- Home
- Entertainment
- కార్తీక దీపం డాక్టర్ బాబు కొత్త బిజినెస్, భార్యతో కలిసి నిరుపమ్ చేయబోతున్న వ్యాపారం ఏంటంటే?
కార్తీక దీపం డాక్టర్ బాబు కొత్త బిజినెస్, భార్యతో కలిసి నిరుపమ్ చేయబోతున్న వ్యాపారం ఏంటంటే?
కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెరపై స్టార్ హీరో ఇమేజ్ ను సాధించాడు నిరుపమ్ పరిటాల. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్న ఈ హీరో, తాజాగా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు.

తెలుగు బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు నిరుపమ్ పరిటాల ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. చిన్నపాటి పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి, నేడు స్టార్ టీవీ యాక్టర్స్‌లో ఒకరిగా ఎదిగిన ఆయన, ప్రస్తుతం పలు ప్రముఖ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు తన భార్య మంజులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు.
KNOW
నిరుపమ్ పారిటాల, ప్రముఖ రచయిత, నటుడు ఓంకార్ నట వారసుడిగా సినీ రంగంలోకి ప్రవేశించారు. ‘ఫిటింగ్ మాస్టర్’, ‘రభస’ వంటి సినిమాలలో కూడా నటించినప్పటికీ, అతనికి ఎక్కువ గుర్తింపు మాత్రం టీవీ సీరియల్స్ ద్వారానే దక్కింది. ముఖ్యంగా ‘కార్తీక దీపం’ సీరియల్‌లో ఆయన పోషించిన డాక్టర్ బాబు పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.ఈ సీరియల్స్ ద్వారా నిరుపమ్ కు డైహార్ట్ ఫ్యాన్స్ తయారయ్యారు. ప్రస్తుతం ‘కార్తీక దీపం 2 తో పాటు , ‘హిట్లర్ గారి పెళ్లాం’, ‘కుమారి శ్రీమతి’ తదితర సీరియల్స్‌లో నటిస్తున్నారు నిరుపమ్ పరిటాల.
తెలుగు టీవీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో నిరుపమ్ ఒకరు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఒక్క రోజు షూటింగ్‌కు సుమారు 30,000 వరకు ఆయన తీసుకుంటున్నట్లు టాక్. టీవీ సీరియల్స్‌తో పాటు వివిధ టీవీ షోలు, ఈవెంట్స్, ప్రకటనల ద్వారా ఆదాయం సంపాదిస్తూ వస్తున్న నిరుపమ్ తాజాగా వ్యాపారంలో కూడా అడుగుపెట్టారు.
శ్రీవల్లి కలెక్షన్స్ సంస్థతో కలిసి చందానగర్‌లో ఒక కొత్త క్లాత్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నట్లు నిరుపమ్ తెలిపారు. జూలై 30వ తేదీన ఈ స్టోర్ ప్రారంభోత్సవం జరగనుందని, అందరి ఆశీస్సులు కావాలని తన భార్య మంజుల తో కలిసి నిరుపమ్ ఆడియన్స్ ను కోరుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ, ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ, “ఆల్ ది బెస్ట్”, “నిరుపమ్ – మంజుల జోడికి శుభాకాంక్షలు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. టెలివిజన్ రంగంలో విజయాన్ని సాధించిన నిరుపమ్ ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్లాత్ స్టోర్ ప్రారంభం లో బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.