MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: పారుతో కలిసి జ్యో కొత్త ప్లాన్- కార్తీక్ కి బిగ్ షాక్- సీఈఓగా జ్యో

Karthika Deepam 2 Today Episode: పారుతో కలిసి జ్యో కొత్త ప్లాన్- కార్తీక్ కి బిగ్ షాక్- సీఈఓగా జ్యో

Karthika Deepam 2 Today Episode (మే 14వ తేదీ)లో పారుతో కలిసి మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన జ్యో. కంపెనీ సీఈఓగా జ్యో పేరు ప్రకటించిన శివన్నారాయణ. షాక్ అయిన కార్తీక్, శ్రీధర్. ఈసారి దీప తలరాత ఎవరూ మార్చలేరన్న పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే…

3 Min read
Author : Kavitha G
Published : May 14 2026, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో మరోసారి దక్షిణమూర్తి గురించి అడగకండి అని ఫుల్ సీరియస్ అవుతుంది కాంచన. అలాగే కంపెనీ వ్యవహారాలకు కూడా దూరంగా ఉండమని కార్తీక్ తో చెప్పి వెళ్లిపోతుంది కాంచన. ఎందుకు బావ.. తాత పేరు ఎత్తగానే అందరూ ఇంత సీరియస్ అవుతున్నారు. నాకో తాత ఉన్నాడని తెలిశాక వివరాలు తెలుసుకోకుండా ఎలా ఉండాలి అని అడుగుతుంది దీప. చూశావు కదా.. ఇక ఆ విషయం గురించి వదిలెయ్. మనకు ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. ముందు వాటిని పరిష్కరించాక, ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం అంటాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జ్యోత్స్న కొత్త ప్లాన్
Image Credit : Jiohotstar

జ్యోత్స్న కొత్త ప్లాన్

మరోవైపు దక్షిణమూర్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే జ్యోత్స్న టిఫిన్ ప్లేట్ తో వచ్చి మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. సుమిత్రపై తనకు చాలా ప్రేమ ఉందని మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రేమగా సుమిత్రకు టిఫిన్ తినిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా కంపెనీ సీఈఓ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. సీఈఓ పోస్టు గురించి నీకు అవసరం లేదు అంటాడు శివన్నారాయణ. తన మనసులో మాట చెప్పనివ్వండి మామయ్య గారు అంటుంది సుమిత్ర.

ఒక నెలలో నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. అలాగే కంపెనీకి కొత్త సీఈఓ కోసం చూస్తున్నారు. ఆ ఇద్దరు ఒక్కరే ఎందుకు కాకూడదు అని అంటుంది జ్యోత్స్న. టెంపరరీగా నేను సీఈఓగా ఉంటాను అని తల్లిముందు తన కోరిక బయటపెడుతుంది. జ్యోత్స్ననే సీఈఓగా ఉండాలని సుమిత్ర శివన్నారాయణను ఒప్పిస్తుంది.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న పారు-ఏం చేయబోతోంది?
Related image2
Karthika Deepam 2 Today Episode: జ్యోనే తన సొంత మనుమరాలని తెలుసుకున్న పారు- సుమిత్ర ఆపరేషన్ పై డౌట్
37
తాళి కడితే నువ్వే సీఈఓ
Image Credit : Jiohotstar

తాళి కడితే నువ్వే సీఈఓ

తర్వాత కార్తీక్, జ్యోత్స్న కార్లో వెళ్తుంటారు. సీఈఓ ఎవరో తెలుసా బావ అని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు అయితే కాదు అంటాడు కార్తీక్. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వే సీఈఓ అవుతావు అంటుంది జ్యోత్స్న. తొందరపడకు చేస్తాను. నెల రోజులు ఓపిక పట్టు అంటాడు కార్తీక్. నా మెడలో నువ్వు తాళి కడుతుంటే, దీప నా జడ ఎత్తి పట్టుకుంటుంటే ఎంత బాగుంటుందో అంటుంది జ్యోత్స్న. పగటి కలలు కనకు.. జ్యోత్స్న అంటాడు కార్తీక్. తర్వాత ఆఫీసుకు వెళ్తారు.

47
కార్తీక్ కి బిగ్ షాక్
Image Credit : Jiohotstar

కార్తీక్ కి బిగ్ షాక్

బోర్డు మీటింగ్ జరుగుతుంటుంది. బావ ఇక్కడ ఉంటే నేను అనుకున్నది జరగదు అని మనసులో అనుకున్న జ్యోత్స్న... కార్తీక్ ని పిలిచి కార్లో ఫోన్ మర్చిపోయాను తీసుకురమ్మని అబద్ధం చెప్పి పంపిస్తుంది. జ్యో సైగ చేయగానే ఒక బోర్డ్ మెంబర్ కంపెనీకి కొత్త సీఈఓ ఎవరు అని శివన్నారాయణను అడుగుతాడు. మరోవైపు కారులో ఫోన్ కోసం వెతికిన కార్తీక్, ఇదంతా జ్యో ప్లాన్ అని అర్థం చేసుకొని ఫాస్ట్ గా వస్తుంటాడు. అప్పటికే శివన్నారాయణ సీఈఓ బాధ్యతలు జ్యోత్స్నకు అప్పగిస్తాడు. ఆ మాట విన్న కార్తీక్ షాక్ అవుతాడు.

57
జ్యోత్స్న హ్యాపీ
Image Credit : Jiohotstar

జ్యోత్స్న హ్యాపీ

నువ్వు ఇది ఊహించలేదు కదా బావ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నది సాధించినప్పుడు వచ్చే కిక్కే వేరు అని సంతోషంతో గాల్లో తేలుతుంది జ్యోత్స్న. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను సీఈఓ అయినందుకు నేను హ్యపీ, నువ్వు హ్యాపీ, ఈ న్యూస్ దీపకు తెలిస్తే దీప కూడా హ్యాపీ అనుకుంటూ బయటకు వెళ్తుంది జ్యోత్స్న.

67
సుమిత్ర సంతోషం
Image Credit : Jiohotstar

సుమిత్ర సంతోషం

దీపకు కాల్ చేసి. సుమిత్రకు ఫోన్ ఇవ్వమని చెప్తుంది జ్యోత్స్న. సుమిత్ర ఫోన్ తీసుకున్నాక స్పీకర్ ఆన్ చేయమని చెప్పి.. తనకు సీఈఓగా బాధ్యతలు అప్పగించారని సంతోషంతో కేకలు వేస్తుంది. అది చూసి సుమిత్ర మురిసిపోతుంది. పారు సంతోషాన్ని బయటకు కనబడకుండా కవర్ చేస్తుంది. ఒసేయ్ దీప.. ఆ రోజు నీ తలరాత ఆ కుబేర్ గాడు మార్చాడని కానీ, ఈ రోజు నీ తలరాత మార్చడానికి ఎవ్వరూ రారు అని మనసులో అనుకుంటుంది పారు.

77
కార్తీక్, శ్రీధర్ డౌట్
Image Credit : Jiohotstar

కార్తీక్, శ్రీధర్ డౌట్

మరోవైపు కార్తీక్, శ్రీధర్.. శివన్నారాయణతో మాట్లాడుతుంటారు. మనం అనుకున్నది ఇది కాదు కదా తాత అంటాడు కార్తీక్. ఆల్రెడీ కంపెనీకి నష్టం చేసిన వ్యక్తికి మరోసారి బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అంటాడు శ్రీధర్. ఈ నిర్ణయం వెనుక రెండు కారణాలున్నాయి అంటాడు శివన్నారాయణ. ఒకటి బయట వాళ్లను సీఈఓగా చేస్తే బోర్డు మెంబర్స్ బయటకు వెళ్తామన్నారు. రెండోది తను సీఈఓ కావాలనే కోరికను జ్యోత్న్స తన తల్లితో నా ముందే బయట పెట్టింది అంటాడు శివన్నారాయణ. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?
Recommended image2
Varanasi: రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధమే వారణాసి..అది మాత్రం చెప్పకూడదు, విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
Recommended image3
Peddi: రాంచరణ్ కంటే ముందు మెగా ఫ్యామిలీలో స్పోర్ట్స్ మూవీస్ చేసిన హీరోలు.. సూపర్ హిట్స్ కొట్టింది ఇద్దరే
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న పారు-ఏం చేయబోతోంది?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోనే తన సొంత మనుమరాలని తెలుసుకున్న పారు- సుమిత్ర ఆపరేషన్ పై డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved