- Home
- Entertainment
- Karthika Deepam 2 Today Episode : సుమిత్రకు తెలిసిపోయిన అసలు నిజం, జ్యోత్స్న కు మొదలైన టెన్షన్..
Karthika Deepam 2 Today Episode : సుమిత్రకు తెలిసిపోయిన అసలు నిజం, జ్యోత్స్న కు మొదలైన టెన్షన్..
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 16వ తేదీ)లో సుమిత్రకు అసలు నిజం తెలిసిపోతుంది.. దాసు గురించి కార్తీక్ కు అనుమానం వస్తుంది. జ్యో చేసిన పనికి దీప ఆమెపై ఫైర్ అవుతుంది.

జ్యోత్స్న పై కార్తీక్ కు అనుమానం..
దాసు అసలు నిజం చెప్పకుండా మధ్యలోనే అడ్డుకున్న జ్యో.. కిడ్నాప్ చేయించి ఒక చోట బంధిస్తుంది. మా నాన్నను జాగ్రత్తగా చూసుకోమని రౌడీలకు చెప్తుంది. దాసు మాత్రం నాకు చావంటే నాకు భయం లేదు.. ఇక నుంచి నువ్వు బ్రతకడానికి భయపడతావు, ఎలా తప్పించుకోవాలో తెలియక దొరికిపోతావు. నీ టైమ్ దగ్గర పడింది. నువ్వు జాగ్రత్త జ్యోత్స్న అని దాసు వెటకారంగా అంటాడు.
మరోవైపు కార్తీక్ దాసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీపతో మాట్లాడుతుంటాడు.. దాసు కోసం నువ్వ ఇంటికి వెళ్లిన టైమ్ లో జ్యోత్స్న అక్కడ ఉండటం ఏంటీ? అని కార్తీక్ ను దీప అడుగుతుంది. ఏదో జరిగింది. దాసు మామయ్య కచ్చితంగా తాత ఇంటికి వెళ్లాలి. కానీ అక్కడ లేడు. నా కోసం ఎదురు చూస్తున్నట్లు జ్యోత్స్న, పారిజాతం అక్కడే ఉన్నారంటే.. ఈమధ్యలో ఏదో జరిగింది. జ్యోత్స్ననే దాసు మామయ్యను ఏదో చేసి ఉండాలి. కానీ పారిజాతం కూడా అక్కడే ఉంది. ఆమెకు కొడుకుమీద చాలా ప్రేమ ఉంది. జ్యోత్స్న ఏదైనా చేయాలి అనుకుంటే.. ఆమెఊరుకోదు .. మామయ్య ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కార్తీక్ అంటాడు.
సుమిత్రకు నిజం చెప్పాలని..
ఇక ఉదయాన్నే కార్తీక్, దీప శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. సుమిత్రకు అసలు నిజం చెప్పి,ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాలి అని ముందు అనుకుంటారు. అత్తకు ఇంతవరకూ హెల్త్ గురించి చెప్పలేదు. అత్తతో నువ్వు చెప్తావా దీప? ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా? అని కార్తీక్ అంటాడు. నువ్వే మా అమ్మకు అర్థమయ్యేలా చెప్పగలవు బావా అని దీప అంటుంది. సమస్య మనొకస్తే బంధాలు గుర్తుకొస్తాయి. చెప్పలేం దీప.
మనం లేట్ చేసిన కొద్దీ అత్తకు సీరియస్ అవుతుందని కార్తీక్ అంటాడు. వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటుండగానే. అక్కడ సుమిత్ర నిద్రలేచి.. కళ్ళుతిరుగుతూ.. దగ్గుతో ఇబ్బందిపడుతుంటుంది. మామయ్యలా నేనూ నాటకం ఆడబోతున్నా... ఈ నాటకంతో అత్తను హాస్పిటల్ వరకూ తీసుకువచ్చి.. అక్కడే నిజం చెపితే.. ట్రీట్మెంట్ చేయించడం తేలిక అవుతుంది అని కార్తీక్ చెప్తాడు.
