MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: కాశీ, స్వప్న గొడవ-షాక్ ఇచ్చిన జ్యో-సీఈఓ పోస్ట్ ఖాళీ-న్యూ బాస్ ఎవరు?

Karthika Deepam 2 Today Episode: కాశీ, స్వప్న గొడవ-షాక్ ఇచ్చిన జ్యో-సీఈఓ పోస్ట్ ఖాళీ-న్యూ బాస్ ఎవరు?

Karthika Deepam 2 Today Episode (మే 5వ తేదీ)లో శ్రీధర్ ని సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోమన్న కాంచన. అగ్రిమెంటుకు, తన పెళ్లికి ముడిపెట్టిన జ్యోత్స్న. ఛీ కొట్టిన ఫ్యామిలీ. కాశీ, స్వప్నల మధ్య వాదన. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..  

4 Min read
Author : Kavitha G
Published : May 05 2026, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో శ్రీధర్ కి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది కాంచన. ఇకపై మీరు ఈ టెన్షన్స్ అన్నీ వదిలేయాలి అని చెప్తుండగా.. శ్రీధర్ కి ఫోన్ ల మీద ఫోన్ లు వస్తూనే ఉంటాయి. ఇవే తగ్గించుకొని, విశ్రాంతి తీసుకోవాలి. డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నారు కదా.. మరోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే ప్రాణాలకే ప్రమాదం అన్నారు అంటుంది కాంచన. నేను సీఈఓని కాంచన.. నాకు చాలా బాధ్యతలుంటాయి అంటాడు శ్రీధర్. అవన్నీ పక్కన పెట్టండి అంటుంది కాంచన.

స్వప్నను పిలిచి, ఇప్పుడే చెప్తున్నా విను... మీ ఇంట్లో ఎవ్వరి నోటి నుంచైనా గట్టిగా మాటొస్తే.. నేను రావాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తుంది కాంచన. పిల్లల్ని ఏం అనకు అంటాడు శ్రీధర్. మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం పిల్లలే అండీ.. ప్రశాంతంగా ఇంట్లో ఉండేవాణ్ని తీసుకెళ్లి సీఈఓను చేశారు. మధ్యలో పోలీసు కేసులు, నిందలు, టెన్షన్ లు.. అన్నీ పోయి నార్మల్ జీవితం రావడానికి నెలకు పైగా టైం పట్టింది అంటుంది కాంచన. తర్వాత కాశీని పిలిచి నువ్వు స్వప్నను తీసుకొని ఇంటికి వెళ్లు అని చెప్తుంది. కాంచన, శ్రీధర్, కార్తీక్.. శివన్నారాయణ ఇంటికి బయల్దేరుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
కాంచన చిరాకు
Image Credit : Jiohotstar

కాంచన చిరాకు

బావ డ్యూటీకి రాకుండా ఎక్కడికి వెళ్లాడు. ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అని ఆలోచిస్తుంటుంది జ్యోత్స్న. అంతలో కార్తీక్ వాళ్లు ఎంట్రీ ఇస్తారు. ఏంటి బావ, అత్త వాళ్లతో వచ్చావు? పెళ్లి గురించి మాట్లాడుతారా అని అంటుంది జ్యోత్స్న. అది నోరేనా అని సీరియస్ అవుతుంది కాంచన. అంతలో ఫ్యామిలీ అంతా వస్తారు. ఏమైందని పారు అడిగితే.. దీనికి సీరియస్ విషయం ఏదో, జోక్ ఏదో తెలియకుండా అయిపోయిందని చిరాకు పడుతుంది కాంచన. ఆ తర్వాత శ్రీధర్ కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కార్తీక్ చెప్పగానే అంతా షాక్ అవుతారు. మాతో ఒక్క మాట కూడా చెప్పలేదని అంటాడు దశరథ. బాధపెట్టడం ఎందుకని ఎవరితో చెప్పలేదు బావ అంటాడు శ్రీధర్.

దీప నువ్వైనా చెప్పాలి కదా అమ్మా అంటాడు దశరథ. దీప చెప్పబోయింది దశరథ.. కానీ ఈ జ్యోత్స్ననే చెప్పనివ్వలేదు అంటుంది పారు. అంతా కోపంగా జ్యోత్స్న వైపు చూస్తారు. ఎందుకు గ్రానీ నాపై అంత పెద్ద నింద వేస్తున్నావు అంటుంది జ్యోత్స్న. దీప రాగానే నువ్వు కార్తీక్ గురించి అడిగితే.. మా మామయ్య అని దీప చెప్పబోతుంటే నువ్వు ఆపలేదా అని సీరియస్ అవుతుంది పారు. శివన్నారాయణ కూడా జ్యోత్స్నను కోప్పడతాడు.

38
జ్యోత్స్న వెటకారం
Image Credit : Jiohotstar

జ్యోత్స్న వెటకారం

ఆయన ఆరోగ్యం గురించే మాట్లాడ్డానికి వచ్చాను నాన్న.. మరోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు అని శివన్నారాయణతో చెప్పి బాధపడుతుంది కాంచన. ఆయనకు విశ్రాంతినివ్వాలి. సీఈఓ బాధ్యతలు వేరేవాళ్లకు అప్పగించండి అని చెప్తుంది. ఓ మామయ్య రెస్ట్ తీసుకోవాలి కాబట్టి.. ఆ పోస్టు బావకు ఇవ్వమని అడగడానికి వచ్చావా? భలే ప్లాన్ వేశారే అని వెటకారంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. అయినా మామయ్య తరపున బావ అడగాలి. లేదంటే ఆయన ఎవరితో ఉంటున్నాడో వాళ్లు అడగాలి.. నువ్వెందుకు అడుగుతున్నావని కాంచనని తక్కువ చేసి మాట్లాడుతుంది జ్యోత్స్న. పారు, దశరథ సీరియస్ అవుతారు.

48
కార్తీక్ ఫైర్
Image Credit : Jiohotstar

కార్తీక్ ఫైర్

వాళ్లు భార్యాభర్తలుగా దూరంగా ఉన్నారు. కానీ నా తల్లిదండ్రులుగా దూరంగా లేరు. నా తండ్రికి ఆరోగ్యం బాలేకపోతే నా తల్లి ఆలోచిస్తుంది. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు అని గట్టిగా ఫైర్ అవుతాడు కార్తీక్. మా నాన్న ఆస్తి రాసియ్యాలి అనుకున్నాడు. నువ్వు ఆఫీసు రాసివ్వాలి అనుకుంటున్నావు. అన్నీ ఇచ్చేయండి అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. 

వాళ్లు ఇచ్చినా నేను తీసుకోను. నాకు ఆస్తిమీద వ్యామోహం లేదు అంటాడు కార్తీక్. నా మనుమడిని డబ్బుతో ఎవ్వరూ కొనలేరని నాకు తెలుసు అంటాడు శివన్నారాయణ. వాడు కోరుకుంటే సీఈఓ కాదు నా ఛైర్మన్ పదవి కూడా ఇస్తాను అంటాడు శివన్నారాయణ.

58
కాంచన ఆవేదన
Image Credit : Jiohotstar

కాంచన ఆవేదన

నేను చెప్పేది పూర్తిగా వినండి.. మాకు ఏ పదవులు వద్దు. ఇవ్వాల వాళ్ల నాన్నకు వచ్చిన పరిస్థితే రేపు కార్తీక్ కి కూడా రావచ్చు. ఈ టెన్షన్ లు, ఈ ఆస్తులు మాకు వద్దు నాన్ను. నా కొడుకును కూడా నాతో పంపించండి. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి అని అడుగుతుంది కాంచన.

68
అది నా చేతిలో లేదు..
Image Credit : Jiohotstar

అది నా చేతిలో లేదు..

