MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: తెరపైకి సుమిత్ర తండ్రి- శివన్నారాయణ విశ్వరూపం- తల బాదుకున్న సుమిత్ర

Karthika Deepam 2 Today Episode: తెరపైకి సుమిత్ర తండ్రి- శివన్నారాయణ విశ్వరూపం- తల బాదుకున్న సుమిత్ర

Karthika Deepam 2 Today Episode (మే 11వ తేదీ)లో శివన్నారాయణ ఇంటికి వచ్చిన సుమిత్ర తండ్రి. ఆవేశంతో ఊగిపోయిన శివన్నారాయణ. తలను గోడకు బాదుకొని స్పృహ తప్పిన సుమిత్ర. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో కార్తీక్, దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే  

3 Min read
Author : Kavitha G
Published : May 11 2026, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో కార్తీక్, దీప శివన్నారాయణ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక పెద్దమనిషి నిలబడి ఉంటాడు. ఎవరు మీరు.. ఎందుకు ఇక్కడే ఆగిపోయారు అని అడుగుతాడు కార్తీక్. శివన్నారాయణను కలవడానికి వచ్చాను అని చెప్తాడు ఆ పెద్దమనిషి. ఓ అంతేనా నేను తీసుకెళ్తా పదండి. ఈ ఇంట్లో వాళ్లందరూ నాకు బాగా కావాల్సిన వాళ్లే అని ఒక్కో క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్తాడు కార్తీక్. వీళ్లను బాల్కనీ నుంచి చూసిన పారు.. దక్షిణామూర్తి వచ్చాడా.. అని భయంతో హడావిడాగా పరుగెత్తుకొని వచ్చి శివన్నారాయణను ఢీ కొడుతుంది. కోప్పడతాడు శివన్నారాయణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
కోపంతో ఊగిపోయిన శివన్నారాయణ
Image Credit : Jiohotstar

కోపంతో ఊగిపోయిన శివన్నారాయణ

ఇంతలో కార్తీక్ లోపలికి వచ్చి తాత నీకో సర్‌ప్రైజ్ అని వచ్చిన పెద్దాయనని పిలుస్తాడు. దక్షిణామూర్తిని చూసి శివ నారాయణ కోపంతో ఊగిపోతాడు. నీ చిన్ననాటి స్నేహితున్ని చూసి సర్‌ప్రైజ్ అయ్యావా తాత అంటాడు కార్తీక్. వాడు స్నేహితుడు కాదు.. శత్రువు అని కోపంగా అరుస్తాడు శివన్నారాయణ. నా ఇంటికి ఎందుకు వచ్చావురా వెళ్లిపో అంటాడు.

38
సుమిత్ర షాక్
Image Credit : Jiohotstar

సుమిత్ర షాక్

నాకు కావాల్సిన వాళ్లు ఈ ఇంట్లోనే ఉన్నారు అంటాడు దక్షిణామూర్తి. అప్పుడే వచ్చిన సుమిత్ర, దక్షిణామూర్తిని చూసి షాక్ తో చేతిలో ప్లేట్ కింద పడేస్తుంది. బాగున్నావా అమ్మా అని సుమిత్రను అడుగుతాడు దక్షిణమూర్తి. బతికి ఉన్నావా అని అడగండి అంటుంది సుమిత్ర. అలా అంటావేంటమ్మా నేను నీ తండ్రిని అంటాడు దక్షిణమూర్తి.

48
శివన్నారాయణ విశ్వరూపం
Image Credit : Jiohotstar

శివన్నారాయణ విశ్వరూపం

నా కూతురు చనిపోయిందని కర్మకాండలు చేసినప్పుడు ఏమైంది ఈ తండ్రి ప్రేమ, తిలోదకాలు వదిలనప్పుడు ఏమైంది అని ఆవేశంతో ఊగిపోతాడు శివన్నారాయణ. నీతి లేని నీ కుటుంబంతో వియ్యం అందడమే నా తప్పు అంటాడు దక్షిణామూర్తి. కోపంతో చేయి ఎత్తుతాడు శివన్నారాయణ. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు కార్తీక్, దీప.

