MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న పారు-ఏం చేయబోతోంది?

Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న పారు-ఏం చేయబోతోంది?

Karthika Deepam 2 Today Episode (మే 13వ తేదీ)లో దీపే అసలైన వారసురాలని పారిజాతానికి నిజం చెప్పిన జ్యోత్స్న. ఇకపై ఆట తనదే అన్న పారు. దీపలో మొదలైన అనుమానం. జ్యోత్స్న కొత్త ప్లాన్. లైట్ తీసుకున్న కార్తీక్. కాంచన కోపం. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

3 Min read
Author : Kavitha G
Published : May 13 2026, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో సుమిత్ర ఆపరేషన్ గురించి ఆరా తీస్తుంది పారు. నువ్వు అసలైన వారసురాలివి కానప్పుడు సుమిత్రకు ఆపరేషన్ ఎలా జరిగింది? నీ బోన్ మ్యారో ఎలా ఇచ్చావ్? మళ్లీ నాకు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అసలు నువ్వు దాసు కూతురివా? సుమిత్ర కూతురివా? అని జ్యోత్స్నను అడుగుతుంది పారు. సుమిత్రకు కన్న కూతురే బోన్ మ్యారో ఇచ్చింది అంటుంది జ్యోత్స్న. మళ్లీ కన్ఫ్యూజ్ అవుతుంది పారు. ఎక్కడో ఉన్న కన్న కూతురు ఎలా బోన్ మ్యారో ఇచ్చింది? అని అడుగుతుంది పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
పారు షాక్
Image Credit : Jiohotstar

పారు షాక్

తల్లికి కూతురు ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఆ కూతురికి.. కన్న తల్లి ఎవరో తెలుసు అంటుంది జ్యోత్స్న. షాక్ అవుతుంది పారు. తను ఎవరో నీకు తెలుసా? అని జ్యోత్స్నను అడుగుతుంది పారు. తెలుసని షాక్ ఇస్తుంది జ్యోత్స్న. అసలైన వారసురాలు ఎవరో చెప్పు అని జ్యోను అడుగుతుంది పారు. తెలుసుకొని ఏం చేస్తావ్ అంటుంది జ్యోత్స్న. చిన్నప్పుడు వదిలేసిన ప్రాణాలు ఇప్పుడు తీస్తాను. శివన్నారాయణ మనుమరాలు ఎవరో చెప్పు అని గట్టిగా అరుస్తుంది పారు.

38
దీప డౌట్
Image Credit : Jiohotstar

దీప డౌట్

అదే టైంలో కిచెన్ లో వాటర్ తాగుతున్న దీపకు పొలమారుతుంది. కార్తీక్ వచ్చి ఎవరో నిన్ను గట్టిగానే తలుచుకుంటున్నారు మరదలా అంటాడు. పారిజాతం గారే కావచ్చు. నేను తన మనుమరాలు కాదన్న విషయం తెలిసిపోయిందేమో అని డౌట్ పడుతుంది దీప. తనకు తెలిసే ప్రసక్తే లేదు అని కొట్టి పారేస్తాడు కార్తీక్.

48
నిజం తెలుసుకున్న పారు
Image Credit : Jiohotstar

నిజం తెలుసుకున్న పారు

మరోవైపు అసలైన వారసురాలు ఎవరో చెప్పు అంటుంది పారు. చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ మనుమరాలు.. సుమిత్ర, దశరథలా కన్న కూతురు, ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో కాదు.. ఆ దీపే అంటుంది జ్యోత్స్న. పారు గుండె పట్టుకుంటుంది. నిన్ను నేను ఎలా నమ్మాలి? అని అడుగుతుంది పారు. వెంటనే తాను అంతకుముందు చేయించిన డీఎన్ఏ రిపోర్ట్స్ చూపిస్తుంది జ్యోత్స్న. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. నేనే మహానటి అనుకున్నాను. కానీ ఇక్కడ నన్ను మించిన నటులున్నారు. నిజం తెలిసిందిగా ఒక్కొక్కరిని తొక్కిపట్టి నార తీస్తానని ఆవేశపడుతుంది పారు.

58
ఒక్కటైన పారు, జ్యో
Image Credit : Jiohotstar

ఒక్కటైన పారు, జ్యో

ఇప్పుడు నువ్వు బయటపడితే నష్టం మనకే. అందరికి దీప గురించి నిజం తెలిసేలోపు ఈ ఆస్తి నా పేరు మీద రాసుకోవాలి. బావను పెళ్లి చేసుకోవాలి అంటుంది జ్యోత్స్న. వాడెందుకే నీకు? కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వదిలేయ్ అంటుంది పారు. ఆస్తి మనది కావాలంటే, నీకు ఏ నిజం తెలియనట్లే ఉండు. వాళ్లతో మంచిగా ఉంటూనే మన పని మనం చేద్దాం అని అంటుంది జ్యోత్స్న. నేను రెడీ అని చేతులు కలుపుతుంది పారు.

68
జ్యో కొత్త కుట్ర
Image Credit : Jiohotstar

జ్యో కొత్త కుట్ర

మరోవైపు హాల్లో కూర్చొని దక్షిణామూర్తి మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఒక కాల్ వస్తుంది. శివన్నారాయణ కోపంగా మాట్లాడుతాడు. ఆ మాటలకు అందరూ కిందకు వస్తారు. దశరథ ఏమైంది నాన్న అని అడిగితే.. నెల్లూరు బ్రాంచ్ లో పెద్ద ఫ్రాడ్ జరిగిందట.. ఫోన్ వచ్చిందని చెప్తాడు శివన్నారాయణ. సరే నేను వెళ్తాను మీరు రేపు బోర్డ్ మీటింగ్ చూసుకోండని చెప్పి వెళ్తాడు దశరథ. దీపకు జ్యోత్స్నపై అనుమానం వస్తుంది.

78
జ్యోపై అనుమానం
Image Credit : Jiohotstar

జ్యోపై అనుమానం

పారు, దీపను అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఏమైంది పారు ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతాడు కార్తీక్. మీరిద్దరూ చాలా కొత్తగా కనిపిస్తున్నారు అంటుంది పారు. నువ్వు కూడా అలాగే కనిపిస్తున్నావు అంటాడు కార్తీక్. నేను ఓ పిచ్చి మాలోకాన్ని. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తాను. నేనేమి కొత్తగా లేను అంటుంది పారు. సరే మేము ఇంటికి వెళ్తున్నామని చెప్పి బయల్దేరుతారు కార్తీక్, దీప.

నెల్లూరు బ్రాంచ్ లో జ్యోత్స్ననే ఏదో కుట్ర చేసినట్లు ఉంది బావ అంటుంది దీప. లేదు సమస్య నిజంగానే ఉంది అంటాడు కార్తీక్. పారిజాతం గారు కూడా ఏదో తేడాగా ఉన్నారు అని అనుమానపడుతుంది దీప. లైట్ తీసుకుంటాడు కార్తీక్.

88
కాంచన కోపం
Image Credit : Jiohotstar

కాంచన కోపం

మరోవైపు శౌర్యను చదివిస్తూ ఉంటుంది కాంచన. అంతలో కార్తీక్, దీప వస్తారు. కాసేపు మాట్లాడుకుంటారు. అమ్మా.. నీకు అత్త వాళ్ల నాన్న దక్షిణమూర్తి గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు కార్తీక్. ఉలిక్కిపడి చేతులో గ్లాస్ కింద పడేస్తుంది కాంచన. ఆ పేరు నీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అని అడుగుతుంది కాంచన. ఆయన ఈ రోజు ఇంటికి వచ్చాడని చెప్తాడు కార్తీక్. మా నాన్న ఇంట్లోకి రానిచ్చారా అంటుంది కాంచన. ఆ తాత గురించి అడిగితే ఎందుకు ఎవ్వరూ చెప్పట్లేదు అంటుంది దీప. ఎవరే నీకు తాత అని కోప్పడుతుంది కాంచన.

మన దృష్టిలో ఆ కుటుంబం ఎప్పుడో చచ్చిపోయింది. వాళ్ల దృష్టిలో మన కుటుంబం చచ్చిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ మనిషి ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేద అంటుంది కాంచన. వాళ్లకు, మనకు గొడవేంటి అని అడుగుతాడు కార్తీక్. వాళ్ల గురించి మరోసారి అడిగితే నేను చచ్చినంత ఒట్టే అంటుంది కాంచన. షాక్ అవుతారు దీప, కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image2
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోనే తన సొంత మనుమరాలని తెలుసుకున్న పారు- సుమిత్ర ఆపరేషన్ పై డౌట్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: తెరపైకి సుమిత్ర తండ్రి- శివన్నారాయణ విశ్వరూపం- తల బాదుకున్న సుమిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved