MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: జ్యోనే తన సొంత మనుమరాలని తెలుసుకున్న పారు- సుమిత్ర ఆపరేషన్ పై డౌట్

Karthika Deepam 2 Today Episode: జ్యోనే తన సొంత మనుమరాలని తెలుసుకున్న పారు- సుమిత్ర ఆపరేషన్ పై డౌట్

Karthika Deepam 2 Today Episode (మే 12వ తేదీ)లో కార్తీక్ ని మందలించిన శివన్నారాయణ. దాసు ముందు నాటకం ఆడి, పారిజాతానికి నిజం తెలిసేలా చేసిన జ్యోత్స్న. దీప, జ్యోత్స్నల వాదన. సుమిత్ర ఆపరేషన్ పై పారు డౌట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

3 Min read
Author : Kavitha G
Published : May 12 2026, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో కార్తీక్ ని మందలిస్తాడు శివన్నారాయణ. ఇకపై ఇంటికి ఎవరొచ్చినా బయటే మాట్లాడు. స్నేహితులే కాదు శత్రువులు కూడా వస్తారు. భాష, వేషం చూసి మోసపోకు అంటాడు శివన్నారాయణ. సరే తాత అని సారీ చెప్తాడు కార్తీక్. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తే మంచిది. ఇకపై ఆ పేరు గానీ ప్రస్తావన గానీ రావడానికి వీల్లేదు అని చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఆ తర్వాత దీప, కార్తీక్ కూడా వెళ్లిపోతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
నీ కళ్లు తెరిపిస్తా..
Image Credit : Jiohotstar

నీ కళ్లు తెరిపిస్తా..

నేను నిన్ను అడిగాన గ్రానీ. నా పేరు ఎందుకు చెప్పావు అని కోపంగా అడుగుతుంది జ్యోత్స్న. మరి నా మనుమడి పేరు చెప్పమంటావా అని అడుగుతుంది పారు. దీప పేరు చెప్పొచ్చు కదా.. అంటుంది జ్యోత్స్న. నా మనుమరాలి పేరు నేనేందుకు చెప్తాను అంటుంది పారు. నాకిప్పుడు బాగా అర్థం అయింది గ్రానీ.. ఒక్క అవకాశం ఇవ్వు, నీ కళ్లు తెరిపిస్తాను అంటుంది జ్యోత్స్న.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?
Related image2
Karthika Deepam 2 Today Episode: తెరపైకి సుమిత్ర తండ్రి- శివన్నారాయణ విశ్వరూపం- తల బాదుకున్న సుమిత్ర
39
డాక్టర్ సలహా
Image Credit : Jiohotstar

డాక్టర్ సలహా

మరోవైపు డాక్టర్ వచ్చి సుమిత్రను చూస్తాడు. ఆపరేషన్ జరిగి కొద్ది రోజులే అవుతోంది కదా.. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా రెండు, మూడు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఒత్తిడికి లోనైప్పుడు ఇలా కళ్లు తిరిగి పడిపోతుంటారు. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తాడు డాక్టర్. సుమిత్ర గారెని సంతోషంగా ఉండేలా చూసుకోమని చెప్పి వెళ్లిపోతాడు. నీ సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నీతో ఈ కుటుంబం ఉంది. ఈ కుటుంబం మాత్రమే ఉందని నొక్కి చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఇన్ని రోజులు పుట్టినిల్లు లేనట్లే ఉన్నావు కదా.. అలాగే ఉండమని చెప్తాడు దశరథ.

49
నిజం తెలుసుకున్న పారు
Image Credit : Jiohotstar

నిజం తెలుసుకున్న పారు

దాసును ఇంటికి పిలిచి కొత్త నాటకం మొదలుపెడుతుంది జ్యోత్స్న. ఈ ఇంట్లో వాళ్లకి నా గురించి నిజాలు తెలిస్తే నా పరిస్థితి ఏంటీ అని భయపడుతున్నట్లు దాసుతో చెప్తుంది. ఈ తండ్రి బతికున్నంత వరకు నీకు ఏం కాదమ్మా అంటాడు దాసు. చాటు నుంచి ఆ మాట విన్న పారిజాతం షాక్ అవుతుంది. మా అమ్మ నీకు విషం కలిపి పెంచింది. అందుకే నువ్వు ఇలా మారావు. ఇప్పుడు నిన్ను కన్నబిడ్డలా పెంచుకున్న కుటుంబాన్నే కాటు వేస్తున్నావ్ అంటాడు దాసు. నాకు ఈ ఆస్తి, ఈ గొడవలు వద్దు నాన్న. నేను ప్రశాంతంగా బతకాలి అనుకుంటున్నాను అని మొసలి కన్నీరు కారుస్తుంది జ్యోత్స్న. నీలో ఈ మార్పు వస్తుందని నేను అనుకోలేదు అని సంతోషిస్తాడు దాసు. అమ్మను ఎంత మోసం చేశావురా దాసు అని మనసులో అనుకుంటుంది పారు.

59
జ్యోత్స్న కోపం
Image Credit : Jiohotstar

జ్యోత్స్న కోపం

దాసు వెళ్లిపోయాక జ్యోత్స్న దగ్గరకు ప్రేమగా వస్తుంది పారు. ఇప్పటికైనా అర్థం అయిందా నీ మనుమరాలు ఎవరో అని అంటుంది జ్యోత్స్న. తప్పు చేశానని ఫీల్ అవుతుంది పారు. బావతో కలిసి నన్ను ఎంత టార్చర్ చేశావ్.. నువ్వు నాకు దూరంగానే ఉండు అని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న.

