MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?

Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?

Karthika Deepam 2 Today Episode (మే 9వ తేదీ)లో కాశీ, స్పప్నల గొడవ. స్వప్న చెంప పగలకొట్టిన కావేరి. ఇల్లును కోర్టుగా మార్చిన శ్రీధర్. కావేరి, శ్రీధర్ లను తన ఇంటికి తీసుకెళ్తానన్న కార్తీక్. ఒక్కటైన కాశీ, స్వప్న. ఈ రోజు ఇంకా ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : May 09 2026, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో మా మామయ్య గారెని కాపాడినందుకు మా ఫ్యామిలీ తరపున థాంక్యూ అని సూరజ్ కి చెప్తుంది దీప. ఆ తర్వాత దీప, కార్తీక్, సూరజ్ కాసేపు మాట్లాడుకుంటారు. కార్తీక్ గురించి తనకు ముందే తెలుసని చెప్తాడు సూరజ్. ఆ రోజు హాస్పిటల్లో ఏదో అవకాశం మిస్ అయిందన్నావు.. సాఫ్ట్ వేర్ అనుకున్నాను.. నువ్వేమో ఈ స్టాల్ పెట్టావు అంటాడు కార్తీక్. 

అవును బ్రదర్ నేనేప్పుడూ అంతే.. నాకు నచ్చిందే చేస్తాను అంటాడు సూరజ్. మీరు ఏం చదువుకున్నారు బ్రదర్ అని అడుగుతాడు కార్తీక్. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను అని చెప్తాడు సూరజ్. ఆ తర్వాత సూరజ్ చేసిచ్చిన జ్యూస్ తాగి, బాగుందని మెచ్చుకుంటారు దీప, కార్తీక్. ఆ తర్వాత మీకు పెళ్లి అయిందా బ్రదర్ అని సూరజ్ ని అడుగుతాడు కార్తీక్. 

ఇప్పటివరకు నన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఎదురపడలేదు అని చెప్తాడు సూరజ్. ఇక వెళ్తాస్తామని చెప్పి బయల్దేరుతారు కార్తీక్, దీప. తను పైకి చెప్పట్లేదు కానీ అతనికి అవకాశం మా నాన్నను కాపాడటం వల్లే పోయింది అని దీపతో అంటాడు కార్తీక్. అవకాశం వచ్చినప్పుడు అతని రుణం తీర్చుకోవాలని చెప్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
స్వప్న చెంప పగలగొట్టిన కావేరి
Image Credit : Jiohotstar

స్వప్న చెంప పగలగొట్టిన కావేరి

మరోవైపు బయట కూర్చొని ఉంటుంది స్వప్న. కాశీ వెళ్లి.. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అని అడుగుతాడు. మా నాన్న హెల్త్ ని అడ్డం పెట్టుకొని చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అంటుంది స్వప్న. కావేరి వచ్చి మన ఫ్యామిలీ మంచి కోసమేగా కాశీ చెప్పేది అంటుంది. ఇది నా ఫ్యామిలీ అని నొక్కి చెప్తుంది స్వప్న. మామయ్య గురించి ఒకసారి ఆలోచించు అంటాడు కాశీ.

నా తండ్రి గురించి ఆలోచించడానికి నువ్వు ఎవరు. నువ్వు ముందు పోరా బయటకి.. అంటుంది స్వప్న. రా అంటావా అంటుంది కావేరి. వీడోక అవకాశవాది అమ్మా. చావును అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నాడు. నా తండ్రి చచ్చిపోయినా నేను వీడిని యాక్సెప్ట్ చేయను అని అంటుంది స్వప్న. లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది కావేరి. ఈ మాట మీ నాన్న వింటే ఏమవుతుందో తెలుసా అంటుంది కావేరి ఆవేశంగా. ఏమవుతుంది కావేరి. ఏం కాదు. విన్నాను కదా అంటాడు శ్రీధర్. ఇంట్లోకి రండి ఈ సమస్యకు ఈ రోజే ఫుల్ స్టాప్ పెట్టాలి అంటాడు శ్రీధర్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇరికించిన దీప-ఛీ కొట్టిన సుమిత్ర-నోరు జారిన పారు-కాంచన కోపం
Related image2
Karthika Deepam 2 Today Episode:కాంచనకు ఒట్టేసిన దీప, కార్తీక్-జ్యోకు షాకిచ్చిన సూరజ్-సుమిత్ర కంగారు
36
ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి..
Image Credit : Jiohotstar

ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి..

ఆ తర్వాత శ్రీధర్ ఇంటికి కార్తీక్ వస్తాడు. నన్ను ఎందుకు రమ్మన్నావ్ మాస్టర్ అని అడుగుతాడు. నేను అరిచి అరిచి పడిపోతే నువ్వే నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని చెప్తాడు శ్రీధర్. ఈ రోజు ఎలాగైనా ఈ మొగుడు పెళ్లాల సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఇల్లే కోర్టు, నేనే న్యాయవాది, నువ్వే జడ్డ్. ఓ తండ్రి వాదించబోతున్న కూతురి విడాకుల కేసు. ఈ కేసులో తక్షణమే తీర్పు కావాలి అంటాడు శ్రీధర్.

46
కార్తీక్ వార్నింగ్
Image Credit : Jiohotstar

కార్తీక్ వార్నింగ్

కార్తీక్, కావేరిని పిలిచి.. పిన్ని, నాన్నవి, నీవి బట్టలు సర్దు అంటాడు. ఎందుకు అన్నయ్య అంటుంది స్వప్న. మా ఇంటికి తీసుకెళ్తాను అంటాడు కార్తీక్. మరి నేను అంటుంది స్వప్న. నువ్వు ఏకాంతం కోరుకుంటున్నావ్ కదా.. ఇక్కడే ఉండు అంటాడు కార్తీక్. కాశీ తప్పు చేశాడు అన్నయ్య అని స్వప్న అంటే.. ఇంకా ఎన్నిరోజులు అదే మాట చెప్తావు.. నువ్వు మీ పెద్దమ్మను చూసి నేర్చుకుంటున్నావేమో.. అదే నిజమైతే, భర్తను దూరం పెట్టడమే కాదు.. తన ఆరోగ్యం బాగోలేకపోతే తను ఎలా విలవిలలాడిందో కూడా నేర్చుకో. మీకు 5 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. ఏమైనా మాట్లాడుకోండి. కలిసి ఉంటామంటే నాన్నను ఇక్కడే వదిలేసి వెళ్తా. లేదు అంటే తీసుకెళ్లిపోతా అంటాడు కార్తీక్.

56
ఒక్కటైన కాశీ, స్వప్న
Image Credit : Jiohotstar

ఒక్కటైన కాశీ, స్వప్న

దాంతో స్వప్న, కాశీ పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. లాస్ట్ కి చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అంటాడు కాశీ. ఇద్దరు కలిసి కార్తీక్ వాళ్ల దగ్గరకు వస్తారు. మీ నిర్ణయం చెప్పమంటాడు కార్తీక్. మేము కలిసే ఉంటామని చెప్తుంది స్వప్న. అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాశీ చేతిలో స్వప్న చేయి పెట్టి జీవితాంతం హ్యాపీగా ఉండమని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్.

66
కాంచన సంతోషం
Image Credit : Jiohotstar

కాంచన సంతోషం

ఇంటికి వెళ్లిన కార్తీక్.. దీప, కాంచనలతో కాశీ, స్వప్న కలిసిపోయిన విషయం చెప్తాడు. కాంచన సంతోషిస్తుంది. మీ నాన్న అదృష్టవంతుడు.. అర్థం చేసుకునే కూతురు ఉంది అంటుంది కాంచన. మీరు కూడా అదృష్టవంతులే మీకు అర్థం చేసుకునే కొడుకు ఉన్నాడు అంటుంది దీప. కార్తీక్ కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటుంది కాంచన. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలిసిన రోజు నువ్వు ఈ బాధలన్నీ మర్చిపోయి, చాలా సంతోషిస్తావమ్మా అంటాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇరికించిన దీప-ఛీ కొట్టిన సుమిత్ర-నోరు జారిన పారు-కాంచన కోపం
Recommended image2
Karthika Deepam 2 Today Episode:కాంచనకు ఒట్టేసిన దీప, కార్తీక్-జ్యోకు షాకిచ్చిన సూరజ్-సుమిత్ర కంగారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved