MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: సూరజ్ ని మెచ్చుకున్న కార్తీక్- స్వప్నకు వార్నింగ్- పారు ఛాలెంజ్

Karthika Deepam 2 Today Episode: సూరజ్ ని మెచ్చుకున్న కార్తీక్- స్వప్నకు వార్నింగ్- పారు ఛాలెంజ్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ మే 2 ఎపిసోడ్ లో కొత్త హీరో సూరజ్ ని తనతో పోల్చుకున్న కార్తీక్. శ్రీధర్ ని హెచ్చరించిన డాక్టర్. జ్యోతో ఛాలెంజ్ చేసిన పారు. స్వప్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్. ఇంకా ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : May 02 2026, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్‌లో కార్తీక్ అనుకోకుండా కొత్త హీరోని ఢీకొట్టగానే అతని చేతిలో పేపర్స్ కిందపడతాయి. సారీ చెప్పి, పేపర్స్ తీసిస్తుండగా శ్రీధర్ పేరు కనిపిస్తుంది. అంటే మా నాన్నను కాపాడింది మీరేనా అని అడుగుతాడు కార్తీక్. హా అవును కార్తీక్ అంటే మీరేనా, నా పేరు సూరజ్ అని పరిచయం చేసుకుంటాడు అతను. కార్తీక్, సూరజ్ కి థాంక్స్ చెప్పి కాసేపు మాట్లాడుతాడు. 

అంతలో సూరజ్ కి ఫోన్ వస్తుంది. ఏమైందని కార్తీక్ అడిగితే ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ అయ్యాను అని చెప్తాడు సూరజ్. మీకు రుణపడిపోయాము అంటాడు కార్తీక్. అవకాశం పోతే మళ్లీ వస్తుంది. కానీ ప్రాణం రాదు కదా అంటాడు సూరజ్. చాలా రోజుల తర్వాత మంచి మనిషిని చూస్తున్నాను. మిమ్మల్ని చూస్తే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుగా ఉంది అంటాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కార్తీక్ లాగే..
Image Credit : Jiohotstar

కార్తీక్ లాగే..

ఆ తర్వాత ఇద్దరు కలిసి శ్రీధర్‌ దగ్గరికి వెళ్తారు. ఎలా ఉంది అంకుల్ అని సూరజ్ అడిగితే.. నీ దయవల్ల బాగున్నాను అని చెప్తాడు శ్రీధర్. అంతా దేవుడి దయ అంటాడు సూరజ్. నువ్వు సేమ్ నా కొడుకులాగే మాట్లాడుతున్నావంటాడు శ్రీధర్. ఆ తర్వాత సూరజ్ కాసేపు మాట్లాడి వెళ్లిపోతాడు.

37
డాక్టర్ హెచ్చరిక
Image Credit : Jiohotstar

డాక్టర్ హెచ్చరిక

తర్వాత డాక్టర్ వచ్చి.. శ్రీధర్ కి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఇప్పుడు మీకు వచ్చింది మైల్డ్ స్ట్రోక్. మరోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అది ఎలాంటి పరిస్థితులకైనా దారితీయవచ్చు. కాస్త రిలాక్స్డ్ గా ఉండండి అని చెప్తాడు. రెండు రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అని డాక్టర్ చెప్తే.. రిక్వెస్ట్ చేసి డిశ్చార్జ్ అవుతాడు శ్రీధర్.

47
కాంచన ప్రశ్నలు
Image Credit : Jiohotstar

కాంచన ప్రశ్నలు

మరోవైపు దీప ఒంటరిగా ఇంటికి వెళ్తుంది. కార్తీక్ గురించి కాంచన అడిగితే తెలియదని చెబుతుంది. తెలియకపోవడం ఏంటి, మీ ఇద్దరు గొడవపడ్డారా అని అడుగుతుంది కాంచన. లేదత్తయ్యా అని చెప్తుంది దీప. మరి ఆ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది కాంచన. కాసేపు ఆలోచించి చిన్న గొడవ జరిగిందని చెబుతుంది దీప.

కాంచన వెంటనే శ్రీధర్‌కు ఫోన్ చేసి, కార్తీక్, దీపకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లాడంటా అని చెప్తుంది. నాతోనే ఉన్నాడు అని చెప్తాడు శ్రీధర్. మీరు ఎక్కడున్నారు అని అడిగితే హాస్పిటల్ గురించి చెప్పకుండా కాంచనను కన్ఫ్యూజ్ చేసి కాల్ కట్ చేస్తాడు శ్రీధర్.

57
పారు ఛాలెంజ్
Image Credit : Jiohotstar

పారు ఛాలెంజ్

మరోవైపు దీప, సుమిత్ర కొట్టిన విషయాన్ని తలుచుకొని రగిలిపోతుంటుంది జ్యోత్స్న. అనవసరంగా అందరితో ఛీ అనిపించుకున్నాను అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు అనిపించుకోలేదు. మేము అనిపించుకునేలా చేశాము అనుకుంటూ కుర్చీలో స్టైల్‌గా కూర్చొంటుంది పారు. జ్యోత్స్నను ఇరికించేందుకు దీప, కార్తీక్ లతో కలిసి ఎలా ప్లాన్ చేసిందో అంతా చెప్తుంది. 

గెలిచానని విర్రవీగకు అంటుంది జ్యోత్స్న. నువ్వు ఓడిపోయావే పిల్ల బాతు బచ్చా. సరిగ్గా 30 రోజుల్లో నీ పెళ్లి జరుగుతుందని గట్టిగా చెప్తుంది పారు. బావే నా భర్త అంటుంది జ్యోత్స్న. ఇంట్లో నుంచి గెంటేయించుకోవడానికి రెడీగా ఉన్నట్లు ఉన్నావ్ అంటుంది పారు. తప్పు చేస్తున్నావు గ్రానీ. తర్వాత బాధపడతావ్, ఇప్పటికైనా మించి పోయింది ఏం లేదు. నాకు సపోర్ట్ చేయ్ అంటుంది జ్యోత్స్న. సరిగ్గా నెల రోజుల్లో కార్తీక్ గాడు నీ పెళ్లి చేస్తాడు గుర్తు పెట్టుకో అని ఛాలెంజ్ చేస్తుంది పారు.

67
సారీ చెప్పిన స్వప్న
Image Credit : Jiohotstar

సారీ చెప్పిన స్వప్న

మరోవైపు శ్రీధర్‌ని ఇంటికి తీసుకెళ్లి.. తన పరిస్థితి గురించి చెప్తాడు కార్తీక్. నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చేముందు ఎవరి గురించి ఆలోచించావ్ అని శ్రీధర్ ని అడుగుతాడు. నా కూతురు గురించి అని చెప్తాడు శ్రీధర్. తండ్రి, కూతుర్లకు చిన్న గొడవ జరిగిందని చెప్తుంది కావేరి. శ్రీధర్ కి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ గురించి స్వప్నకు చెప్పి వాటితో పాటు నాన్నకు కాస్త మనశ్శాంతి కూడా ఇవ్వమంటాడు కార్తీక్. దాంతో సారీ చెప్పి, ఇంకోసారి నాన్నతో గొడవపడను అన్నయ్య అంటుంది స్వప్న. 

77
కార్తీక్ ఆవేదన
Image Credit : Jiohotstar

కార్తీక్ ఆవేదన

గొడవ పడితే ఆయన ఉండడు అంటాడు కార్తీక్. దాంతో అంతా షాక్ అవుతారు. అమ్మానాన్నలు పోతే మళ్లీ తీసుకురాలేము కదా.. నాన్నను జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు కార్తీక్. కాశీ నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయల్దేరుతాడు కార్తీక్. ఈ విషయాలన్నీ అమ్మతో చెప్పకురా తట్టుకోలేదు అంటాడు శ్రీధర్. తట్టుకునేంతవరకే చెబుతాను అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. తండ్రిని చూసి ఏడుస్తుంటుంది స్వప్న. భార్యను అలాగే చూస్తూ ఉండిపోతాడు కాశీ. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image2
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image3
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇంట్లో నుంచి గెంటేస్తానన్న సుమిత్ర-శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: బావే నా భర్త- మనసు విప్పిన జ్యో- చెంప పగలకొట్టిన దీప, సుమిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved