- Home
- Entertainment
- Karthika Deepam: కార్తీకదీపంలో హైలెట్ సీన్.. లేడీ విలన్ రుద్రాణి చెంప పగలకొట్టిన వంటలక్క!
Karthika Deepam: కార్తీకదీపంలో హైలెట్ సీన్.. లేడీ విలన్ రుద్రాణి చెంప పగలకొట్టిన వంటలక్క!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కుటుంబ కథా నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

కార్తీక్ (Karthik) .. హిమ (Hima), సౌర్యలను (Sourya) తన దగ్గర కూర్చోబెట్టుకుని కాసేపు మాట్లాడుతుంటాడు. ఇక మాట మధ్యలో ఇక్కడి వాళ్లకు మీ నాన్న డాక్టర్ అని చెప్పకూడదు అని అనేసరికి పిల్లలిద్దరి షాక్ అవుతారు. అదేంటి నాన్న అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు.
మీరు గొప్ప డాక్టర్ అని అందరికీ చెప్పుకున్నాము అంటూ బాధపడతారు. ఇక మీ నాన్న ఏం చేస్తున్నాడు అని అడిగితే ఏం చెప్పాలి అని సౌర్య (Sourya) ప్రశ్నించడంతో ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తాడని చెప్పడమ్మ అనేసరికి పిల్లలు చాలా బాధ పడతారు.
ఇప్పుడు చెప్పండి మీ నాన్న ఏం చేస్తారు అని కార్తీక్ (Karthik) అడిగేసరికి.. వాళ్లు కూడా అదే మాట చెప్పుకుంటూ బాగా ఏడుస్తారు. ఇక దీప (Deepa) ఒక స్కూల్లో పని కోసం వెళ్తుంది. అక్కడ ఏమి పని లేదని మధ్యాహ్నం భోజనం పని మాత్రమే ఉందని చెప్పేసరికి అందులో చేస్తాను అని అంటుంది దీప.
నాకు వంటలు వచ్చని ఎంతమందికైనా భోజనం చేసి పెడతాను అని అంటుంది దీప (Deepa). ఇంతకుముందుకు ఇందులో శ్రీవల్లి (Srivalli) చేసేదని ఇప్పుడు తాను హైదరాబాద్ హాస్పిటల్ లో ఉందని చెబుతుంది. ఇక దీప మధ్యమధ్యలో తన గతాన్ని తలచుకుంటూ బాధపడుతుంది.
మరో వైపు రుద్రాణి (Rudrani) దగ్గరకు తన మనుషులు కార్తీక్ (Karthik) కొట్టాడన్న విషయాన్ని చెబుతారు. ఇక రుద్రాణి మాట్లాడుతూ.. ఆ ఒక్కడు మీ ముగ్గురిని కొడితే మీరు పారిపోయి వచ్చారు అంటూ.. మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడకుండా వారితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ ముగ్గురు మాత్రం ఆశ్చర్యపోతారు.
మోనిత (Monitha) తన బాబు ఆనందరావు కోసం బొమ్మలు తీసుకురావడానికి తన బాబు ని పట్టుకొని వస్తుంది. ప్రియమణి (Priyamani) లేకపోవడంతో ఎప్పుడు ఇలానే చేస్తుంది అని అనుకుంటుంది. ఇక బాబు ని కారులో వదిలి అక్కడ ఒక అబ్బాయి కి అప్పజెప్పి వెళ్తుంది. కానీ అంతలోనే ఓ వ్యక్తి వచ్చి మోనిత బాబును ఎత్తుకెళ్తాడు.
మోనిత (Monitha) షాపింగ్ పూర్తి చేసుకుని వచ్చి చూసే వారికి బాబు ఉండడు. అక్కడే ఉన్న వ్యక్తిని అడగటంతో ఇక్కడ ఓ వ్యక్తి వచ్చి నిల్చున్నాడని అంటాడు. ఇదంతా ఆదిత్య (Adithya) పని అని అనుకుంటుంది మోనిత. తన కారు పాడటంతో వెంటనే అక్కడి నుంచి తనకు తెలిసిన ఒకావిడ బైక్ తీసుకొని వెళ్ళి పోతుంది.
కార్తీక్ (Karthik) ఒంటరిగా కూర్చొని పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధపడతాడు. అప్పుడే పిల్లలు వచ్చి అమ్మ ఏది అనేసరికి దీప (Deepa) ఇంట్లోకి వస్తుంది. ఇక తాను ఒక స్కూల్లో మధ్యాహ్న భోజనం చేయడానికి వెళ్తున్నానని పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుకుంటారని అనడంతో కార్తీక్ బాధపడతాడు.
ఆనందరావు (Anadharao), సౌందర్య (Soundarya) కార్తీక్ వాళ్ళను తలచుకుంటూ బాధపడతారు. తరువాయి భాగంలో మోనిత స్కూటీతో ఇంట్లోకి వచ్చి కార్తీక్ బాబు లేడు అంటూ రచ్చ చేస్తుంది. ఇక దీప వాళ్లు భోజనం చేస్తుండగా రుద్రాణి వచ్చి వాళ్లకు అరవటంతో వెంటనే దీప రుద్రాణి చంప పగలగొడుతుంది.