నా కూతురు చనిపోయిందని కర్మకాండలు చేసినప్పుడు ఏమైంది ఈ తండ్రి ప్రేమ, తిలోదకాలు వదిలనప్పుడు ఏమైంది అని ఆవేశంతో ఊగిపోతాడు శివన్నారాయణ. నీతి లేని నీ కుటుంబంతో వియ్యం అందడమే నా తప్పు అంటాడు దక్షిణామూర్తి. కోపంతో చేయి ఎత్తుతాడు శివన్నారాయణ. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు కార్తీక్, దీప.

58
స్పృహ తప్పి పడిపోయిన సుమిత్ర
Image Credit : Jiohotstar

స్పృహ తప్పి పడిపోయిన సుమిత్ర

నువ్వు నీ కూతురు చనిపోయిందని ఎలా అనుకున్నావో.. నేను నా తండ్రి చనిపోయాడని అలాగే అనుకున్నాను. ఇక్కడినుంచి వెళ్లిపో అని తిడుతుంది సుమిత్ర. నేను నిజంగా చస్తే కానీ ఊరుకోవా.. అని గోడకు తల బాదుకొని స్పృహ తప్పి పడిపోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో అని దక్షిణామూర్తిని అంటాడు శివన్నారాయణ. ఈ రోజు నేను వెళ్తాను కానీ, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుందని చెప్పి వెళ్లిపోతాడు దక్షిణమూర్తి.

68
ఈ కథ తెలుసుకోవాలి
Image Credit : Jiohotstar

ఈ కథ తెలుసుకోవాలి

సుమిత్రను గదిలోకి తీసుకెళ్తారు. అంతా సేవలు చేస్తూ ఉంటారు. దీప దక్షిణామూర్తి కోసం వెతుక్కుంటూ బయటకు వస్తుంది. కార్తీక్ ని అడుగుతుంది ఆయన వెళ్లిపోయారా అని. వెళ్లిపోయాడు అని చెప్తాడు కార్తీక్. తాత ఉన్నాడంటే అమ్మకు కుటుంబం కూడా ఉన్నట్లే కదా. ఈ కథేంటో మనం తెలుసుకోవాలి అంటుంది దీప.

78
శివన్నారాయణ కోపం
Image Credit : Jiohotstar

శివన్నారాయణ కోపం

ఆ తర్వాత కార్తీక్, దీప కలిసి పారిజాతం దగ్గరికి వెళ్లి విషయం అడుగుతారు. నేను నోరు విప్పానంటే గొడవలు అయిపోతాయిరా, అవన్నీ మీరు తెలుసుకోకపోవడమే మంచిది అంటుంది పారు. దీంట్లో దాచేదేముంది. చెప్పు పారు అంటాడు కార్తీక్. పారు స్టార్ట్ చేయగానే, శివన్నారాయణ కోపంగా పారిజాతం అంటాడు. ఆ వ్యక్తి పేరు ఈ ఇంట్లో మరోసారి వినబడ్డానికి వీల్లేదు. అయినా నిన్ను ఆ విషయాల గురించి ఎవరు అడిగారు అంటాడు. జ్యోత్స్న అడిగిందని అబద్ధం చెప్తుంది పారు.

88
కార్తీక్ కి వార్నింగ్
Image Credit : Jiohotstar

కార్తీక్ కి వార్నింగ్

జ్యోత్స్నను సీరియస్ గా చూసిన శివన్నారాయణ.. మీ అమ్మకు ఏ కుటుంబం లేదు. చనిపోయింది. ఇప్పుడు వాళ్ల జాతకాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అసలు దక్షిణామూర్తిని తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతాడు. బావ తీసుకొచ్చాడని కార్తీక్ ని ఇరికిస్తుంది జ్యోత్స్న. ఎవరో తెలియక తీసుకొచ్చాని చెప్తాడు కార్తీక్. ఇకపై ఎవరొచ్చిన ఇంటి బయటే మాట్లాడు. స్నేహితులే కాదు శత్రువులు కూడా వస్తారు. వేషం చూసి మోసపోకు అంటాడు శివన్నారాయణ. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇరికించిన దీప-ఛీ కొట్టిన సుమిత్ర-నోరు జారిన పారు-కాంచన కోపం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved