- Home
- Entertainment
- Gossips
- ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా? రెబల్ స్టార్ లంచ్ మెనూ లో ఏముంటాయంటే?
ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా? రెబల్ స్టార్ లంచ్ మెనూ లో ఏముంటాయంటే?
ప్రభాస్ మంచి భోజన ప్రియుడన్న విషయం అందరికి తెలిసిందే. ఆయనతో ఉంటే.. రాజుల భోజన రుచి చూపిస్తాడు. ఎంతో మంది స్టార్స్ ప్రభాస్ ఆతిధ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటారు. మరి ప్రభాస్ భోజనం మెనూలో ఉండే స్పెషల్స్ ఏంటి..? ఒక రోజు ప్రభాస్ భోజనం ఖర్చు ఎంత?

ప్రభాస్ పక్కన ఉంటే రాజుల భోజనం..
రాజుల కుటుంబానికి చెందిన ప్రభాస్ రాజు…పక్కన ఉంటే.. మర్యాదలు కూడా రాజులల దర్జాకు తగ్గకుండా ఉంటాయి. ముఖ్యంగా భోజనం విషయంలో ప్రభాస్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటారు. ఆయన తినే ఫుడ్ గురించి ఎప్పుడూ.. ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక మైన చర్చ జరుగుతూనే ఉంటుంది. అంతే కాదు ప్రభాస్ ఇంటికి ఎవరైనా అతిథులుగా వస్తే, వారికి భోజనం పెట్టకుండా పంపించరన్న విషయం ఇండస్ట్రీలో అందరికి తెలుసు.
ప్రతీరోజు ఎంతో మంది ప్రభాస్ ఇంట్లో భోజనం చేసి వస్తుంటారు. ఎంత వద్దన్నా సరే, వెజ్, నాన్ వెజ్ అన్నీ వెరైటీలు చేసి మరీ తినిపించడం ప్రభాస్ కుటుంబానికి అలవాటు ప్రభాస్‌తో పనిచేసిన అనేక మంది స్టార్స్, జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా ఈ విషయం గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
ప్రభాస్ కో ఆర్టిస్ట్ లకు పండగే..
ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతుందంటే.. అక్కడ ఆయనతో కలిసి పనిచేసిన హీరోయిన్లు, కో యాక్టర్లు, పనివారితో సహా.. అందరు ప్రభాస్ ఇంటి భోజనం తినాల్సిందే. పదుల రకాల వెజ్, నాన్ వెజ్ వెరైటీలతో భోజనం చేయాల్సిందే. హీరోయిన్లు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభాస్ ఇంటి భోజనం గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రాఘవా లారెన్స్ అయితే.. ఓ సారి మాట్లాడుతూ.. ఎవరైనా కొట్టి చంపేస్తారు, తిట్టి చంపేస్తారు.. కానీ ప్రభాస్ ఇంటికి వెళ్తే.. భోజనం పెట్టి చంపేస్తారు'' అని రెబల్ సినిమా ఈవెంట్ లో సరదాగా అన్నారు.
ప్రభాస్ మెనూలో ఉండే స్పెషల్ ఐటమ్స్..
ప్రభాస్ కు భోజనంపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ.. సినిమాల విషయంలో మాత్రం ఆయన క్రమశిక్షణతో కూడిన డైట్‌ను పాటిస్తూ, తన బాడీని మెయింటేన్ చేస్తారు. ప్రభాస్ ఇంట్లో లేదా షూటింగ్ సమయంలో వెజ్, నాన్ వెజ్ వంటకాలు అనేక రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా చేపల పులుసు, మటన్, నాటు కోడి కూర, వేయించిన రొయ్యలు, ఇష్టంగా తింటారట. ఇక ప్రభాస్ కు , ఆయన పెదనాన్న కృష్ణం రాజుకు పులస చేపల పులుసంటే చాలా ఇష్టమని.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఓ సందర్భంలో అన్నారు.
ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంత?
ప్రభాస్ భోజనానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ ఒక్కరోజులో ఫుడ్ కోసం ఎంత ఖర్చు చేస్తారన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఆయన భోజనం కోసం రోజుకు 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారని ప్రచారం సాగుతోంది. ప్రభాస్ ఒంటరిగా భోజనం చేయడం చాలా అరుదు.
షూటింగ్ లో కానీ.. బయట కానీ.. ఆయనతో పాటు కనీసం 10 నుంచి 20 మంది భోజనం చేయాల్సిందే. కొన్నిసార్లు షూటింగ్ సెట్లలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా ప్రభాస్ ఇంటి నుంచి భోజనాలు తెప్పిస్తుంటారు. ప్రభాస్ కోసం ప్రత్యేకంగా కుకింగ్ టీమ్ పనిచేస్తోందని సమాచారం. ఈ టీమ్ రోజుకు సిద్ధం చేసే భోజనాల విలువ దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ ఆతిథ్యం గురించి సెలబ్రిటీల కామెంట్స్...
దర్శకుడు రాజమౌళి నుంచి హీరోయిన్లు పూజా హెగ్డే, శ్రద్ధా దాస్, కృతి సనన్, కరీనా కపూర్, దీపిక పదుకొణె, ఇలా సౌత్, బాలీవుడ్ స్టార్స్ పలువురు ప్రభాస్ ఆతిథ్యం, భోజన వెరైటీల గురించి చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. ‘సలార్’ సినిమాలో నటించిన పృథ్వీరాజ్ కూడా ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. పలువురు సెలబ్రెటీలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ ఇచ్చిన భోజన ఫొటోలను కూడా షేర్ చేశారు.

