కత్రినా, విక్కీ కౌశల్ మ్యారేజ్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. మూడు రోజుల పెళ్లికి సన్నాహాలు..?
బాలీవుడ్ పెళ్లికి సిద్ధమవుతున్న ప్రేమ పక్షులు చాలానే ఉన్నాయి. అందులో మోస్ట్ ప్రామిసింగ్ అనిపించే జోడీ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్. ప్రస్తుతం వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతుంది. మూడు రోజుల పెళ్లికి టైమ్ కూడా ఫిక్స్ అయ్యిందట.
బాలీవుడ్‌లో కత్రినా కైఫ్(Katrina Kaif) స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. యంగ్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) సినిమాల్లోకి రాకముందే ఆమె స్టార్ హీరోయిన్. సల్మాన్ ఖాన్, షారూఖ్, అమీర్, అక్షయ్, రణ్‌బీర్ కపూర్ ఇలా స్టార్ హీరలందరితోనూ కలిసి నటించింది. బాలీవుడ్ టాప్ స్టార్‌గా రాణిస్తుంది. హీరోయిన్లలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా నిలిస్తూ వస్తోంది. ఇప్పటికీ కమర్షియల్ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్‌గా కత్రినా నిలుస్తుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ఇప్పటికే సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌లతో ప్రేమాయాణం సాగించిన ఈ సెక్సీ బ్యూటీ.. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రేమాయణం నడిపిస్తుంది Katrina Kaif. తన కంటే ఐదేళ్లు చిన్నవాడైన యంగ్ హీరో Vicky Kaushalతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. గత ఇద్దరు స్టార్లతో కత్రీనా ప్రేమ బ్రేకప్ తీసుకుంది. అయితే ఇప్పుడు విక్కీతో మాత్రం గట్టిగా లవ్ స్టోరీని నడిపిస్తుందట. ఇది ఆశామాషీ లవ్ స్టోరీ కాదు, ఏకంగా పెళ్లి వరకు తీసుకెళ్తుందట.
కత్రినా, విక్కీ పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సీరియస్‌గా ప్రేమలో ఉన్నారని, ఘాటు ప్రేమని మ్యారేజ్ బంధంగా మల్చుకోవాలని ఇద్దరూ ప్రయత్నిస్తున్నారట. ఈ ఇద్దరు మ్యారేజ్‌కి కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందనే వార్త కూడా హల్‌చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అది కత్రినా, విక్కీ కౌశల్ మ్యారేజ్‌కి సంబంధించి డేట్స్.
డిసెంబర్ 7,8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు డెస్టినీ మ్యారేజ్ చేసుకోబోతున్నారనే టాక్ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. రాజస్థాన్‌లోని ఏడు వందల కాలం నాటి పోర్ట్ లో వీరిద్దరు చాలా గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది.
అయితే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా వీరిద్దరి మధ్య మరో ప్రత్యేకత చోటు చేసుకుందట. కాబోయే కోడలికి విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ దీపావళి కానుకగా చీర, నగలు పంపినట్టు కూడా తెలుస్తోంది. దీంతో విక్కీ కుటుంబం నుంచి కత్రీనాకు షాగున్ (ప్రత్యేక బహుమతి) అందిందంటూ బీటౌన్‌లో వీరి వివాహానికి సంబంధించిన ఊహాగానాలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
మరోవైపు దీపావళి సందర్భంగా బాలీవుడ్‌లో ఏర్పాటు చేసిన దీపావళి బాష్‌లోనూ ఈ జంట కలిసి సందడి చేసిందట. సల్మాన్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, అనన్య పాండే వంటి వారు ఇందులో పాల్గొని సందడి చేయడం విశేషం. ప్రస్తుతం ఆయా పిక్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి వేడుకల్లో నిర్మాత ఆర్తీ శెట్టి నివాసం వద్ద కత్రినా, విక్కీ కౌశల్ మెరవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కత్రినాకైఫ్.. అక్షయ్‌తో కలిసి నటించిన `సూర్యవంశీ` చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంటోంది. మరోవైపు ప్రస్తుతం కత్రినా `ఫోన్ బూత్`, `టైగర్ 3` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు విక్కీ కౌశల్ `సర్దార్ ఉద్దమ్` చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు `శామ్ బహదూర్`, `ది గ్రే ఇండియా ఫ్యామిలీ`, `మిస్టర్ లేలే` అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
aslo read: Alia bhatt:ప్రియుడుతో దివాళీ సెలెబ్రేట్ చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ అలియా!