంటాడు రాజ్. సడన్ గా వచ్చిన రాజ్ ని చూసి అందరూ షాక్ అవుతారు.
కానీ వెనకే ఉన్న స్వప్న ని చూసి అందరూ సంతోషపడుతారు కానీ రుద్రాణి, రాహుల్ మాత్రం ఇంకా షాక్ లోనే ఉండిపోతారు. ఏం జరిగింది అని అడుగుతుంది కనకం. జరిగిందంతా చెప్తుంది కావ్య. కామరాజు తన పేరు బయటపెట్టాడేమో అని టెన్షన్ పడిపోతాడు రాహుల్. కామరాజు తనకే స్వప్నని పెళ్లి చేసుకోవాలనిపించి కిడ్నాప్ చేశాడని చెప్పాడు అని రాజ్ చెప్పటంతో రిలాక్స్ ఫీల్ అవుతాడు రాహుల్.
ముహూర్తం వేళ అయిపోయింది ఇంకా ఇప్పుడేం పెళ్లి అంటూ తప్పించుకోవాలని చూస్తుంది రుద్రాణి. నువ్వెందుకు కంగారు పడతావు ఆ విషయం చెప్పడానికి పంతులుగారు ఉన్నారు కదా అని పంతులు గారిని ముహూర్తం గురించి అడుగుతుంది అపర్ణ. ఇందాకే చూసి పెట్టానమ్మా ఇంకొక అరగంటలో మరొక మంచి ముహూర్తం ఉంది అంటారు పంతులుగారు. ఆ ముహూర్తానికి పెళ్లి చేయాలని అందరూ నిశ్చయించుకుంటారు.
ఈ హడావుడిలో స్వప్న చేతికి గాయం అవ్వటంతో ఫస్ట్ ఎయిడ్ చేయటం కోసం గదిలోకి తీసుకువెళ్తుంది కావ్య. ఆమె వెనకే వస్తారు కనకం, మీనాక్షి. భద్రాచలం నుంచి రాములవారి యాక్షన్లు పోస్టులో తెప్పించెను అవి ఈ తాటకి బ్యాగ్ లోనే ఉన్నాయి అని కావ్య తో చెప్తుంది కనకం. వాటిని తేవటం కోసం స్వప్న గదికి వెళ్లి తన బ్యాగ్ తీసి అందులో ఉన్న అక్షింతలని బయటకు తీస్తుంది.
అంతలోనే ఫోన్ రావడంతో ఎవరా అని చూస్తుంది కావ్య. అరుణ్ అన్న పేరు చూసి అక్కని పెళ్లిచూపులు చూడటానికి వచ్చిన డాక్టర్ అని గుర్తు పడుతుంది.ఈయనెందుకు ఇప్పుడు చేశారు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అరుణ్ మాట్లాడుతున్నది స్వప్నే అనుకొని నువ్వు చెప్పమన్నట్లే కడుపుతో ఉన్నట్లు చెప్పాను కానీ ఈ నిజాన్ని ఎన్నో రోజులు దాయలేవు అయితే నిజాన్ని బయట పెట్టు లేకపోతే అబద్దాన్ని నిజం చెయ్యు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అరుణ్.
విషయం విన్న కావ్య కోపంతో రగిలిపోతుంది. ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు.. అక్క కోసం ఎక్కువగా నేనే హడావిడి చేశాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆయన నన్ను జీవితాంతం క్షమించరు ఎలాగైనా నిజం చెప్పాలి అనుకొని కిందికి వస్తుంది కావ్య. కానీ అప్పటికే పెళ్లి అయిపోవడంతో ఇంకేమీ చెప్పకుండా బాధతో ఉండిపోతుంది.
డబ్బు మీద ఆశతో నిన్ను నువ్వే ఆగాధంలోకి తోసేసుకున్నవు ఈ విషయం మీ అత్తగారికి తెలిసిందంటే అట్నుంచి అటే బయటికి పంపించేస్తుంది అని టెన్షన్ తో వణికిపోతుంది. పెళ్లి పూర్తవటంతో రిలాక్స్ ఫీల్ అవుతారు కనకం దంపతులు. కూతుర్ని తీసుకెళ్లి రుద్రాణి చేతిలో పెట్టి అప్పగింతలు చెప్తుంది కనకం. మీరు చాలా తెలివైన వారు రూపాయి ఖర్చు లేకుండా చేతులు దులిపేసుకుంటున్నారు అని నిష్టూరంగా మాట్లాడుతుంది రుద్రాణి.
నిజమేనమ్మ..అందుకోసం మా కుటుంబం మీ కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటుంది అని కన్నీరు పెట్టుకుంటుంది కనకం. జాగ్రత్తగా ఉండమని, కాపురం సజావుగా చేసుకోమని స్వప్న కి జాగ్రత్తలు చెప్తాడు కృష్ణమూర్తి. స్వప్నని జాగ్రత్తగా చూసుకోమని కావ్య కే బాధ్యతని అప్పజెప్తాడు. మీ భయం మాకు అర్థమవుతుంది మేమందరమే ఉన్నాం కదా మీకు వచ్చిన భయం ఏమీ లేదు అని ధైర్యం చెప్తారు సీతారామయ్య దంపతులు.
తరువాయి భాగంలో స్వప్నని బరబరా ఈడ్చుకుంటూ వచ్చి మంచం మీద తోసేస్తుంది కావ్య. ఎందుకు అలా చేస్తున్నావు నేను నా కడుపులో బిడ్డ ఏం కావాలని అంటూ చిరాకు పడుతుంది స్వప్న. అసలు నీ కడుపులో బిడ్డ ఉంటే కదా అంటూ కోప్పడుతుంది కావ్య. స్వప్న షాక్ అవుతుంది.అప్పుడే అటువైపుగా వచ్చిన రాజ్ కూడా అనుకోకుండా ఆ మాటలు విని షాక్ అవుతాడు.