69
తాత గురించి తెలుసుకోవాలి..
Image Credit : Jiohotstar

తాత గురించి తెలుసుకోవాలి..

మరోవైపు కిచెన్ లో నిలబడి సుమిత్ర గురించి ఆలోచిస్తుంటుంది దీప. కార్తీక్ ప్లేటులో అన్నం పెట్టుకొని వచ్చి దీపకు అన్నం తినిపిస్తాడు. తింటూ దక్షిణామూర్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అమ్మ పుట్టింటి కథ మనం తెలుసుకోవాలి బావ అంటుంది దీప. ట్రై చేద్దాం అంటాడు కార్తీక్. ఆ తర్వాత దీప పొట్ట దగ్గర తలపెట్టి బేబీతో మాట్లాడుతుంటాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న, పారు లోపలికి వస్తారు.

79
అయోమయంలో పారు
Image Credit : Jiohotstar

అయోమయంలో పారు

ఏంటండి మా పనోళ్లకు స్వేచ్ఛ లేదా. నువ్వేం మాట్లాడవేంటీ పారు అంటాడు కార్తీక్. పారిజాతం అయోమయంగా మాట్లాడుతుంది. పారుకు ఏమైంది అలా ఉంది అని అడుగుతాడు కార్తీక్. ఏం కాలేదు నేను పడిపోయేలా ఉన్నాను అని వెళ్లిపోతుంది పారిజాతం. తాత దెబ్బకు పారు ఇలా అయిపోయి ఉంటుంది అనుకుంటాడు కార్తీక్.

నువ్వు తినిపించకపోతే దీప తినలేదా అంటుంది జ్యోత్స్న. పెళ్లి పెటాకులు లేని దానివి నీకేం తెలుసు మొగుడు పెళ్లాల బంధం. తొందరగా పెళ్లి చేసుకొని పిల్లలు కంటే అన్నీ తెలుస్తాయని అంటాడు కార్తీక్. అయితే, చేసుకో కంటాను అంటుంది జ్యోత్స్న. దీప కోపంగా ఏయ్, ఏం వాగుతున్నావ్ అంటుంది. కవర్ చేస్తుంది జ్యోత్స్న.

89
దీప కోపం
Image Credit : Jiohotstar

దీప కోపం

మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి అడ్డమైన వాళ్లను ఇంట్లోకి తీసుకురాకండి అంటుంది జ్యోత్స్న. ఆ మాట గొంతులోనే ఆపేయ్. కట్ చేసి కారం పెడతా. అతను నా కన్నతల్లి తండ్రి. అంటే నాకు తాత.. తన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది అంటుంది దీప. మా మమ్మీ అమ్మ అంత సీరియస్ అయిందేంటేనే తెలుస్తోంది అతనెంత దుర్మార్గుడో అంటుంది జ్యోత్స్న. మన కుటుంబంలో నీకంటే దుర్మార్గురాలు ఎవరూ ఉండరు అంటుంది దీప.

నీ గురించి నిజం తెలిసిన రోజు శివన్నారాయణ తాత దక్షిణమూర్తి తాతను ఎంత అసహ్యించుకుంటున్నారో అంతకంటే వెయ్యి రెట్లు చీదరించుకుంటారు అంటుంది దీప. నువ్వు బతికి ఉండగా అది జరగదలే దీప అంటుంది జ్యోత్స్న. త్వరలోనే అన్నీ నిజాలు బయటపడతాయి అంటాడు కార్తీక్. నువ్వు దారం కట్టి ఆడిస్తున్నవాళ్లు ఎప్పుడైనా నిజం తెలుసుకోవచ్చు. ఈ లోపు నీ ఆట నువ్వ ఆడు. నా ఆట నేను ఆడతాను అని చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఇదేంటి బావ తేడాగా మాట్లాడుతోంది అంటుంది దీప. తను అలాగే వాగుతుంది వదిలెయ్ అంటాడు కార్తీక్.

99
పారు డౌట్
Image Credit : Jiohotstar

పారు డౌట్

జ్యోత్స్న గదిలో కూర్చొని దీప కోసం తను చేసిన పనులన్నీ తలుచుకొని ఫీల్ అవుతుంది పారు. అప్పుడే జ్యూస్ గ్లాసుతో వస్తుంది జ్యోత్స్న. తెలియక చేశాను, నా కొడుకు నన్ను మోసం చేశాడు. నన్ను క్షమించవే అంటుంది జ్యోత్స్న. అందుకే నీ కొడుకుతోనే నిజం చెప్పించి... నీకు బుద్ధి వచ్చేలా చేశానని అంటుంది జ్యోత్స్న. ఇదంతా బాగానే ఉంది కానీ.. సుమిత్ర ఆపరేషన్ ఎలా జరిగింది? నువ్వు ఎలా బోన్ మ్యారో ఇచ్చావని అడుగుతుంది పారు. షాక్ అవుతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: తెరపైకి సుమిత్ర తండ్రి- శివన్నారాయణ విశ్వరూపం- తల బాదుకున్న సుమిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved