ఫ్రీ వెడ్డింగ్ 'ఈవెంట్'లో కత్రినా కైఫ్ కట్టిన చీర ఖరీదు ఎంతో తెలుసా..?
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ గా మారిన వారిలో కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ఒకరు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు వివాహబంధంతో ఒకటి కానున్నారు. ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ తన పెళ్లికి భారీ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినాకైఫ్ వెడ్డింగ్ ఫంక్షన్ కోసం ధరించిన చీరకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో కత్రినాకైఫ్ ధరించిన చీర మాత్రం ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తుందనే చెప్పవచ్చు.
ఇక ఈ చీరను డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేశారు. కస్టమ్ జార్జెట్ క్లాసిక్ టైర్డ్ రఫిల్ చీర.. సొగసైన హెయిర్ ఎంబ్రాయిడరీని కలిగి ఉన్న బ్లౌజ్ కత్రినా అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. దీనిపై అర్పితా సంతకంతో పాటు కౌరీ షెల్ డిటైలింగ్ లావెండర్, గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఈ చీరకు మరింత అందాన్ని తెచ్చి పెట్టింది.
ఈ చీరలో కత్రినాకైఫ్ అచ్చం చందమామల మెరిసిపోతుంది. ఎంతో అందమైన ఈ డిజైనర్ సారీ ఖరీదు 56 వేలు. కేవలం కత్రినా కైఫ్ మాత్రమే కాకుండా పలువురు బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ స్టార్లకు అర్పితా మెహతా డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ చీరలో కత్రినా అందం అనేది ఆకర్షణీయమైన కళ్ళతో, ఆమె హెయిర్ స్టైల్ తో మరింత ఆకట్టుకునేలా ఉంది. ఈమె క్లాసిక్ బాంబ్ షెల్ బ్లో అవుట్ హెయిర్ స్టైల్ మరింత ఆకర్షణగా ఉంది అని చెప్పవచ్చు. ఈ చీరల కత్రినాకైఫ్ ధరించిన ఫుట్ వేర్ ను డిజైనర్ అప్రాజితా టూర్ డిజైన్ చేశారు.
టాసిల్స్ తో కూడిన ఫుట్ వేర్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇలా కత్రినా కైఫ్ తన పెళ్లి విషయంలో ప్రతిదీ ఎంతో అద్భుతంగా డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె తన పెళ్ళి వేడుకల కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న సమయంలో పసుపు రంగు కుర్తా లో సందడి చేసింది. ఈ కుర్తాను డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేశారు.