- Home
- Entertainment
- కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
టెలివిజన్ రంగంలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు కార్తీక దీపం డాక్టర్ బాబు.. అలియాస్ నిరుపమ్ పరిటాల. ఏజ్ పెరుగుతున్నా.. హ్యాండ్సమ్ లుక్ ను మెయింటేన్ చేస్తున్న ఈ టీవీ స్టార్.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు, ఎంత ఆస్తిని సంపాదించాడో తెలుసా?

టెలివిజన్ రంగంలో సంచలనం..
టీవీ రంగంలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సీరియల్స్ లో కార్తీక దీపం సీరిల్ కూడా ఒకటి. ఈ సీరియల్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కార్తీక దీపంలో కార్తీక్ బాబు అలియాస్ డాక్టర్ బాబు పాత్రతో పాటు.. దీప పాత్ర ఆడియన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ రెండు పాత్రలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డాక్టర్ బాబు పాత్రలో నిరూపమ్ పరిటాల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్తీకదీపం సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సీరియల్ ద్వారా అందులో చేసిన నటీనటులంతా విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
వంటలక్క, డాక్టర్ బాబు క్రేజ్..
మరీ ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు భారీ స్థాయిలో అభిమానుల కూడా తయారయ్యారు. సినిమాల్లో స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్.. సీరియల్స్ లో నిరుపమ్ సాధించాడు. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు సీక్వెల్ పార్ట్ గా.. కార్తీక దీపం 2 నడుస్తోంది. ఈ సీరియల్ కూడా టాప్ 10 ర్యాంకింగ్స్ లో ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటోంది. కార్తీక్ , దీప భార్య భర్తలు గా అద్భుతమైన నటనతో దూసుకుపోతున్నారు. కాగా ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫాలోయింగ్ తో నిరుపమ్ తన రెమ్యునరేషన్ కూడా పెంచాడట.
నిరుపమ్ పరిటాల తండ్రి ఎవరో తెలుసా?
డాక్టర్ బాబుగా పేమస్ అయిన కార్తీక్, అలియాస్ నిరూపమ్ పరిటాల సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చాడు. కానీ ఆయన ఎప్పుడు తన తండ్రి పేరు వాడుకోలేదు. సొంత ట్యాలెంట్ మీదే ఎదిగి చూపించాడు. టెలివిజన్ రంగంలో హీరోయిజనాకి కొత్త తరహాలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ బాబు తండ్రి ప్రముఖ నటుడు, రచయిత ఓంకార్. ఆయనకు టాలీవుడ్ లో గొప్ప పేరు ఉంది. కానీ చిన్నవయస్సులోనే ఆయన గుండెపోటుతో మరణించారు. ఆతరువాత టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఓంకార్ తనయుడు నిరుపమ్.. తన సొంత టాలెంట్ తో ఎదిగి చూపించాడు.
డాక్టర్ బాబు రెమ్యునరేషన్..
కార్తీకదీపం మొదటిపార్టు, రెండో పార్ట్ లో కూడా కార్తీక్ బాబు పాత్రను ఫుల్ రిచ్ గా చూపించారు. నిరూపమ్ ఎంబీఏ చదివినట్టు సమాచారం. అయితే రియల్ లైఫ్‌లో కూడా నిరూపమ్ పరిటాల మంచి ఆస్తులు కలిగి ఉన్నారని తెలుస్తోంది. 37 ఏళ్ల నిరుపమ్ కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రతీ సీరియల్ కు డిమాండ్ తో పాటు ఫాలోయింగ్ కూడా పెరుగతుండటంతో.. రెమ్యునరేషన్ కూడా పెంచాడట సీరియల్ హీరో. ఒక్క రోజుకు 40 నుంచి 50 వేల వరకూ తీసుకుంటున్నాడట నిరుపమ్. ఇతర ఆదాయలతో చూసుకుంటే..
నెలకు సుమారు రూ.21 లక్షలకు పైగా ఆయన సంపాదన ఉన్నట్టు అంచనా. అంతే కాదు నిరుపమ్ ఆస్తి విషయానికి వస్తే.. తండ్రి నుంచి వచ్చిన ఆస్తి, అలాగే తన సొంత సంపాదనను కలుపుకుంటే, నిరూపమ్ మొత్తం ఆస్తి సుమారు రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని అంచన.
నిరుపమ్ పరిటాల ఆస్తులు ఎంతో తెలుసా?
తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో అభిమానులను కూడగట్టుకున్నారు నిరుపమ్ పరిటాల.. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, తన భార్య మంజులతో కలిసి హ్యాపీగా కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ, ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. నిరూపమ్ పరిటాల భార్య మంజుల కూడా బుల్లితెర నటి. ఆమె పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.
కార్తీక్ ప్రాపర్టీల విషయానికి వస్తే, విశాఖపట్నంలో సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఆస్తి ఉందని, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో సుమారు రూ.1 కోటి విలువ చేసే ప్లాట్ ఉందని సమాచారం. అంతేకాకుండా రూ.11 లక్షల విలువ చేసే రెండు కార్లు కూడా ఆయన వద్ద ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, నిరూపమ్ పరిటాల బుల్లితెర ద్వారా బాగా సంపాదిస్తున్నడని తెలుస్తోంది.