కళ్లు తిరిగి పడిపోయిన సుమిత్ర
ఒక వైపు కార్తీక్, దీప మాట్లాడుతుండగానే.. మరో వైపు మెట్ల మీద నుంచి దిగుతూ సుమిత్ర పడిపోబోతుంది. వెంటనే దీప వచ్చిసుమిత్ర పడకుండా పట్టుకుంటుంది. అందరూ కంగారుపడి హాల్లోకి వస్తారు. సుమిత్రకు కళ్లు సరిగ్గా కనిపించవు, దగ్గుతో ఇబ్బందిపడుతుంటుంది. నిద్ర లేచి చూస్తే కళ్లు సరిగ్గా కనిపించడం లేదు. నాకేమైందో అర్థం కాక కిందకు వచ్చానని సుమిత్ర అంటుంది. అత్తను హాస్పిటల్ కు తీసుకెళ్దామని కార్తీక్ అంటాడు. అసలు నాకేమయ్యింది. ఎందుకు హాస్పిటల్ కు వెళ్లాలని .. సుమిత్ర అడుగుతుంది
హాస్పిటల్ వెళ్దాం రా అత్త
ఇప్పుడు తగ్గిపోయినట్లే ఉంటుంది కానీ మళ్లీ వస్తుంది. హాస్పిటల్ వెళ్దాం అత్త అని కార్తీక్ అంటాడు. మీ మామయ్యకు హెల్త్ బాలేదని రెగ్యులర్ చెకప్ కోసం నేను వస్తే నన్ను టాబ్లెట్స్ వాడమంటున్నారు. నాకు ఎవరి మీద నమ్మకం లేదు. నేనేమైనా మంచనా పడ్డానా నాకు మీరు అందరు సేవలు చేయడానికి. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. చెప్పండి నాకేమైంది? కార్తీక్ నిజం చెప్పు. నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావ్? నేను భయంతో చచ్చిపోతున్నానని సుమిత్ర అంటుంది.
ముందు హాస్పిటల్ వెళ్దాం రా అత్త అని కార్తీక్ అడుగుతాడు. కానీ సుమిత్రకు అనుమానం పెరుగుతుంది. మీరైనా నిజం చెప్పండి అని భర్తను నిలదీస్తుంది. వాళ్లు మన క్షేమం కోరుకుంటారు. మనకు ఏం జరగకూడదనే కార్తీక్ నిన్ను హాస్పిటల్ కు రమ్మంటున్నాడంటే.. నీ క్షేమం కోసమే కదా. అదే కాంచన అయితే వచ్చేది. నువ్వు ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నావని దశరథ సుమిత్రతో అంటాడు.
సుమిత్రకు నిజం చెప్పిన జ్యోత్స్న
అసలు నాకు ఏమయ్యింది.. మీ అందరి మాటలు వింటుంటే భయం వేస్తోంది. చచ్చిపోతానేమో అనిపిస్తుంది. అసలే జరిగింది చెప్పండి అని సుమిత్ర అంటుంది. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? మీకు ఏం కాదని దీప సుమిత్రను ఒదార్చే ప్రయత్నంచేస్తుంది. నువ్వు నాకు చెపుతున్నావా.. కడుపుతో ఉన్న ఆడదానివి నువ్వు... ఇంటి దగ్గర ఉండమంటే ఉన్నావా? అని సుమిత్ర దీపను ప్రశ్నిస్తుంది. నాకున్న సమస్యను ఎవరితో చెప్పించాలో నాకు తెలుసు... జ్యోత్స్న నువ్వు నా కూతురివే కదా... నిజంగా నువ్వు నా కన్నకూతురివే అయితే.. నా మీద ఒట్టేసి నిజం చెప్పు..నాకు ఏమయ్యింది. అని తెగేసి అడుగుతుంది సుమిత్ర.
అందరిని ప్రశ్నించిన సుమిత్ర ..
ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను కన్నకూతురు కాదని ఒప్పుకున్నట్టు అవుతుందేమో.. అతని జ్యో తన మనసులో అనుకుని.. సుమిత్రకు నిజం చెప్పేస్తుంది. మమ్మీ నీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది... చెపుతుంది.. జ్యో చెప్పగానే సుమిత్ర షాక్ అవుతుంది. నాకు బ్లడ్ క్యాన్సర్ హా.. అంటే నేను ఎక్కువ రోజులు బ్రతకనా.. చచ్చిపోతానా... నా కూతురి పెళ్లి చూడకుండానే నేను చచ్చిపోతాను అని అరుస్తూ దగ్గుతే నోటి నుంచి రక్తం వస్తుంది. నాకు ఇంత పెద్ద వ్యాధి ఉందని చెప్పకుండా దాచారా? అని సుమిత్ర అందరిని ప్రశ్నిస్తుంది. దీప ఓదార్చే ప్రయత్నం చేస్తుంది, తన కొంగుతో రక్తం తుడుస్తుంది. అసలు విషయం చెప్పినందుకు జ్యోపై అరుస్తుంది. దాంత ఈరోజు కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