కూతురు అడిగితే ఆయన చేయకుండా ఉండరు. మీరు చెప్పండి అంటుంది పారు. శ్రీధర్ కు విశ్రాంతినివ్వడం నా చేతుల్లోనే ఉంది. కానీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం నా చేతుల్లో లేదు. కార్తీక్ ఒప్పుకుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే కట్టాల్సిన డబ్బు నేను కడతాను. కానీ వాడు ఒప్పుకోవాలి కదా అంటాడు శివన్నారాయణ. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం కుదరదు. నా పెళ్లి జరిగేంత వరకు దీప, బావ ఇక్కడే ఉండాలి. అగ్రిమెంట్ కి కట్టుబడి ఉండాలి అని అందరికీ షాక్ ఇస్తుంది జ్యోత్స్న.

78
కాశీ, స్వప్న వాదన
Image Credit : Jiohotstar

కాశీ, స్వప్న వాదన

మరోవైపు స్వప్నతో మనం కలిసి ఉందామని రిక్వెస్ట్ చేస్తాడు కాశీ. నా తండ్రి ప్రాణాలు అడ్డం పెట్టుకొని నాతో కలిసి ఉండాలని కోరుకుంటున్నావా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది స్వప్న. మామయ్య మనకోసమే బాధ పడుతున్నారు. నీకు కలిసి ఉండడం ఇష్టం లేకపోతే.. కనీసం ఉన్నట్లు నటించు. అప్పుడైనా మామయ్య కాస్త రిలాక్స్ అవుతాడు అని రిక్వెస్ట్ చేస్తాడు కాశీ. బాగా ఆలోచించుకోమని చెప్పి వెళ్లిపోతాడు.

88
అగ్రిమెంట్ కి పెళ్లి కి లింక్
Image Credit : Jiohotstar

అగ్రిమెంట్ కి పెళ్లి కి లింక్

మరోవైపు నీ పెళ్లికి, అగ్రిమెంట్ కి సంబంధం ఏంటీ అని అడుగుతాడు శ్రీధర్. నా పెళ్లి బాధ్యత బావ తీసుకున్నాడు కాబట్టి నా మెడలో మూడు ముళ్లు పడే వరకు అగ్రిమెంట్ క్యాన్సిల్ కాదు అని చెప్తుంది జ్యోత్స్న. ఎక్కడ నా కొడుకు సీఈఓ అవుతాడో అని ముందుగానే జాగ్రత్తపడ్డావు అని జ్యోపై సీరియస్ అవుతుంది కాంచన.

నేను మాట తప్పను. నీ మెడలో మూడు ముళ్లు పడేవరకు నేను, నా భార్య ఇక్కడే ఉంటామని చెప్తాడు కార్తీక్. నెక్ట్స్ సీఈఓ ఎవరు? అని అడుగుతుంది జ్యోత్స్న. బోర్డు మీటింగ్ లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. అది నీకు అవసరం లేని విషయం అంటుంది సుమిత్ర. మేము వెళ్తామని కాంచన చెప్తే వెటకారంగా బై చెప్తుంది జ్యోత్స్న. నీ కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయి అన్నయ్య అని కోపంగా చెప్తుంది కాంచన. మీరు ఎన్ని సంబంధాలు చూసినా, నా మెడలో తాళి కట్టేది బావే అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Elimination: 2వ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనేనా? సెలబ్రెటీ ఎలా డేంజర్ జోన్ లోకి వచ్చాడు?
Recommended image2
Aasmaan Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్‌‌ కొత్త మూవీ ఆస్మాన్‌ టీజర్‌ వచ్చింది.. వామ్మో ఇలా ఉందేంటి?
Recommended image3
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చెంప పగలగొట్టిన కాంచన- పారు, జ్యో వాదన
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సూరజ్ ని మెచ్చుకున్న కార్తీక్- స్వప్నకు వార్నింగ్- పారు ఛాలెంజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved