- Home
- Entertainment
- Karthika Deepam: వంటలక్కకు ఎందుకు అంతగా భయపడుతున్నావ్.. మోనితకు షాకిచ్చిన డాక్టర్ బాబు!
Karthika Deepam: వంటలక్కకు ఎందుకు అంతగా భయపడుతున్నావ్.. మోనితకు షాకిచ్చిన డాక్టర్ బాబు!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 21వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. కార్తీక మోనితని తన బాబు పేరు అడుగుతాడు.అప్పుడు మోనిత,బాబు గారు చెప్తే గతం గుర్తొస్తుంది ఏమో అని భయపడుతుంది. అప్పుడు కార్తీక్ పేరు చెప్పమని అడగగా మోనిత మనసులో, పేరు చెప్తాను, ముఖ్యమైన విషయాలన్నీ చెప్తాను కానీ గతం గుర్తు రాకుండా చూసుకోవాలి అదే ప్రాక్టీస్ అనుకొని అని ఆనంద్ అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ ఈ పేరు నేను ఎక్కడో విన్నట్టున్నది అని అంటాడు. అప్పుడు మోనిత,నీ బాబు పేరు నువ్వు ఎందుకు మర్చిపోతావ్ కార్తీక్ ఎక్కడో గుర్తునట్టు ఉన్నది అని కవర్ చేస్తుంది. అప్పుడు కార్తీక్, బాబుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో దీప, కార్తీక్ వద్దకు వెళుతుండగా మోనిత ఆపి అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత చెప్పినా సిగ్గు లేదా ఎందుకు పదే పదే మా కాపురంలో చిచ్చులు పెడుతున్నావు అని అడగగా, దీపకి కోపం వచ్చి, కాపురం అనే మాట నువ్వు ఎత్తోధ్దు, ఇక్కడే పాతి పెట్టేస్తాను. పెళ్లయిన పరాయి మొగుడిని ఇంట్లో తెచ్చుకొని ఉంచుకోవడం కాపురం అంటారా? అని దీప అనగా మోనిత, పెళ్లి అవ్వకపోతే ఏమైంది? మా మనసులు మారాయి, కార్తీక్ తో ఒక బిడ్డని కూడా కన్నాను ఇంకేం అవసరమని అంటుంది.
అప్పుడు దీప కి కోపం వచ్చి, నువ్వు డాక్టర్ బాబుతో బిడ్డని ఎలా కన్నావో అందరికీ తెలుసు.దాన్ని ఏమంటారో ఊర్లో వెళ్లి కనుక్కో అని అంటుంది. అప్పుడు మోనిత,నువ్వు ఇలాగే కార్తీక్ కి గతం గుర్తు చేయడానికి ప్రయత్నించు, చూసావు కదా ఇందాకే ఏమైందో.నేను రాకపోయి ఉంటే ప్రాణానికి ప్రమాదం అయ్యేది అని అంటుంది. అప్పుడు దీప,గతం గుర్తు రాకూడదని మందులన్నీ వేశావు నువ్వూ డాక్టర్ వే కదా, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని కూడా చూడవా అని అంటుంది. అప్పుడు మోనిత, నాకు ఇంకేం దారి ఉందో చెప్పు, నీ లాంటోళ్లు మధ్యలో వస్తూ ఉంటారు అని అంటుంది. అప్పుడు దీప,అవును ఒకవేళ డాక్టర్ బాబు పోతే నీకు ఇంకొకలు తగులుతారు ప్రాణం అంటే లెక్క అయితే కదా అని అంటుంది.అప్పుడు మోనిత కి కోపం వచ్చి, ఆ మాట అంటే బాగోదు దీప.కార్తీక్ అంటే నాకు ప్రాణం,కేవలం కార్తీక్ మాత్రమే నా ప్రాణం. అందుకే పెళ్లయినా సరే నీడల వెంటపడి చనిపోయాడు అని నమ్మించి ఇప్పటికీ నా సొంతం చేసుకున్నాను ఇప్పుడు మధ్యలో వచ్చి నువ్వు విడదీయాలి అనుకోకు అని అనగా, నువ్వు ఎంత చేసినా సరే డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేంత వరకే.
ఇన్నాళ్లు డాక్టర్ బాబు గుర్తు రాకుండా బాగా నమ్మించావు, నేను గతం గుర్తు చేయడానికి ప్రయత్నించినా సరే అడ్డుపడ్డావు. ఇప్పుడు బాబు వచ్చాడు కదా బాబు జ్ఞాపకాల్లో ఏ ఒకటి డాక్టర్ బాబు గుర్తొచ్చిన గతం గుర్తొచ్చినట్టే .అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకొని అంటుంది. అప్పుడు దీప,డాక్టర్ బాబుని పిలుస్తుంది. బాబు బాగా అలవాటు పడ్డాడా? అని అడగగా ఇప్పుడే ఇంత ఆనందంగా ఉన్నాను అంటే గతంలో ఇంకా ఎంత బాగుండేవాడినో బాబుతో అంటాడు కార్తీక్. అప్పుడు దీప,బాధపడకండి మీకు అన్ని గుర్తొస్తాయి కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవడం కన్నా భద్రంగా దాచుకోవడమే ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత సీన్లో హిమ ఆనంద్ రావులు శౌర్య నీ కలవడానికి వస్తారు. అప్పుడు హిమా, చూసావా సౌర్య నీ పేరు నా మీద, నా పేరు నీ మీద పచ్చబొట్టు వేయించుకున్నామంటే దానికి ఏంటి అర్థం? నువ్వు నేను ఎప్పుడు కలిసి ఉండాలి కదా అని అంటుంది. అప్పుడు శౌర్య, హిమా చెయ్య తీసి, ఈ పచ్చబొట్టు ఎలా తీసుకోవాలో తెలియక ఉంచాను.
అయినా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు చెప్పాను కదా రావద్దు అని అంటుంది.అప్పుడు హిమా, ప్లీజ్ సౌర్య ఇంటికి రా అని అనగా,నీ మీద కోపంతో ఇంటికి రాను అని అనట్లేదు, నీ మీద కోపం పోతేనే ఇంటికి వస్తాను నీ మీద కోపం పోవాలంటే అమ్మ నాన్న రావాలి. వాళ్ళు ఇంక బతికే ఉన్నారని నమ్ముతున్నాను అమ్మ నాన్నలు కనిపించిన రోజు నేను కచ్చితంగా నీతో ఇంటికి వస్తాను. అప్పుడు వరకు నా జోలికి రావద్దు. మళ్లీ ఒకవేళ ఇటు వైపు వచ్చినట్టయితే మీకు కనబడలేనంత దూరం వెళ్ళిపోతాను అని అంటుంది.అప్పుడు ఆనంద్ రావు,వద్దులే సౌర్య మేము వెళ్తాము అని తీసుకెళ్తున్నప్పుడు. చివరిలో నానమ్మని అడిగానని చెప్పండి అని అంటుంది శౌర్య. వాళ్లు మళ్లీ వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆగండి ఈ పచ్చబొట్టు ఎలా తీసుకోవాలో చెప్పి వెళ్ళండి అని అనగా, శౌర్య నువ్వు పచ్చబొట్టు తీయాలని చూస్తే నా మీద ఒట్టే, అలాగే ఇంటి నుంచి కదిలిన సరే నేను చచ్చినంత ఒట్టు అని హిమా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సీన్లో కార్తీక్ ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు మోనిత, ఎక్కడికి వెళ్ళావు కార్తీక్. దీప దగ్గరికి వెళ్ళావా అని అడగగా, నీకు ఎందుకు వంటలక్క అంటే అంత భయం? నిజం చెప్పు నువ్వు నా భార్య, నేను నీ భర్తని అని నువ్వు చెప్పిన వెంటనే నమ్మను కానీ కనీసం తాళి కట్టిన ఫోటో కూడా చూపించలేదు. ఇంటికి తీసుకొచ్చిన చాలా రోజుల వరకు ఇద్దరు సంతోషంగానే ఉన్నాము తర్వాత ఎప్పుడైతే వంటలక్క వచ్చిందో అప్పటి నుంచి నీలో ఉన్న భయం మొదలైంది. ఏమైంది తప్పు చేసినట్టు ఎందుకు అలాగా భయపడుతున్నావు ఇప్పుడు నాకు నిజంగా నువ్వు నా భార్య అనుమానం వస్తుంది చెప్పు అని అరుస్తాడు. అప్పుడు మోనిత ఏడుస్తూ, ఏ సంబంధం లేకపోతే నేను ఇంట్లోకి తీసుకొచ్చి ఎందుకు ఉంచుకుంటాను కార్తీక్. ఇంత ప్రేమగా చిన్నపిల్లాడిలా ఎందుకు చూసుకుంటాను? మరి మన బాబు ఎక్కడి నుంచి వచ్చాడు. నీ కోసం మన బాబుని వదులుకునే స్థితికి కూడా వెళ్లాను నేను అని అంటుంది. అప్పుడు కార్తీక్ అలాగా మౌనంగా ఉంటాడు. అప్పుడు మోనిత, చూసావా కార్తీక్ నేను ఏడుస్తున్న సరే ఓదార్చలేని స్థితికి వచ్చేసావు నువ్వు అని అంటుంది.
ఆ తర్వాత సీన్లో దీప వాళ్ళ అన్నయ్యని పిలిచి జరిగిన విషయం అంత చెప్తుంది. ఇలాగ నేను గతం గుర్తు చేయడానికి ప్రయత్నించాను. అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు. తర్వాత లెగిసారు కానీ ఏమి గుర్తులేదు, అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య, విషయం తెలియాలంటే డాక్టర్ బాబు నే హాస్పిటల్ కి తీసుకువచ్చి స్కానింగ్ చేపించాలి. అప్పుడు నేను మా స్నేహితులతో మాట్లాడి విషయం ఏంటో కనుక్కుంటాను అని అంటాడు. ఎలాగైనా నేను తీసుకొస్తాను అని అంటుంది దీప. తర్వాత సీన్ లో మోనిత బట్టలు సర్దుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నావని అడుగుతాడు కార్తీక్.అప్పుడు మోనిత, నేను నీతో తట్టుకోలేకపోతున్నాను కార్తీక్. నువ్వు నన్ను భార్యగా చూడలేదు ఎందుకంటే నువ్వు గతం మర్చిపోయావు గుర్తులేదు అనుకోవచ్చు. కానీ నన్ను దీప తో పోలుస్తున్నావు కనిపిస్తుందా. అయినా భార్య నీ పరాయి ఆడదానితో పోల్చడం ఎందుకు? నీకు నా మీద నమ్మకం రావాలంటే నేను నిన్ను ఒక ఊరికి తీసుకెళ్తాను. అక్కడ నీకు మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు వస్తే ఇంక నీ ఇష్టం అని అంటుంది.
నీకు నామీద నమ్మకం రావడం లేదు కార్తీక్, నేను ఇంక ఈ అనుమానంతో బతకలేను ఆ ఊరు వెళ్తున్నాము పదా అనగా, తినేసి వెళ్దామని కార్తీక్ అంటాడు. ఇంతలో శివ పరిగెత్తుకుంటూ దీప దగ్గరికి వచ్చి వంటలక్క, వంటలక్క, మేడం డాక్టర్ బాబుని ఎక్కడికో తీసుకెళ్లి పోతున్నారు అని అడగంగా ఎక్కడికి అని అడుగుతుంది దీప. ఇంతలో ఏవంట వండారు చాలా బాగున్నట్టున్నది అని అనగా, ముందు విషయం చెప్పు శివ నీకు ఏ వంట కావాలంటే అది చేస్తాను అని అంటుంది.తెలీదు వంటలక్క నేను కాదు డ్రైవర్ని. వాళ్ళిద్దరే వెళ్తారట మేడం దిక్కులు చెప్తే సార్ డ్రైవ్ చేస్తారట అని అంటాడు. అప్పుడు దీప వెళ్లి,ఏ ఊరో కనుక్కొని చెప్పవా నీకు ఏ వంట కావాలన్నా చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మోనిత,కార్తీక్ కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా కార్తీక్ మోనితతో, నువ్వు నన్ను ఆ ఊరు తీసుకెళ్లాలనుకుంటే ముందే తీసుకెళ్లొచ్చు కదా!. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడుగుతాడు.
అప్పుడు మోనిత ఏడుస్తూ, నన్ను అనుమానిస్తున్నావ కార్తీక్? నా మీద ఏదైనా ఒక విషయంలో నమ్మకంగా ఉందని చెప్పు కార్తీక్ అని అనగా కార్తీక్,ఊరుకో మోనిత ఇంకా అడగనులే అని అంటాడు. కార్తీక్ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత శివ అక్కడికి వచ్చి మేడం మీరు చెప్పినట్టు వంటలక్క కి మీరు,సారు బయటకు వెళ్తున్నారు అని చెప్పాను ఏ ఊరు వెళ్తున్నారు అని అడిగారు అని అనగా, ఇప్పుడు మా వెనకాతల వంటలక్క వచ్చి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలిసి అక్కడ గుండె పగిలిపోతుంది అని ఆనందపడుతుంది మోనిత. అప్పుడు శివ ఏ ఊరు వెళ్తున్నారు మేడం అని అడగగా, మోనిత కోపంగా చూస్తుంది.వద్దులెండి నాకెందుకు అని అంటాడు శివ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!