ఆకలి తీర్చినందుకే ఆ డైరెక్టర్ నన్ను హీరో చేశాడు.. రూ. 3 కోట్లతో సినిమా తీశాడు..
Brahmaji: కృష్ణవంశీకి, తనకు మధ్య ఉన్న బంధం కేవలం వృత్తిపరమైనది మాత్రమే కాదు, అది ప్రాణస్నేహమని బ్రహ్మాజీ పేర్కొన్నారు. కృష్ణవంశీ దర్శకుడిగా మారకముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు..

కృష్ణవంశీతో తనకున్న అనుబంధం
నటుడు బ్రహ్మాజీ దర్శకుడు కృష్ణవంశీతో తనకున్న అనుబంధం, తన సినీ ప్రస్థానంలోని కీలక విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆకలితో మొదలిన తమ అనుబంధం.. సింధూరం వరకు సాగిందన్నారు.
మంత్లీ మెస్ టికెట్ ఉండటంతో
కృష్ణవంశీ దర్శకుడిగా మారకముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆయన రెండు రోజులుగా ఆకలితో ఉన్నారనే విషయం తెలియకుండానే బ్రహ్మాజీ భోజనం పెట్టించారు. పాండీ బజార్‌లోని ఒక హోటల్‌లో తనకు మంత్లీ మెస్ టికెట్ ఉండటంతో వంశీని అక్కడికి తీసుకెళ్లారు. ఆ చిన్న సాయాన్ని కృష్ణవంశీ తన జీవితాంతం గుర్తుంచుకున్నారని బ్రహ్మాజీ భావోద్వేగంతో చెప్పారు.
చిన్న సాయానికి గుర్తుగా..
ఈ చిన్న సాయానికి గుర్తుగా కృష్ణవంశీ, నిన్నే పెళ్లాడతా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత బ్రహ్మాజీని హీరోగా పెట్టి సినిమా తీస్తానని మాట ఇచ్చారు. అంతేకాకుండా ఆ మాటను కూడా నిలబెట్టుకున్నారు. కృష్ణవంశీ తాను చేసిన సహాయాన్ని పెద్ద రుణం కింద భావించారని బ్రహ్మాజీ అన్నారు. బ్రహ్మాజీకి గులాబీతో సహా నిన్నే పెళ్లాడతా, సింధూరం, చంద్రలేఖ, ఖడ్గం వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు ఇచ్చారు.
ఆ పాత్రలతో మంచి గుర్తింపు..
గులాబీలో బ్రహ్మాజీ పాత్ర, నిన్నే పెళ్లాడతాలో ఆయన కామెడీ మంచి గుర్తింపు తెచ్చాయి. ఈ ఋణాన్ని తిరిగి తీర్చుకోగలనని తాను అనుకోవడం లేదని బ్రహ్మాజీ స్పష్టం చేశారు. చెన్నై రోజుల్లో పోసాని కృష్ణమురళి తన పక్క గదిలోనే ఉండేవారని, ఆయన ద్వారా పరుచూరి బ్రదర్స్ కార్యాలయానికి వెళ్లే అవకాశం లభించిందని బ్రహ్మాజీ తెలిపారు.
ఒక అడ్డా లాంటిది..
ఆ ఆఫీసు అప్పట్లో సినీ ప్రముఖులందరికీ ఒక అడ్డా లాంటిదని, అక్కడే తనకు ఎంతో మంది దర్శకులతో పరిచయాలు ఏర్పడ్డాయని వివరించారు. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం తనకు ఎప్పుడూ అవమానంగా అనిపించలేదని, తనకిష్టమైన సినిమా రంగంలో ఉండటమే గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆయన అన్నారు.

